narsipatanam
-
నర్సీపట్నంలో టెన్షన్.. పోలీసుల ఓవరాక్షన్!
సాక్షి, నర్సీపట్నం: అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను అడ్డుకోవడంతో వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు. దీంతో, అక్రమ కేసులను నిరసిస్తూ నేడు వైఎస్సార్సీపీ శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో పోలీస్ యాక్ట్-30 అంటూ వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారు.ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయన్నపాత్రుడి నియోజకవర్గంలో అరాచకం చోటుచేసుకుంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిని ప్రశ్నించడమే నేరంగా మారింది. ఇసుక రవాణాను ప్రశ్నించినందుకు గాను పోలీసులు.. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడంపై పార్టీ నేతలు నేడు శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలీస్ యాక్ట్-30 అమలులో ఉందంటూ వైఎస్సార్సీపీ నేతలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు.శాంతియుత ర్యాలీకి వైఎస్సార్సీపీ శ్రేణులు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు. బుధవారం ఉదయమే మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నివాసానికి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్బంగా పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఇక, మంగళవారం రాత్రి నుంచే వైఎస్సార్సీపీ కార్యకర్తలను, నేతలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల ఓవరాక్షన్‌పై ఉమాశంకర్ గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, పోలీసులు తీరుతో అటు సామన్య ప్రజలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. -
రాచబాటల్లో రయ్ రయ్!
జిల్లాలో రోడ్ల ఆధునీకరణ, నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చాలాచోట్ల నిర్మాణ పనులు దాదాపుగాపూర్తయ్యాయి. వర్షాలకు దెబ్బతిన్న రహదారుల గుర్తించిన ప్రభుత్వం రోడ్ల విస్తరణ, ఆధునీకరణ, అభివృద్ధికి అధికమొత్తంలో నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో పనులు చేపట్టడంతో వందలాది గ్రామాలకు రహదారి సౌకర్యం ఏర్పడింది. పాడేరు, రంపచోడవరం డివిజన్ల పరిధిలో రహదారులు కొత్తశోభను సంతరించుకున్నాయి. పాడేరు/రంపచోడవరం: పాడేరు నియోజకవర్గంలో 9 పనులకు సంబంధించి రూ.21.36 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. పాడేరు ఆర్అండ్బీ డివిజన్ పరిధిలోని పాడేరు–వడ్డాది మార్గంలో 8.3 కిలోమీటర్ల పక్కా రోడ్డు అభివృద్ధికి రూ.2.85 కోట్లతో పనులు పూర్తయ్యాయి. పాడేరు నుంచి చింతపల్లి రోడ్డు అభివృద్ధికి రూ.4.25 కోట్లు, నర్సీపట్నం నుంచి చింతపల్లి మీదుగా సీలేరు వరకు రోడ్డుకు రూ. 2.80 కోట్లు మంజూరయ్యాయి. పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. పాడేరు నుంచి చింతపల్లి వెళ్లే రోడ్డుకు రూ.2.58 కోట్లు, ఇదే రోడ్డులో 46 నుంచి 54 కిలోమీటరు వరకు రూ.2.75 కోట్లు, 60వ కిలోమీటరు నుంచి 64 కిలోమీటర్ల వరకు అభివృద్ధికి రూ.1.88 కోట్లు అందిస్తున్నారు. పాడేరు–చింతపల్లి రోడ్డుకు రూ.కోటి, పాడేరు–వడ్డాది రోడ్డు నుంచి కందమామిడి జంక్షన్ నుంచి బంగారుమెట్ట రోడ్డుకు రూ.3 కోట్లు మంజూరయ్యాయి. పనులు ప్రారంభదశలో ఉన్నాయి. అరకు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణ పనులకు పనులకు రూ.5.35 కోట్లు మంజూరయ్యాయి. పాడేరు అర్ అండ్ బీ డివిజన్ పరిధిలోని హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో నాలుగు రోడ్ల పనులకు సంబంధించి ప్రభుత్వం రూ.5.35 కోట్లు మంజూరు చేసింది. ఇందులో పాడేరు–అరకులోయ ఆర్ అండ్‌బీ రోడ్డు నుంచి బాకూరు పోయే రోడ్డులో 5/6 నుంచి 13/24 వరకు రూ.1.48 కోట్లు కేటాయించారు. ముంచంగిపుట్టు మండలంలోని సుజనకోట రోడ్డులో 5/6 నుంచి 6/4 రోడ్డుకు రూ.48 లక్షలు, పాడేరు–పెదబయలు, మంచంగిపుట్టు, జోలాపుట్ట రోడ్డులోని 7 నుంచి 12/8, 32, 34 కిలోమీటర్ల రోడ్డులో రోడ్డులో రోడ్డ అభివృద్ధి, ప్రత్యేక మరమ్మతులకు రూ.2.66 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. ఈ మేరకు పనులన్నీ పూర్తయ్యాయి. అలాగే పాడేరు, బంగారుమెట్ట, నుర్మతి రోడ్డులోని 50 నుంచి 52 కిలోమీటర్ల రోడ్డు ఉన్న బొండాపల్లి ప్రాంతంలో రోడ్డు అభివృద్ధికి రూ.73 లక్షలు మంజూరు చేసింది. ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. రంపచోడవరం డివిజన్లో ఏజెన్సీలో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్‌శాఖ, రోడ్డు భవనాలు శాఖ ఇంజనీర్లు చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మారేడుమిల్లి నుంచి పుల్లంగి వరకు 30 కిలోమీటర్లు మేర రోడ్డు నిర్మాణ పనులను రోడ్లు భవనాలశాఖ రూ.12కోట్లతో పూర్తి చేసింది. దీనివల్ల మండలకేంద్రం నుంచి మారేడుమిల్లి వరకు రహదారి సౌకర్యం చేకూరింది. 40 గ్రామాల ప్రజల సమస్య పరిష్కారమైంది. ఆకుమామిడి కోట నుంచి గుర్తేడు వరకు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ పనులు చేపట్టింది. గోకవరం నుంచి పోతవరం వరకు 17 కిలోమీటర్ల మేర రోడ్డును రూ. 12 కోట్ల వ్యయంతో రోడ్డు భవనాలు శాఖ పూర్తి చేసింది. కొత్తపల్లి నుంచి గోకవరం వరకు సుమారు 18 కిలోమీటర్ల మేర రోడ్డును రూ. 20 కోట్లు వ్యయంతో ఆర్అండ్బీ అధికారులు నిర్మించారు. గతంలో ఈ రోడ్డులో వర్షం పడితే ఎక్కడిక్కడ కొండవాగులు పొంగి రాకపోకలు సాగించలేని పరిస్థితి ఉండేది. అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో కూడా అనేక ప్రధాన రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు వెచ్చించింది. దీనిలో భాగంగా చేపట్టిన రంపచోడవరం మండలం పందిరిమామిడి నుంచి చవిటిదిబ్బల రోడ్డు నిర్మాణం చివరి దశకు చేరింది. దీనవల్ల రంపచోడవరం, మారేడుమిల్లి, వై. రామవరం మండలాలకు చెందిన సుమారు వంద గ్రామాల గిరిజనులు రంపచోడవరం చేరుకునేందుకు దగ్గర మార్గం ఏర్పడింది. నాబార్డు ఏఐఐబీ సహకారంతో రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో రూ.78 కోట్ల వ్యయంతో 150 కిలోమీటర్ల మేర నిర్మాణ పనులు చేపట్టారు. దీనిలో భాగంగా 50 రహదారుల నిర్మాణం చేపట్టగా వీటిలో 8 పనులు పూర్తి చేశారు. మరో 28 పనులు చివరి దశలో ఉన్నాయి. మరో పది రోడ్ల నిర్మాణం అటవీ అభ్యంతరాల కారణంగా ప్రారంభం కాలేదు. జూన్ నెలాఖరుకు రోడ్లన్నీ పూర్తి ఇప్పటికే మరమ్మతుల పనులు పూర్తికావస్తున్నాయి. రోడ్ల ఆధునీకరణ నిర్మాణాలు, బీటీ రోడ్డులు, సీఆర్ఎఫ్ ఫండ్స్ రోడ్ల నిర్మాణ పనులు జూన్ నాటికి పూర్తి చేస్తాం. ఆదిశగా నిర్మాణపనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాన లైన్ల రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. సగానికి పైగా రోడ్ల నిర్మాణపనులు దాదాపు పూర్తకావస్తున్నాయి. రోడ్ల నిర్మాణాలను నాడు–నేడు పద్ధతిలో చేపడుతున్నాం. – కె.జాన్ సుధాకర్,ఆర్అండ్బీ సూపరింటెండెంట్ ఇంజనీర్ (చదవండి: చల్ల‘కుండ’.. ఆదివాసీల స్పెషల్..) -
Visakhapatnam: పాడి గేదె పంచాయితీ.. ప్రాణం తీసిన క్షణికావేశం!
నర్సీపట్నం: పాడి గేదె అమ్మకం.. కొనుగోలు వ్యవహారంలో తలెత్తిన వివాదం చివరకు ఒకరి మృతికి కారణమైంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి బలిఘట్టానికి చెందిన భీమిరెడ్డి నూకరాజు రెండు రోజుల క్రితం ఇక్కడికి సమీపంలోని కృష్ణాపురానికి చెందినబర్ల అప్పారావు వద్ద గేదెను రూ.49 వేలకు కొనుగోలు చేశాడు. అడ్వాన్సుగా రూ.20 వేలు చెల్లించి, మిగతా మొత్తం మూడు రోజుల తరువాత ఇస్తానని చెప్పి గేదెను తీసుకువెళ్లాడు. మూడు రోజులు తరువాత రూ.29 వేలు ఇవ్వలేదు. గేదె కొనుగోలులో మధ్యవర్తిగా వ్యవహరించిన బలిఘట్టానికి చెందిన శెట్టి వెంకటరమణను వెంటబెట్టుకుని అప్పారావు డబ్బులు అడిగేందుకు నూకరాజు ఇంటికి వెళ్లాడు. తీసుకువచ్చిన మరుసటి రోజు నుంచే మేత తినటం లేదని గేదె ను తోలుకు పొమ్మని నూకరాజు అన్నాడు. నూకరాజు, అప్పారావు మధ్య డబ్బులు విషయంలో గీజులాడుకుంటున్నారు. మధ్యవర్తి వెంకటరమణ కలుగజేసుకుని ఇవ్వాల్సిన రూ.29 వేలలో రూ. 2 వేలు తగ్గించి రూ.27 వేలు అప్పారావుకు ఇవ్వాలని, లేకుంటే రూ. 2 వేలు తగ్గించి రూ.18 వేలు ఇస్తాడు నువ్వైనా తీసుకోమని నూకరాజుకు చెప్పాడు. తాను ఇచ్చిన రూ.20 వేలలో పైసా తగ్గించిన తీసుకోనని నూకరాజు భీష్మించాడు. దీంతో మధ్యవర్తి, నూకరాజు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో క్షణికావేశంలో నూకరాజు కర్రతో వెంకటరమణ తలపై గట్టిగా కొట్టడంతో తీవ్ర గాయమైంది. వెంటనే వెంకటరమణను ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరతలించారు. పరిస్థితి విషమించడంతో కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. విశాఖకు తరలిస్తుండగా వెంకటరమణ మార్గం మధ్యలో మృతి చెందాడు. దీనిపై హత్యగా కేసు నమోదు చేశామని పట్టణ ఎస్ఐ నారాయణరావు తెలిపారు. మృతుడికి భార్య మంగ, ఇద్దరు ఆడపిల్లలు, బాబు ఉన్నారు. చదవండి: ఐయామ్ వెరీ సారీ..! కత్రినాకైఫ్ పెళ్లి ఫొటోలు ప్రచురించడం కుదరదు..! -
అంగన్‘వేడి’తో కూనల కష్టాలు
మండుటెండల్లోనూ అంగన్వాడీ కేంద్రాలు విలవిల్లాడుతున్న చిన్నారులు గర్భిణులు, బాలింతలదీ అదే పరిస్థితి పాఠశాలలకు మాత్రమే సెలవులు వడదెబ్బ తీవ్రత పట్టని అధికారులు ఎండలు మండిపోతున్నాయి. కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. వడదెబ్బ మరణాలు పెరిగిపోతున్నాయి. పాఠశాలలు మూతపడుతున్నాయి. సెలవులతో తరగతులు నిలిచిపోతున్నాయి. అంగన్వాడీ కేంద్రాలు మాత్రం పనిచేస్తున్నాయి. చిన్నారిపొన్నారి పిల్లల్ని నరక యాతనకు గురిచేస్తున్నాయి. గర్భిణులు, బాలింతల్ని అవస్థలపాల్జేస్తున్నాయి. పౌష్టికాహారం పంపిణీ పేరిట పసిపిల్లల్ని మండుటెండల్లో అంగన్వాడీ కేంద్రాలకు రప్పించడం ఎంతవరకూ సబబో అధికారులకే తెలియాలి. నర్సీపట్నం : జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో 25 ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు. వీటిలో 3,587 అంగన్వాడీ, 1364 మినీ అంగన్వాడీ కేంద్రాలను కొనసాగిస్తున్నారు. ఈ కేంద్రాల్లో 1,95,500 మంది చిన్నారులు, 60,345 మంది గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నాయి. జిల్లాలోని 15 ప్రాజెక్టుల్లో అమృత హస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ కేంద్రాల్లోని చిన్నారులను ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్రాల్లోనే ఉంచి పౌష్టికాహారం అందిస్తుంటారు. గర్భిణులు, బాలింతలు ఉదయం పది గంటలకు కేంద్రానికి వచ్చి గుడ్డు, 200 మిల్లీలీటర్ల పాలు తీసుకుంటారు. రెండోసారి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చినప్పుడు వీరికి 200 గ్రాముల అన్నం, కూరలను వడ్డిస్తారు. అరకొర వసతులతో చిన్నారుల అవస్థలు ఇరవై రోజులుగా జిల్లాలో ఎండలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో ఎక్కువ మంది వడదెబ్బకు గురై మరణాలు సంభవి స్తున్నాయి. దీన్ని గమనించిన ప్రభుత్వం పది రోజుల క్రితమే పాఠశాలలు తెరిచినా ఎండలు తీవ్రంగా ఉండటంతో సెలవు ల్ని ప్రకటిస్తోంది. ఎండ తీవ్రత అత్యంత ప్రమాదకరమని తెలిసినా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను కొనసాగిస్తోంది. ఈ కేంద్రాలకు చిన్నారులు ఉదయమే వచ్చి సాయంత్రం వరకు ఉండిపోవాలి. మధ్యాహ్నం భోజనం అనంతరం వారిని కేంద్రంలోనే నిద్రపుచ్చాలి. అరకొర వసతులున్న అంగన్వాడీ కేంద్రాల్లో మండుటెండల్లో పిల్లలు నిద్రపోవడం సాధ్యమేనా? అనే విషయాన్ని అధికారులు పట్టించుకోలేదు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం కోసం రెండుసార్లు కేంద్రానికి రావాలి. మిట్ట మధ్యాహ్నం ఎండలో 200 నుంచి 400 మీటర్ల దూరంలోని కేంద్రానికి వచ్చి పౌష్టికాహారం తీసుకెళ్లాలి. ఇలా ఒక్కొక్కరు రోజుకు ఎండలో సుమారు కిలోమీటరు మేర నడవాలి. పాత బియ్యం ఇవ్వాల్సిన బాలింతలకు కోటా బియ్యంతో ఆహారాన్ని అందిస్తున్నారు. ఇది తింటున్న బాలింతలు రోగాల బారిన పడుతున్నారు. దీనిపై పీడీ రాబర్ట్‌ను వివరణ కోరగా దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. అక్కడినుంచి అదేశాలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
పోటీకి పోటెత్తింది
నర్సీపట్నం/యలమంచిలి, న్యూస్‌లైన్ : మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈ నెల 10న ప్రారంభమైన ఈ ప్రక్రియలో తొలిరోజు ఒక్క నామినేషన్ దాఖలు కానప్పటికీ, ఆఖరి రోజున మాత్రం వెల్లువెత్తాయి. శుక్రవారం రెండు మున్సిపాలిటీల్లో 131 నామినేషన్లు వేశారు. మొత్తంగా యలమంచిలిలో 24 వార్డులకు 135, నర్సీపట్నంలో 27 వార్డులకు 160 దాఖలయ్యాయి. వీటిలో అధికంగా వైఎస్సార్సీపీ తరపున123 వేయడం విశేషం. జాతీయ పార్టీ కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. నర్సీపట్నంలో మాత్రమే 7 వచ్చాయి. యలమంచిలిలో ఆ పార్టీ తరపున ఒక్కరూ వేయలేదు. ఈ ఘట్టంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ, టీడీపీల ప్రతినిధులు ర్యాలీగా వచ్చి నామినేషన్లు వేశారు. శనివారం ఈ నామినేషన్లను పరిశీలిస్తారు. -
తొలిసారి ఎన్నికల భేరి
జిల్లాలో రెండు కొత్త మున్సిపాలిటీలలో మొదటిసారిగా బ్యాలెట్ యుద్ధం 30న ఎన్నికలు, ఏప్రిల్ 2న ఫలితాలు అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ యుద్ధభేరి ఆకస్మికంగా మోగింది... సమర శంఖారావం హఠాత్తుగా ప్రతిధ్వనించింది! కనుచూపు మేరలో కనిపిస్తున్న సార్వత్రిక కదనానికి సిద్ధం కావాలనుకుంటున్న రాజకీయ సేనలకు, పురపాలక వాతావ‘రణం’ ఎదురయ్యేసరికి ఉక్కిరిబిక్కిరయినంత పనయింది! నెలాఖరులో జరగనున్న మున్సిపల్ సమరం ఆసక్తికర వాతావరణానికి తెర తీయనుంది. జిల్లాలో ఉన్న అనకాపల్లి, భీమునిపట్నం మున్సిపాలిటీలు విశాఖ నగరపాలక సంస్థలో విలీనం కావడంతో. కొత్తగా ఏర్పాటైన నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లో పోలింగ్ సంగ్రామానికి రంగం సిద్ధమయింది. రెండేళ్ల క్రితమే ఏర్పాటైన ఈ రెండు మున్సిపాలిటీల్లో తొలిసారి పోరు జరగబోతోంది. సోమవారం షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నర్సీపట్నం, న్యూస్‌లైన్ : రెండేళ్ల క్రితం మున్సిపల్ హోదా పొందిన రెండు మున్సిపాలిటీలకు ఇప్పుడు హఠాత్తుగా ఎన్నికల కళ వచ్చింది. రెండేళ్ల క్రితం ఏర్పాటైన నర్సీపట్నం, యలమంచిలిలకు మున్సిపాలిటీలుగా ప్రథమంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు మున్సిపాలిటీలకు చెందిన ప్రజలంతా మొదట మున్సిపాలిటీ వార్డు సభ్యులను నేరుగా ఎన్నుకుని, పరోక్ష పద్ధతిలో చైర్మన్‌ను ఎంపిక చేయనున్నారు. నర్సీపట్నం, బలిఘట్టం, పెదబొడ్డేపల్లి పంచాయతీల కలయికతో నర్సీపట్న ం మున్సిపాలిటీ ఏర్పడింది. యలమంచిలి, సోమలింగపాలెం, రామారాయుడుపాలెం, పెదపల్లి, యర్రవరం-25, తెరువుపల్లి, కట్టుపాలెం, కొక్కిరాపల్లి పంచాయతీలతో యలమంచిలి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయ్యింది. దీనికి సంబంధించి 2011 డిసెంబరులో జీవో విడుదల అయ్యింది. అప్పటివరకు ఈ మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామ ప్రజలంతా గతంలో పంచాయతీ పాలకవర్గాలకు నిర్వహించే ఎన్నికల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ గ్రామాలన్నింటినీ విలీనం చేసి మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేయడంతో ప్రథమంగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 30న ఎన్నికలు ఈ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఉదయం షెడ్యూల్ విడుదల చేసింది. నర్సీపట్నంలోని 27, యలమంచిలిలో 24 వార్డులకు ఈ నెల 30న ఎన్నికలు నిర్వహించేందుకు ముహూర్తం నిర్ణయించింది. ఈ నెల 10 నుంచి 14 సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ, 15న నామినేషన్ల పరిశీలన, 18 సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు ఉప సంహరణ ఉంటుంది. అదేరోజు సాయంత్రం అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. 30న నిర్వహించిన ఎన్నికలకు ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. పార్టీ గుర్తులతో పోటీచేసే ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ. 2,500, ఓసీలకు రూ. 5వేలు డిపాజిట్ చేయాల్సి ఉంది. పోటీచేసే అభ్యర్థులు రూ. లక్ష వరకు ఖర్చుచేసే విధంగా షరతులు విధించింది. సోమవారం ఉదయం పది గంటలకు ప్రకటించిన షెడ్యూల్‌తో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో పోటీచేసేందుకు ప్రధాన పార్టీలైన వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, టీడీపీ నుంచి తమ అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను దించి, తమ పట్టు నిరూపించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మున్సిపల్ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యలమంచిలిలో సందడి యలమంచిలి, న్యూస్‌లైన్ : మున్సిపాలిటీల్లో ఎన్నికల నగారా మోగడంతో కొత్తగా ఏర్పడిన యలమంచిలి మున్సిపాలిటీ ఎన్నికల సందడి ప్రారంభమయింది. రెండేళ్లక్రితం వరకు మేజర్ పంచాయతీగా ఉన్న యలమంచిలి పట్టణంతోపాటు పెదపల్లి, కొక్కిరాపల్లి, గ్రామాలను విలీనం చేశారు. దీంతో మున్సిపాలిటీ ఎన్నికల్లో విలీన గ్రామాలకు చెందిన ఓటర్లు కీలకం కానున్నారు. ముఖ్యంగా యల మంచిలి మున్సిపాలిటీలో మహిళా ఓటర్లే అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. మున్సిపాలిటీలో 24వార్డుల్లో 32వేల 459 మంది ఓటర్లు ఉండగా పురుషులు 15వేల 612మంది, మహిళలు 16వేల847మంది ఉన్నారు. దాదాపు అన్ని వార్డుల్లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండడంతో కౌన్సిలర్ స్థానాల్లో కూడా మహిళలు ముఖ్య పాత్రను పోషించనున్నారు. 1,15వార్డులు మినహించి మిగిలిన 22వార్డుల్లో కూడా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. వైఎస్సార్సీపీ, టీడీపీల మధ్యే ప్రధానపోటీ.. : మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ, దేశంపార్టీల మధ్యనే ప్రధాన పోటీ జరగనుంది. ఈ రెండు పార్టీల నేతలు వార్డులకు కౌన్సిలర్లు, చైర్మన్ అభ్యర్థుల వేట ప్రారంభించాయి. కాంగ్రెస్‌పార్టీనుంచి వైఎస్సార్సీపీకి పెద్దయెత్తున వలసలు ఉండడంతో ఆపార్టీ తరపున పోటీ ఉండకపోవచ్చన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నర్సీపట్నంలో ఉత్సాహం నర్సీపట్నం, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయి రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలు ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగాయి. తాజాగా వీటికి ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో అన్ని పార్టీలూ అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించాయి. వైఎస్సార్సీపీ, టీడీపీలు వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికపై పట్టణంలోని ముఖ్య నాయకులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించాయి. వీటి ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడనున్న దృష్ట్యా మున్సిపాలిటీ లను చేజిక్కించుకునేందుకు బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభించాయి. నోటిఫికేషన్ విడుదల చేసే సమయానికి దీటైన అభ్యర్థిని ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
నర్సీపట్నం, యలమంచిలి బీసీమహిళకు
పుర’ సమరానికి ప్రభుత్వం సన్నద్ధం చైర్మన్ల రిజర్వేషన్లు ప్రకటన నేడు ఓటర్ల జాబితాల ప్రకటన 3న హైకోర్టుకు నివేదిక ఆ మేరకు తదుపరి కార్యాచరణ ఎట్టకేలకు హైకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వంలో కదలిక వచ్చింది...ఇప్పటికే వార్డుల రిజర్వేషన్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం తాజాగా చైర్మన్ల రిజర్వేషన్లను కొలిక్కి తెచ్చింది. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకుని ఎన్నికలకు సమాయత్తమవుతోంది. నర్సీపట్నం, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్ని కలపై పూర్తిస్థాయిలో కదలిక వచ్చింది. అనేక కారణాలు చూపిస్తూ వీటి నిర్వహణపై ప్రభుత్వం వెనక్కు తగ్గినా కోర్టుల జోక్యంతో ఎట్టకేలకు కసరత్తు పూర్తిచేసింది. 2011లో వీటి పాలకవర్గాల గడువు పూర్తయింది. జిల్లాలోని భీమునిపట్నం, అనకాపల్లి మున్సిపాలిటీలు జీవీఎంసీలో విలీనమయ్యాయి. కొత్తగా నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి. ఇవి ఏర్పాటయినప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. గతేడాది పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే 2011 జనాభా లెక్కల ఆధారంగా మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఓటర్ల జాబితాలు సిద్ధం చేశారు. ఇంతలో సమైక్యాంధ్ర ఉద్యమం తెరపైకి వచ్చింది. అధికారులంతా సమ్మెలో పాల్గొనడంతో ఎన్నికల నిర్వహణకు తాత్కాలికంగా తెరపడింది. ఇది ముగిసిన తరువాత ఈ నెలలోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండడంతో వీటిని వెనుక్కు నెట్టేయాలని ప్రభుత్వం భావించింది. ఇంతలో నాలుగు వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా ఎన్నికల ప్రక్రియపై ఈ నెల మూడో తేదీలోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు గడువిచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తిచేసిన ప్రభుత్వం శనివారం చైర్మన్ల రిజర్వేషన్లను ప్రకటించింది. నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలను బీసీ మహిళలకు కేటాయించింది. ఇదిలా ఉండగా ఎన్నికల సంఘం ఆదేశాలతో రెండు మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితాలను ఆదివారం వార్డులు, మున్సిపాలిటీ, ఆర్డీవో, తహశీల్దారు కార్యాలయాల్లో ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. మూడున హైకోర్టుకు నివేదిక ఇచ్చిన వెంటనే మిగిలిన కార్యాచరణకు అధికారులు చర్యలు చేపట్టారు. వార్డులు, చైర్మన్ రిజర్వేషన్లు ఒక కొలిక్కి రావడంతో ఆశావహుల్లో కోలాహలం మొదలయింది. పార్టీ ప్రాతిపదికన నిర్వహించనున్నందున రాజకీయ పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లోనూ ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపే అవకాశం ఉంది. -
పార్టీలో గజదొంగల చేరికతో బాధేస్తోంది
* పార్టీలో గజదొంగల చేరికతో బాధేస్తోంది * ఇతరుల తప్పులు ఎలా వేలెత్తి చూపగలం? * టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నవ్యాఖ్య నర్సీపట్నం : క్రమశిక్షణ గల టీడీపీ లోకి గజదొంగల చేరికతో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సీపట్నం అ య్యన్న కాలనీలో ఇంటాంటా టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ సమాజంలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు అందరికీ ఆదర్శంగా నిలిచిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. ఆయన స్థాపించిన పార్టీలోకి దొంగలు రావడం తనను బాధిస్తోందని వ్యాఖ్యానించారు. గజదొంగల చేరికతో ఎదుటివారి తప్పులను వేలెత్తి చూపే ఆస్కారం పార్టీ నాయకులకు ఉండదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ముత్యాలపాప తీరును విమర్శిస్తూ, ఆమె అభివృద్ధిని మరిచారని విమర్శించారు. ఎన్నికలకు రెండు నెలలే సమయం ఉన్నందున కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలన్నారు. ప్రజలను అష్టకష్టాలకు గురిచేసిన కాంగ్రెస్‌ను సాగనంపాల్సిన సమయం వచ్చిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతకాయల సన్యాసిపాత్రుడు, అయ్యన్నయూత్ అధ్యక్షుడు విజయ్ పాల్గొన్నారు. అయ్యన్నను కలిసిన వెలగపూడి విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అయ్యన్నపాత్రుడిని శుక్రవారం కలిశారు. అయ్యన్న ఇంటిలో ఇద్దరూ కొద్దిసేపు సంభాషించారు. అయ్యన్నను కలిసినవారిలో జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్లు పైల ముత్యాలనాయుడు, పట్టాభిరాము, అడవివరం సర్పంచ్ పాసర్ల ప్రసాద్ ఉన్నారు. -
పురుగుమందు తాగిన ప్రేమజంట
{పియురాలు మృతి చావుబతుకుల్లో ప్రియుడు నర్సీపట్నంలో దుర్ఘటన నర్సీపట్నం, న్యూస్‌లైన్ : ప్రేమిం చిన వ్యక్తిని వదులుకోలేక... తల్లిదండ్రుల మాట జవదాటలేక సంకటస్థితిలో ఒక ప్రేమజంట చావే శరణ్యమనుకుంది. కలిసి జీవించలేకపోయినా కనీసం కలిసి మరణించాలనే నిర్ణయానికి వచ్చారు. తమను ఎవరూ గమనించకూడదనే ఉద్దేశ్యంతో పట్టణానికి దూరంగా ఉన్న చెరకుతోటలోకి వెళ్లి పురుగులమందు తాగి ఆ జంట ఆత్మ త్యాగానికి పాల్పడింది. వీరిలో యువతి తనువుచాలించగా యువకుడు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. శివపురానికి చెందిన ఏలూరు వసంతి(17), గంగాధరవీధికి చెందిన గడపా శివ(22) ప్రేమించుకుంటున్నారు. 10వ తరగతి వరకు చదువుకున్న శివ అబీద్ సెంటర్లో పళ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఆ రహదారి మీదుగా నిత్యం కళాశాలకు వెళ్లే వసంతితో శివకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారినట్లు తెలిసింది. వీరి ప్రేమ వ్యవహారం వసంతి ఇంట్లో తెలియడంతో వారు మందలించినట్టు తెలిసింది. బ్యాంకు ఉద్యోగి కుమార్తె అయిన తనను పళ్ల వ్యాపారం చేసుకునే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయరేమోనని తోటి స్నేహితురాళ్ల వద్ద మథనపడేది. ఈ పరిస్థితుల్లో చావే దిక్కనుకుని ఇద్దరూ కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. సోమవారం యథావిధిగా కళాశాలకు వెళ్లిన వసంతి మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బయటకు వచ్చింది. అనంతరం ఇంటికి వెళ్లిన వసంతి స్నేహితురాలి ఇంటికని చెప్పి బయటకు వచ్చి శివతో కలిసి గబ్బాడకు దగ్గరలోని నెల్లిమెట్టకు సమీపంలో గలచెరకుతోటలోకి వెళ్లింది. అక్కడ ఇద్దరూ బలవన్మరణానికి యత్నించారు.