కంభంపాడులో హంగామా
పొక్లెయిన్‌తో ఇల్లు ధ్వంసం చేసిన ఎమ్మెల్యే అనుచరులు
పోలీసు, రెవెన్యూ అధికారుల ప్రేక్షకపాత్ర
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నేత
తిరిగి ఎంపీపీకే నోటీసు ఇచ్చిన అధికారులు
తిరువూరు: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కంభంపాడులో అరాచకం సృష్టించారు. ఎన్నికల సమయంలో జరిగిన ఓ సంఘటనను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్‌సీపీకి చెందిన ఎ.కొండూరు ఎంపీపీపై కక్షసాధింపు చర్యలకు దిగారు. జేసీబీతో ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి ఇంటిని ధ్వంసం చేయించి, కంభంపాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని కంభంపాడు పోలింగ్ కేంద్రంలోకి తన అనుచరులతో కలిసి అక్రమంగా ప్రవేశించబోయారు. అనుచరులతో కలిసి వెళ్లడాన్ని ఎంపీపీ నాగలక్ష్మి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలు ఎంపీపీపై కక్షకట్టారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మంగళవారం ఉదయమే మందీ మార్బలంతో కంభంపాడు వచ్చారు. ఎంపీపీ నిరి్మస్తున్న భవనం ఆక్రమిత స్థలంలో ఉందంటూ అధికారులపై వత్తిడి తెచ్చారు. దానిని కూల్చివేయాలంటూ అధికారులకు హుకుం జారీ చేశారు.
ఎమ్మెల్యే ఆదేశాలతో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది కంభంపాడు చేరుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భవనం కూల్చివేతకు చేసిన హంగామా స్థానికుల్ని భయాందోళనలకు గురి చేసింది. ఎమ్మెల్యే వర్గీయులే పొక్లయిన్‌ను తీసుకొచ్చి పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఎంపీపీ భవనాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. అయినా పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా ప్రేక్షకపాత్రే వహించారు. నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని కూల్చివేస్తున్నారని ఎంపీపీ ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు స్పందించలేదు.
తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు సంఘటన స్థలానికి చేరుకుని ఎమ్మెల్యే చర్యలను ఖండించారు. ఇటువంటి అసాంఘిక చర్యలను సహించబోమని, అధికారులు నిబంధనల మేరకు వ్యవహరించాలన్నారు. ఇంతవరకు తిరువూరు నియోజకవర్గంలో ఇటువంటి కక్షసాధింపు చర్యల్లేవని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు బహిరంగంగా దౌర్జన్యపూరితంగా వ్యవహించారని స్వామిదాసు ఆరోపించారు. ఈ çఘటనకు బా«ద్యుౖలెన వారిపై చర్యలు తీసుకోవాలని స్వామిదాసు ఏ కొండూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఎంపీపీకే నోటీసు
పట్టపగలు నడిరోడ్డుపై అరాచకం సృష్టించిన వారిపై చర్యలు తీసుకోని అధికారులు ఎంపీపీకే తిరిగి నోటీసు ఇవ్వడం గమనార్హం. భవనానికి వెనుక వైపు స్థలాన్ని ఆక్రమించారంటూ ఎంపీపీ నాగలక్షి్మకి కంభంపాడు పంచాయతీ కార్యదర్శి నోటీసు ఇచ్చారు. భవనానికి వెనుకవైపు స్థలం ఆక్రమించారని, దారి వదల్లేదని వచి్చన ఫిర్యాదు మేరకు వెంటనే భవన నిర్మాణం నిలిపివేయాలని, స్థలానికి సంబంధించిన ధృవపత్రాలను పంచాయతీ కార్యాలయంలో వారం రోజుల్లోగా సమ
రి్పంచాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment