అధికారుల అండతో టీడీపీ నేతల బరితెగింపు.. వైఎస్సార్‌సీపీ నేత ఇంటి కూల్చివేత | TDP Leaders And Officials Demolish YSRCP Supporter House In Anakapalle, More Details Inside | Sakshi
Sakshi News home page

అధికారుల అండతో టీడీపీ నేతల బరితెగింపు.. వైఎస్సార్‌సీపీ నేత ఇంటి కూల్చివేత

Published Mon, Feb 24 2025 8:47 AM | Last Updated on Mon, Feb 24 2025 11:23 AM

TDP Leaders And Officials Demolish YSRCP Supporter House

సాక్షి, అనకాపల్లి: ఏపీలో కూటమి పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేస్తూ కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. అధికారులను అడ్డుపెట్టుకుని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. తాజాగా పోలీసుల బందోబస్తు మధ్య వైఎస్సార్‌సీపీ నేత ఇంటిని అధికారులు కూల్చివేశారు.

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడి నియోజకవర్గంలోని నర్సీపట్నంలో టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగారు. అక్రమ నిర్మాణం అంటూ వైఎస్సార్‌సీపీ నాయకుడు, బీసీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ కర్రి శ్రీను ఇంటిని కూల్చివేశారు. సోమవారం తెల్లవారుజామునే శ్రీను ఇంటి వద్దకు ఎమ్మార్వో, పోలీసులు వచ్చారు. పోలీసులు బందోబస్తు మధ్య శ్రీను ఇంటి కూల్చివేత కార్యక్రమం చేపట్టారు. ఇక, అదే నియోజకవర్గంలో అంతకుముందు వైఎస్సార్‌సీపీ నేత చిటికెల కన్నా ఇంటిని కూడా కూల్చివేశారు.

ఈ విషయం తెలుసుకున్న వెంటే ఘటనా స్థలానికి మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘స్పీకర్ అయ్యన్నపాత్రుడు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసింది అభివృద్ధి చేయడానికా? లేక ఇల్లు కూలగొట్టడానికా?. ఇంట్లో ఉన్న సామాన్లు బయటికి తీయడానికి అవకాశం లేకుండా ఇంటిని కూల్చివేస్తున్నారు. నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని ఓట్లు వేస్తే చిల్లర పనులు చేస్తున్నారు అని మండిపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement