సాక్షి, నర్సీపట్నం: అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను అడ్డుకోవడంతో వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు. దీంతో, అక్రమ కేసులను నిరసిస్తూ నేడు వైఎస్సార్‌సీపీ శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో పోలీస్ యాక్ట్-30 అంటూ వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారు.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయన్నపాత్రుడి నియోజకవర్గంలో అరాచకం చోటుచేసుకుంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిని ప్రశ్నించడమే నేరంగా మారింది. ఇసుక రవాణాను ప్రశ్నించినందుకు గాను పోలీసులు.. వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడంపై పార్టీ నేతలు నేడు శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలీస్ యాక్ట్-30 అమలులో ఉందంటూ వైఎస్సార్‌సీపీ నేతలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు.
శాంతియుత ర్యాలీకి వైఎస్సార్‌సీపీ శ్రేణులు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు. బుధవారం ఉదయమే మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నివాసానికి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్బంగా పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఇక, మంగళవారం రాత్రి నుంచే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను, నేతలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల ఓవరాక్షన్‌పై ఉమాశంకర్ గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, పోలీసులు తీరుతో అటు సామన్య ప్రజలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment