house demolished
-
జగన్ కు ఓటు వేశారని.. అచ్చెన్నాయుడు వర్గీయులు బరితెగింపు
-
కూటమి ఎమ్మెల్యే ఆదేశాలు.. పోలీసుల సమక్షంలో ఇళ్ల కూల్చివేతలు
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రేణిగుంట మండలంలో ఎమ్మెల్యే ఆదేశాలతో అన్యాయంగా పేదల ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చి వేస్తున్నారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచే కూల్చివేతలు ప్రారంభమయ్యాయి.వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రేణిగుంట మండలం పరిధిలో చెంగారెడ్డిపల్లి, కుర్రకాలువ, సూరప్ప కశం ప్రాంతాల్లో 144 ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు. శనివారం అర్ధరాత్రి నుంచే కూల్చివేతలు జరుగుతున్నాయి. పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారుల సమక్షంలో జేసీబీలతో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఇక, కూల్చివేతలపై పేదలు, దళిత వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
తిరువూరు ఎమ్మెల్యే అరాచకం.. ఎ.కొండూరు ఎంపీపీ ఇల్లు ధ్వంసం
తిరువూరు: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కంభంపాడులో అరాచకం సృష్టించారు. ఎన్నికల సమయంలో జరిగిన ఓ సంఘటనను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్సీపీకి చెందిన ఎ.కొండూరు ఎంపీపీపై కక్షసాధింపు చర్యలకు దిగారు. జేసీబీతో ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి ఇంటిని ధ్వంసం చేయించి, కంభంపాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని కంభంపాడు పోలింగ్ కేంద్రంలోకి తన అనుచరులతో కలిసి అక్రమంగా ప్రవేశించబోయారు. అనుచరులతో కలిసి వెళ్లడాన్ని ఎంపీపీ నాగలక్ష్మి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలు ఎంపీపీపై కక్షకట్టారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మంగళవారం ఉదయమే మందీ మార్బలంతో కంభంపాడు వచ్చారు. ఎంపీపీ నిరి్మస్తున్న భవనం ఆక్రమిత స్థలంలో ఉందంటూ అధికారులపై వత్తిడి తెచ్చారు. దానిని కూల్చివేయాలంటూ అధికారులకు హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది కంభంపాడు చేరుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భవనం కూల్చివేతకు చేసిన హంగామా స్థానికుల్ని భయాందోళనలకు గురి చేసింది. ఎమ్మెల్యే వర్గీయులే పొక్లయిన్‌ను తీసుకొచ్చి పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఎంపీపీ భవనాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. అయినా పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా ప్రేక్షకపాత్రే వహించారు. నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని కూల్చివేస్తున్నారని ఎంపీపీ ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు స్పందించలేదు. తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు సంఘటన స్థలానికి చేరుకుని ఎమ్మెల్యే చర్యలను ఖండించారు. ఇటువంటి అసాంఘిక చర్యలను సహించబోమని, అధికారులు నిబంధనల మేరకు వ్యవహరించాలన్నారు. ఇంతవరకు తిరువూరు నియోజకవర్గంలో ఇటువంటి కక్షసాధింపు చర్యల్లేవని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు బహిరంగంగా దౌర్జన్యపూరితంగా వ్యవహించారని స్వామిదాసు ఆరోపించారు. ఈ çఘటనకు బా«ద్యుౖలెన వారిపై చర్యలు తీసుకోవాలని స్వామిదాసు ఏ కొండూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎంపీపీకే నోటీసు పట్టపగలు నడిరోడ్డుపై అరాచకం సృష్టించిన వారిపై చర్యలు తీసుకోని అధికారులు ఎంపీపీకే తిరిగి నోటీసు ఇవ్వడం గమనార్హం. భవనానికి వెనుక వైపు స్థలాన్ని ఆక్రమించారంటూ ఎంపీపీ నాగలక్షి్మకి కంభంపాడు పంచాయతీ కార్యదర్శి నోటీసు ఇచ్చారు. భవనానికి వెనుకవైపు స్థలం ఆక్రమించారని, దారి వదల్లేదని వచి్చన ఫిర్యాదు మేరకు వెంటనే భవన నిర్మాణం నిలిపివేయాలని, స్థలానికి సంబంధించిన ధృవపత్రాలను పంచాయతీ కార్యాలయంలో వారం రోజుల్లోగా సమరి్పంచాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై శాపనార్థాలు
-
హైదరాబాద్: భారత జట్టు మహిళా క్రికెటర్ ఇల్లు కూల్చివేత
సాక్షి, హైదరాబాద్: తుకారాంగేట్ పరిధి(సికింద్రాబాద్)లో మహిళా క్రికెటర్ ఇల్లు కూల్చివేత రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఉదయం జీహెచ్ఎంసీ అధికారులు మహిళల రంజీ జట్టు క్రికెటర్ భోగి శ్రావణి ఇల్లును కూల్చివేశారు. కాగా, ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని గతంలో ఆమె కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చిన వెంటనే తాము ఇంటికి మరమ్మత్తులు చేసినట్టు తెలిపారు. అదేమీ పట్టించుకోకుండా జీహెచ్ఎంసీ అధికారులు ఈరోజు.. తమ ఇంటికి వచ్చి వస్తువులు బయటపడేసి ఇంటిని కూల్చివేశారని కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, ఈ నెల 15వ తేదీ నుంచి జరిగే మహిళల టీ20 సిరీస్‌లో పాల్గొనాల్సి ఉందన్న శ్రావణి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెట్ ఆడాలా..? లేక ఇంటి కోసం పోరాడాలా..? అని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, శ్రావణి ఇండియా తరఫున మ్యాచ్‌లను ఆడుతోంది. -
నీర్వికుంటే 9న రాస్తారోకో
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు భవానీపురం : హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ నెల 7వ తేదీ లోపు కరెంటు, నీటి సరఫరాను పునరుద్ధరించకపోతే 9న రాస్తారోకోకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పిలుపునిచ్చారు. బాధితులందరూ ప్రతిఘటిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. నదీ తీరం సుందరీకరణ పేరుతో విజయవాడ భవానీపురం కరకట్టపైగల కొన్ని ఇళ్లను ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. తమకు సముచితమైన నష్టపరిహారం ఇచ్చేవరకు ఇళ్లను తొలగించేందుకు వీలులేదంటూ దాదాపు 70 మంది కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. వారికి కరెంటు, తాగునీటిని బంద్ చేసి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. రెండు నెలలకుపైగా కరెంటు, నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్న బాధితులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. వారం రోజులలోపు బాధితులకు కరెంటు, నీటి వసతిని పునరుద్ధరించాలని ఈనెల 1వ తేదీన ఉత్తర్వులు జారీచేసింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చి ఆరు రోజులైనా బాధితులకు న్యాయం జరకపోవడంతో సోమవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ కరకట్టకు వచ్చి బాధితులతో మాట్లాడారు. మధు మాట్లాడుతూ బాధితులకు 100 గజాల స్థలం, నష్టపరిహారం ఇచ్చి వారి ఇళ్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యను ప్రతిపక్షాలు లేవనెత్తాలని కోరారు. సీపీఎం నగర కార్యదర్శి కాశీనాథ్ మాట్లాడుతూ కోర్టు ఉత్తర్వులను ధిక్కరించిన అధికారులను అరెస్ట్ చేయాలన్నారు. వెస్ట్ జోన్ నాయకులు యువీ రామరాజు మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న చంద్రబాబు, పేద ప్రజలు అదే కోర్టు నుంచి తెచ్చుకున్న స్టే ఆర్డర్‌ను ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ స్థానిక నాయకులు ఎల్.మోహన్‌రావు, ఎస్ సుబ్బారెడ్డి బాధితులు పాల్గొన్నారు.