ayyannapathrudu
-
నర్సీపట్నంలో టెన్షన్.. పోలీసుల ఓవరాక్షన్!
సాక్షి, నర్సీపట్నం: అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను అడ్డుకోవడంతో వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు. దీంతో, అక్రమ కేసులను నిరసిస్తూ నేడు వైఎస్సార్సీపీ శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో పోలీస్ యాక్ట్-30 అంటూ వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారు.ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయన్నపాత్రుడి నియోజకవర్గంలో అరాచకం చోటుచేసుకుంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిని ప్రశ్నించడమే నేరంగా మారింది. ఇసుక రవాణాను ప్రశ్నించినందుకు గాను పోలీసులు.. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడంపై పార్టీ నేతలు నేడు శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలీస్ యాక్ట్-30 అమలులో ఉందంటూ వైఎస్సార్సీపీ నేతలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు.శాంతియుత ర్యాలీకి వైఎస్సార్సీపీ శ్రేణులు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు. బుధవారం ఉదయమే మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నివాసానికి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్బంగా పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఇక, మంగళవారం రాత్రి నుంచే వైఎస్సార్సీపీ కార్యకర్తలను, నేతలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల ఓవరాక్షన్‌పై ఉమాశంకర్ గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, పోలీసులు తీరుతో అటు సామన్య ప్రజలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. -
అయ్యన్న నోటి దురుసు
దాని పేరేమి పేరు.. అని బ్రాహ్మణి గురించి ప్రస్తావన.. లోకేష్ భార్య బాలకృష్ణ చిన్న కూతురా.. పెద్ద కూతురా.. అని వ్యాఖ్య పేరు గుర్తుకురాక మీడియా ముందు నానా తంటాలు.. అవాక్కయి బిత్తర చూపులు చూసిన టీడీపీ నేతలు.. ఇదీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మీడియాతో అసభ్యంగా, అడ్డదిడ్డంగా మాట్లాడిన మాటల పర్యవసానం. టీడీపీలో మహిళలకు గౌరవం లేదన్న విషయం చర్చనీయాంశం అయిన దశలో.. అయ్యన్న అవాకులు చవాకులు నష్టం చేకూరుస్తాయని సొంత పార్టీ వారే నొసలు చిట్లిస్తున్న వైనం.. విశాఖపట్నం: ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో కనిపించే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నోటి దురుసుతనం మరోసారి సంచలనమైంది. ఈసారి స్వయానా టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు, చినబాబు లోకేష్ భార్య, బాలకృష్ణ పెద్ద కూతురు బ్రాహ్మణినే అవమానిస్తూ..హేళన చేస్తూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా నర్సీపట్నం టౌన్లో ఏర్పాటు చేసిన టీడీపీ మహిళా దీక్షా కార్యక్రమంలో అయ్యన్న మీడియాతో మాట్లాడుతూ.. ‘బాలకృష్ణ చిన్న కూతురా.. లేదా పెద్ద కూతురా.. దాని పేరేమిపేరు..’ అంటూ తన సహజసిద్ధమైన రీతిలో అసహ్యకరంగా మాట్లాడారు. ప్రస్తుతం టీడీపీలో కీలకపాత్ర పోషిస్తున్న నారా బ్రాహ్మణి పేరు గుర్తుకురాక మీడియా ముందు అయ్యన్న నానా తంటాలు పడ్డారు. ఒక సీనియర్ మాజీ మంత్రి అలా అవహేళన చేసి మాట్లాడడంతో అక్కడున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు బిత్తర చూపులు చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ తమ్ముళ్లు అయ్యన్నపై గుర్రుగా ఉన్నారు. చంద్రబాబుని జైలు పాలు చేసిన స్కిల్ స్కాంకు తనకు ఎటువంటి సంబంధం లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పకనే చెప్పారు. ఇప్పుడు మరో సీనియర్ నేత అయ్యన్న అధినేత కోడలినే హేళన చేసి మాట్లాడారు. ఇవన్నీ చూస్తుంటే టీడీపీ మాజీ మంత్రులు, సీనియర్ నేతలకు పార్టీ అధిష్టానంపై ఎంత గౌరవం ఉందో అర్థం అవుతోంది. ఇక సొంత పార్టీలోనే కొందరు టీడీపీ మహిళా నేతలు.. అయ్యన్నపాత్రుడికి ఆడవారిని గౌరవించడం రాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యన్నపాత్రుడు నోటి దురుసుకు చెక్ పెట్టకపోతే పార్టీ నష్టపోయే ప్రమాదముందని సీనియర్ నేతలు మధనపడుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఇద్దరు సీనియర్ మంత్రులు మాట తూలారు. క్రమశిక్షణ తప్పారు. భవిష్యత్తులో మరింతమంది తలో రకంగా వ్యవహరిస్తే పార్టీ మరింత కష్టాల్లో పడుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
‘అరగుండు పాత్రుడు దేవుడి దగ్గరా డ్రామాలేస్తే టెంకాయ పగిలిపోతుంది’
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేతల ఓవరాక్షన్‌పై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి.. టీడీపీ నేతలపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాగా, ట్విట్టర్లో ‘అరగుండు పాత్రుడు దేవుడి దగ్గరా డ్రామాలేస్తే టెంకాయ పగిలిపోతుంది. నీ కోరికలేమిటో అందరికీ తెలుసు. బడుద్దాయి కొడుకుని నర్సీపట్నంలో గెలిపించాలి. వైజాగ్ రాజధాని కాకుంటే ఖనిజాలు దోచుకున్నా, భూములు ఆక్రమించినా ఎవరి దృష్టీ పడదు. ఉత్తరాంధ్ర పేదరికం అలాగే ఉండాలని కోరుకున్న గంజాయి పాత్రుడు. బోండం ఒరిజినల్ బిజినెస్ చిత్తు కాగితాలు ఏరుకోవడం. దుర్గగుడి దగ్గర సైకిల్ బెల్లులు కొట్టేసిన డబ్బుతో కాల్ మనీ వ్యాపారం చేసే బోండం, నర్సీపట్నంలో గంజాయి అరగుండు పాత్రుడు, దెందులూరులో కోడిపందాల కాంతారావు వంటి స్క్రాప్ ను పెంచి పోషించిన దుర్మార్గం 40ఏళ్ల ఇండస్ట్రీ తుప్పుదే’ అన్నారు. ఈ నాలుగింటిలో బొల్లి బాబు ఏ రకం? 1)అధికారం మా చేతిలోనే ఉండాలి. 2)అసమర్థుడైనా పప్పే సీఎం కావాలి. 3)కుల దైవం డ్రామోజీకి బతికుండగానే ఊరూరా గుళ్ళు కట్టించాలి. 4)వ్యవస్థలన్నిటిలో మావాళ్లే ఉండాలి. బోండం ఒరిజినల్ బిజినెస్ చిత్తు కాగితాలు ఏరుకోవడం. దుర్గగుడి దగ్గర సైకిల్ బెల్లులు కొట్టేసిన డబ్బుతో కాల్ మనీ వ్యాపారం చేసే బోండం, నర్సీపట్నంలో గంజాయి అరగుండు పాత్రుడు, దెందులూరులో కోడిపందాల కాంతారావు వంటి స్క్రాప్ ను పెంచి పోషించిన దుర్మార్గం 40ఏళ్ల ఇండస్ట్రీ తుప్పుదే. #RIPTDP — Vijayasai Reddy V (@VSReddy_MP) November 25, 2022 అరగుండు పాత్రుడు దేవుడి దగ్గరా డ్రామాలేస్తే టెంకాయ పగిలిపోతుంది. నీ కోరికలేమిటో అందరికీ తెలుసు. బడుద్దాయి కొడుకుని నర్సీపట్నంలో గెలిపించాలి. వైజాగ్ రాజధాని కాకుంటే ఖనిజాలు దోచుకున్నా, భూములు ఆక్రమించినా ఎవరి దృష్టీ పడదు. ఉత్తరాంధ్ర పేదరికం అలాగే ఉండాలని కోరుకున్న గంజాయి పాత్రుడు. — Vijayasai Reddy V (@VSReddy_MP) November 25, 2022 ఈ నాలుగింటిలో బొల్లి బాబు ఏ రకం? 1)అధికారం మా చేతిలోనే ఉండాలి. 2)అసమర్థుడైనా పప్పే సిఎం కావాలి. 3)కుల దైవం డ్రామోజీకి బతికుండగానే ఊరూరా గుళ్ళు కట్టించాలి. 4)వ్యవస్థలన్నిటిలో మావాళ్లే ఉండాలి. — Vijayasai Reddy V (@VSReddy_MP) November 25, 2022 -
‘వైఎస్సార్సీపీ విజయాన్ని ఎల్లో మీడియా వక్రీకరించింది’
-
అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలను ఖండించిన ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం
-
ప్రెస్‌మీట్ పేరుతో సభ.. టీడీపీ నేతల అరెస్ట్
రౌతులపూడి: నిబంధనలను ఉల్లంఘించి ప్రెస్‌మీట్ పేరిట సభ నిర్వహించేందుకు యత్నించిన టీడీపీ నాయకులను తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి పోలీసులు శుక్రవారం అడ్డుకున్నారు. విశాఖ జిల్లా నాతవరం మండలం, సుందరకోట శివారు బమిడికలొద్దులో చేపట్టిన బాక్సైట్ తవ్వకాలు నిలిపివేయాలంటూ మాజీ మంత్రులు చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు తదితరులు గిరిజన ప్రాంతాలైన జల్దాం, చల్లూరు, దబ్బాదిలో పర్యటించారు. తర్వాత వీరు రౌతులపూడి చేరుకున్నారు. ప్రెస్‌మీట్ పేరుతో సభ నిర్వహించేందుకు ప్రయత్నించారు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వీరిని పోలీసులు అడ్డుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం వరకు టీడీపీ నేతలతో పోలీసులు చర్చించినా వినలేదు. దీంతో చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనందబాబు, ప్రత్తిపాడు టీడీపీ ఇన్చార్జ్ వరుపుల రాజా, ఎమ్మెల్సీ సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, వంగలపూడి అనిత, వంతల రాజేశ్వరి, బి.రామానాయడు, శ్రావణ్‌కుమార్, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్, తదితరులను పోలీసులు అరెస్టు చేసి కోటనందూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన అనంతరం విడుదల చేశారు. -
‘అయ్యన్న వ్యాఖ్యలు అర్థరహితం.. అమ్మ ఒడి సొమ్ము భద్రం’
ఆరిలోవ(విశాఖ తూర్పు): డీఈవో జాయింట్ అకౌంట్లోని అమ్మఒడి సొమ్ము రూ.3.42 కోట్లు భద్రంగా ఉందని జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఈ ఖాతా నుంచి రూ.30 లక్షలు విత్‌డ్రా చేసి దుర్వినియోగం చేశారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో అమ్మ ఒడి పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన చేపట్టినప్పటి నుంచి వరుసగా రెండేళ్ల పాటు జిల్లాలో అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు. 2019–20లో పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ, ఇతర అవసరాల కోసం విద్యార్థుల తల్లులు స్వచ్ఛందగా రూ.1000 చొప్పున అందజేశారని తెలిపారు. ఈ మొత్తాన్ని డీఈవో జాయింట్ అకౌంట్లో జమ చేశామన్నారు. ప్రస్తుతం ఆ నగదు రూ.3.42 కోట్లు పదిలంగా ఉన్నట్టు చెప్పారు. ఈ ఖాతా నుంచి రూ.30 లక్షలు విత్‌డ్రా చేసి దుర్వినియోగం చేశారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఈ నగదు నిల్వపై ఇంతవరకు ఎలాంటి ఆడిట్ జరగలేదన్నారు. ప్రస్తుతం నాడు–నేడు నిధులతో జిల్లాలోని పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పథకంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నట్టు వివరించారు. దీంతో ప్రత్యేకంగా ఎక్కడా అమ్మ ఒడికి సంబంధించిన డబ్బులు వినియోగించలేదని స్పష్టం చేశారు. ఎప్పుడైనా వాటి అవసరం వస్తే ప్రభుత్వం ఆదేశాల మేరకు.. విత్ డ్రా చేసి పాఠశాలల్లో పనులు జరిపిస్తామన్నారు. దీనికి సంబంధించిన వాస్తవాలు తెలుసుకోకుండా మాజీ మంత్రి అధికారులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. చదవండి: భావోద్వేగాలను రెచ్చగొట్టడం తగదు -
‘చంద్రబాబు మాట వింటే రాజకీయ భవిష్యత్ శూన్యం’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు నాయుడు మాటలు వింటే టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొంగలి జగన్నాథం వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజకీయ భిక్ష పెట్టిన ఉత్తరాంధ్రకి మీరు ద్రోహం చేస్తారా? అని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ నాయకులు ఈ స్థాయిలో ఉన్నారంటే అది ఉత్తారంధ్ర ప్రజల దీవెనలే అన్నారు. ఇసుక అమ్మకాల్లో ఇంకా అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు మధ్య సయోధ్య కుదరలేదని విమర్శలు గుప్పించారు. పార్టీలకతీతంగా ప్రజలు విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోరుకుంటున్నారన్నారు. చంద్రబాబు మాటలు వింటే టీడీపీ నాయకులకు రాజకీయ భవిష్యత్ శూన్యం అవుతుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. -
మళ్లీ తెరపైకి అయ్యన్న సోదరుల విభేదాలు
నర్సీపట్నం : మాజీ మంత్రి అయ్యన్న సోదరుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వైఎస్సార్సీపీలో చేరిన సోదరుడు సన్యాసిపాత్రుడు (జమీలు) తన ఇంటిపై పార్టీ జెండా కడుతుండగా అడ్డుతగలడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి అయ్యన్న కుటుంబంలో విభేదాలు నెలకొనడంతో ఇటీవల సోదరుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు తన అనుచరగణంతో వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఎప్పటి మాదిరిగానే ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. గురువారం ముహూర్తం చూసుకుని తాను నివాసముంటున్న ఇంటిపై సన్యాసిపాత్రుడు కుమారుడు వరుణ్ జెండా కడుతుండగా వరుసకు చిన నాన్నమ్మ అయిన పెదపాత్రుని లక్ష్మి, మరో బంధువు హర్ష వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వీరి మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. అప్పటికే అనారోగ్యంతో ఉన్న లక్ష్మి స్వల్ప అస్వస్థతకు గురయ్యింది. తన ఇంటిపై జెండా కడుతుండగా అడ్డుకుంటున్నారని, అదేవిధంగా మాజీ మంత్రి తనయుడు విజయ్, మరో బంధువు హర్ష వల్ల తనకు ప్రాణహాని ఉందని వరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా అస్వస్థతకు గురైన లక్ష్మి ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. దీంతో ముందస్తు చర్యగా పోలీసులు సన్యాసిపాత్రుడు, అయ్యన్న నివాసం వద్ద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులపై అయ్యన్న దురుసుతనం కాగా ఈ సందర్భంగా తన ఇంటికి వచ్చిన పోలీసులపై మాజీ మంత్రి అయ్యన్న విరుచుకుపడ్డారు. ‘తమాషాగా ఉందా.. మేం కోడితే ఏమిచేస్తావు నీవు.. మర్యాదగా వెళ్లిపొండి..పద్ధతి గల మనుషులము మేము..మా ఇంటికి వచ్చేటప్పుడు అనుమతి లేకుండా రాకూడదు..ఎవరిచ్చారు నీకు అనుమతి?’ అంటూ పోలీసులపై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు దుర్భాషలాడుతూ దబాయించారు. -
వైఎస్సార్సీపీలో చేరిన సన్యాసిపాత్రుడు
సాక్షి, అమరావతి : టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకు గట్టి షాక్ తగిలింది. ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కుటుంబ సభ్యులతో సహా పార్టీలో చేరుతున్న సన్యాసిపాత్రుడుని సీఎం జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సన్యాసిపాత్రుడుతో పాటు భార్య అనిత, నర్సీపట్నం మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. కాగా సన్యాసిపాత్రుడు నర్సీపట్నం మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక ఆయన సతీమణి అనిత మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా విధులు నిర్వర్తించారు. కాగా టీడీపీ తీరుతో మనస్తాపం చెందిన సన్యాసిపాత్రుడు దంపతులు ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నర్సీపట్నం పర్యటనలో ఉండగానే సన్యాసిపాత్రుడు రాజీనామా చేసి పార్టీ అధిష్టానంతో పాటు సోదరుడు అయ్యన్నకు షాక్ ఇచ్చారు. రాజీనామా సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో రెండేళ్లుగా తనకు ప్రాధాన్యత లేకుండా చేశారన్నారు. గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించారని ఆరోపించారు. ఈ విషయాలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన చెందారు. తన పట్ల వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెంది రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. -
ఇసుక మాఫియా డాన్ కవాతుకు ముఖ్య అతిథా ?
సాక్షి, విశాఖపట్నం: గత ఐదేళ్లలో ఇసుకను దోచుకుతిన్న టీడీపీతో కలిసి జనసేన లాంగ్‌మార్చ్ చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. లాంగ్‌మార్చ్‌తో పవన్‌కల్యాణ్, చంద్రబాబుల మధ్య బంధం బహిర్గతమైందన్నారు. శనివారం మద్దిలపాలెంలో గల పార్టీ నగర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన సుపుత్రుడు రాజకీయాలకు పనికిరాడని దత్తపుత్రుడైన పవన్‌కల్యాణ్‌తో ఫ్యాకేజీకి మాట్లాడి లాంగ్‌మార్చ్ చేయిస్తున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నుంచి వందల కోట్లు తీసుకుని గాజువాక, భీమవరాలలో పవన్‌కల్యాణ్ ఖర్చుపెట్టిన విషయం నిజం కాదా అని విమర్శించారు. కృష్ణానది పక్కన ఉన్న విజయవాడలో గానీ, గోదావరి పక్కన ఉన్న రాజమండ్రిలో గానీ పవన్‌కల్యాణ్ లాంగ్‌మార్చ్ పెట్టగలడా అని ప్రశ్నించారు.ఇది లాంగ్ మార్చ్‌కాదు, రాంగ్‌మార్చ్ అని విమర్శించారు. కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి ఎక్కువగా ఉందని, అందుకనే ఇసుక కొరత ఉందని ప్రజలందరికీ తెలుస న్నారు. సొంత బావ హరికృష్ణ శవం సాక్షిగా శవరాజకీయాలు చేసిన చరిత్ర చంద్రబాబుదని చెప్పారు. సమావేశంలో మట్లాడుతున్న చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్యాకేజీ కోసం చంద్రబాబు డైరెక్షన్లో పవన్ నటిస్తున్నాడని ఎద్దేవాచేశారు. రైతులు పల్లెల్లో సంతోషంగా ఉన్నారన్నారు. ఐదేళ్లలో టీడీపీ నేతలు ఇసుక దోపిడీచేస్తే పవన్‌కల్యాణ్ లాంగ్‌మార్చ్ కాదు కదా..షార్ట్ మార్చ్ కూడా చేయలేదని విమర్శించారు. మా ప్రభుత్వంలో రూ.4.90కే రవాణా చేస్తామంటే వారికే అనుమతిస్తున్నామన్నారు. సుమారు 267 రీచ్‌లు ఉంటే వరద కారణంగా కేవలం 67 రీచ్‌లలో మాత్రమే ఇసుక లభ్యమవుతోందని చెప్పారు. వరద ఉధృతి తగ్గిన తరువాత అక్రమాలకు తావులేకుండా పూర్తి స్థాయిలో ఇసుక అందిస్తామన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు, అతని డ్రామా ట్రూప్ అంతా కుటిల రాజకీయాలు మాని ప్రజల క్షేమం కోసం పనిచేయాలని కోరారు. ప్రభుత్వానికి సలహాలివ్వండి, వాటిని స్వీకరించి ..ప్రజల క్షేమం కోసం పనిచేద్దామన్నారు. కాదని అభివృద్ధికి అడ్డుపడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, సీనియర్‌నేత కొయ్య ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగేంద్ర, ముఖ్యనాయకులు మంత్రి రాజశేఖర్, సతీష్‌వర్మ తదితరులు పాల్గొన్నారు. సాక్షి, విశాఖపట్నం: సినిమాల్లో అనేక బ్యానర్లు, ప్రొడక్షన్లలో పనిచేసిన పవన్‌కల్యాణ్ రాజకీయాల్లో నారావారి ప్రొడక్షన్లో ప్యాకేజీలకోసం పనిచేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. శనివారం మద్దిలపాలెం నగరపార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నదులు ఏ విధంగా పొంగిపొర్లుతున్నాయో ప్రజలందరికీ తెలుసని, ఒక్క సీటు గెలిచిన పిల్లసేన పార్టీ ..23 సీట్లు గెలిచిన ఇంకుడు గుంతల పార్టీ అయిన టీడీపీతో కలిసి లాంగ్‌మార్చ్ చేస్తామనడం హాస్యస్పదంగా ఉందన్నారు. పవన్‌కల్యాణ్ సినిమాల్లో నటించడం ఎందుకు మానేశారో మొదట్లో ఎవరికీ అర్థం కాలేదని, సినిమాల్లో కన్నా చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలే ఎక్కువని మానేశారని ప్రజలకు ఇప్పుడు అర్థమైందన్నారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా ఇసుక కొరత ఏర్పడిందని, వరద ఉధృతి తగ్గిన తర్వాత ఆ సమస్యను అధిగమిస్తామన్నారు. వైఎస్ జగన్ సీఎం అయితే పేరు మార్చుకుంటానని పవన్‌కల్యాణ్ గత ఎన్నికల్లో ప్రగల్బాలు పలికాడని, మరి ఇప్పుడు నారా పవన్‌కల్యాణ్ అని ఎందుకు మార్చుకోలేదని విమర్శించారు. గాజువాకలో ఓటమి తర్వాత అక్కడి వారిని కలవని పవన్ ఇప్పుడు బాబు డైరెక్షన్లో హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన వైఖరి నచ్చకే విశాఖలో మాజీ మంత్రి బాలరాజు రాజీనామా చేశారన్నారు. ఇసుక మాఫియా డాన్ ముఖ్య అతిథా ? గత ఐదేళ్లలో ఇసుక దోపిడీ చేసిన అచ్చెన్నాయుడు టీడీపీ నుంచి లాంగ్‌మార్చ్‌కి ముఖ్య అతిథిగా పాల్గొంటుండడంపై ఆయన తీవ్రంగా విమరించారు. డ్రగ్ మాఫియా డాన్ అయ్యన్నపాత్రుడు, లిక్కర్ మాఫియా డాన్ వెలగపూడి రామకృష్ణబాబులను పక్కనపెట్టుకుని లాంగ్‌మార్చ్ చేస్తారా అని విమర్శించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వందరోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఉద్దానం సమస్యను పరిష్కరించడమే మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, సీనియర్‌నేత కొయ్య ప్రసాదరెడ్డి, అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, పేర్ల విజయచంద్ర, ముఖ్యనాయకులు మంత్రి రాజశేఖర్, పరూఖి, జీవీ కృష్ణారావు పాల్గొన్నారు. -
అయ్యన్న అల్టిమేటం..!
చినబాబు.. ఆయన తోడల్లుడి మధ్య సీట్ల వివాదం తన కుటుంబంలో చిచ్చురేపి.. తలబొప్పి కట్టించే స్థాయికి చేరుకోవడం.. ఒత్తిడికి తలొగ్గి చివరికి చినబాబును మంగళగిరికి తరలించడం ద్వారా టీడీపీ అధినేత ఉపద్రవం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. అయితే మంత్రి అయ్యన్న రూపంలో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. టిక్కెట్ల ఖరారును మరిన్ని చిక్కుముడులతో సంక్లిష్టం చేస్తున్నాయి. నర్సీపట్నం అసెంబ్లీ లేదా అనకాపల్లి ఎంపీ సీటును తన వారసుడికి ఇవ్వాలని అయ్యన్న పట్టుపడుతున్నారు. గత ఎన్నికల్లో తన వర్గానికి చుక్కలు చూపించిన ఆడారి తులసీరావు కుమారుడు ఆనంద్‌కు ఎంపీ సీటు ఇస్తే అంగీకరించే ప్రసక్తే లేదని అధినేతకు స్పష్టం చేశారు. అదే సమయంలో మంత్రి గంటాను అనకాపల్లి ఎంపీ లేదా అసెంబ్లీ పోటీ చేయించడానికి కూడా వీల్లేదని పట్టబడుతున్నారు. ఫలితంగా ఈ చిక్కుముడిని ఎలా విడదీయాలో.. సీట్లు ఎవరికి ఖరారు చేయాలో తెలియక చంద్రబాబు తలపట్టుకుంటున్నారు. గాజువాక, ఉత్తర, పాయకరావు పేటల్లోనూ ఇదే గందరగోళం నెలకొంది. సాక్షి, విశాఖపట్నం: ఓ వైపు గంటా మరోవైపు అయ్యన్న తమ ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు జిల్లాలో సీట్ల ఖరారు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. భీమిలి లేదా విశాఖ ఉత్తర నుంచి తన పుత్రరత్నాన్ని ఎలాగైనా బరిలోకి దింపాలని తొలుత ఆశపడిన చంద్రబాబు అధికారిక ప్రకటన కూడా చేశారు. పుత్రుడి కోసమే విశాఖ లోక్‌సభ సీటుపై ఆశలు పెట్టుకున్న లోకేష్ తోడల్లుడు భరత్ ఆశలపైనా నీళ్లు చల్లారు. తోడల్లుళ్లిద్దరికీ ఒకే జిల్లాలో సీట్లు ఇవ్వడం కుదరని చంద్రబాబు తేల్చిచెప్పడంతో భరత్‌కు చిర్రెత్తుకొచ్చింది. తన మామ, సినీ నటుడు బాలకృష్ణపై ఒత్తిడి తీసుకురావడంతో భరత్‌కు ఎంపీ సీటు ఇవ్వాల్సిందేనని ఆయన చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చారు. కుటుంబంలో చిచ్చు రేగడంతో గత్యంతరం లేక తన కుమారుడిని మంగళగిరి నుంచి బరి లోకి దింపాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో భరత్‌కు లైన్ క్లియర్ అయినట్టయ్యింది. ఆడారికి ఎంపీ సీటిస్తే పోటీ చేయనంటున్న అయ్యన్న? మరోవైపు విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుమారుడు ఆనంద్‌కు అనకాపల్లి ఎంపీ సీటు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్న అధినేతకు అయ్యన్న ఒత్తిళ్లు అయోమయంలో పడేస్తున్నాయి. గత ఎన్నికల్లో తన శిష్యుడైన మాడుగుల టీడీపీ అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడు ఓటమికి పని చేయడంతో పాటు.. తనకు చుక్కలు చూపించిన ఆడారి కుటుంబానికి చెక్ పెట్టాలని అయ్యన్న పావులు కదుపుతున్నారు. తులసీరావు కుమారుడు ఆనంద్‌కు ఏ సీటు ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు.. అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తే మాత్రం కుదరదని తెగేసి చెప్పినట్టు చెబుతున్నారు. కావాలంటే యలమంచలి సీటు ఇచ్చుకోండి అంతే కానీ అనకాపల్లి ఎంపీ సీటు ఇచ్చి మా మీద పెత్తనం చెలాయించాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని.. అదే జరిగితే తాను పూర్తిగా పోటీ నుంచి తప్పుకోవడానికి వెనుకాడనని అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. గంటాకు కూడా నో.. టీడీపీలోకి వస్తారని భావిస్తున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు ఇచ్చినా అభ్యంతరం లేదంటున్న అయ్యన్న అనకాపల్లి ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు తెరపైకి గంటా పేరు రావడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అంతేకాదు తన శిష్యుడు గవిరెడ్డి రామానాయుడుకు మాడుగుల సీటు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. గత ఎన్నికల్లో తులసీరావు వల్లే గవిరెడ్డి ఓటమి పాలయ్యారని, ఈసారి అతనికి సీటు ఇవ్వాలని గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని అయ్యన్న అధినేతకు చెప్పినట్లు తెలుస్తోంది. సబ్బంహరి కోసం ఐవీఆర్ఎస్ సర్వే మరో విచిత్రమైన రాజకీయం టీడీపీలో చోటు చేసుకుంది. ఇప్పటి వరకు సిట్టింగ్‌లు, ఆశావాహుల్లో ఎవరు సమర్ధులో నిర్ణయించేందుకు ఐవీఆర్ఎస్ ద్వారా పార్టీ కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. కానీ తొలిసారి అసలు పార్టీలోకే ఇంకా రాని సబ్బంహరికి టికెట్ ఇస్తే బాగుంటుందా? పంచకర్ల రమేష్‌బాబు అయితే బాగుంటుందా..? అని విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ శ్రేణులు, ప్రజల నుంచి ఐవీ ఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు సేకరిస్తున్నారు. విశాఖ ఉత్తరం నుంచి ఎవర్ని బరిలోకి దింపాలో చంద్రబాబు తేల్చుకోలేకపోతున్నారు. మరో వైపు బీజేపీ సిటింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కూడా టీడీపీ తరపున ఈ సీటును ఆశిస్తున్నారు. ఒక వేళ టీడీపీ నుంచి పిలుపు రాకపోకే జనసేనలోకి వెళ్లి ఆ పార్టీ తరపున బరిలోకి దిగాలని భావిస్తున్నట్టుగా తెలియ వచ్చింది. పల్లాకు రెబల్ బెడద గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు టికెట్ ఖరా రు చేసినట్లు పార్టీ నాయకత్వం నుంచి స్పష్టమైన సంకేతాలొచ్చాయి. దాంతో ఈ సీటు ఆశిస్తున్న పార్టీ సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు తన అనుచరులతో తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. పల్లాకు సీటు ఇస్తే తాను రెబల్‌గా బరిలోకి దిగుతానని బుధవారం మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. ఎన్టీఆర్, చంద్రబాబు ఫోటోలు పెట్టుకునే ప్రచారానికి వెళ్తానని, పల్లాను ఓడించడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. -
టీడీపీ నేతల బరితెగింపు..
సాక్షి, విశాఖపట్నం: ‘మీకు చెక్కు–చీర–గొడుగు కావాలంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తామని దేవుడి మీద ప్రమాణం చేయాలి. అది కూడా మేము చెప్పినట్లే ప్రమాణం చేయాలి. లేదంటే మీకు రూ.10 వేల చెక్కు, చీర, గొడుగు ఇవ్వం’. ఇదీ టీడీపీ నేతల బరితెగింపు. అసలేం జరిగిందంటే ..గురువారం సాయంత్రం నర్సీపట్నం మున్సిపాలిటీలోని 26వ వార్డులో తెలుగుదేశం ప్రభుత్వం పంచుతున్న ‘పసుపు–కుంకుమ చెక్కుల కోసం ఆ వార్డులో ఉన్న డ్వాక్రా మహిళలు హనుమాన్ ఆలయానికి వచ్చారు. ఈ ఆలయంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖామంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చిన్న కుమారుడు రాజేష్ చేతుల మీదుగా చెక్కులు, చీరలు, గొడుగులు పంపిణీ చేశారు. అంతకన్నా ముందు హనుమాన్ ఆలయంలో డ్వాక్రా మహిళలతో ‘వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తామని, ఎవరి ఒత్తిడికి .. ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వబోమని దైవసాక్షిగా ప్రమాణం చేయించారు. తప్పని పరిస్థితుల్లో ఆ డ్వాక్రా అక్కచెల్లెమ్మలంతా ప్రమాణం చేయక తప్పలేదు. మున్సిపల్ కౌన్సిలర్ పైల గోవింద్, వార్డు మాజీ మెంబర్, రిటైర్డ్ టీచర్ రుత్తల తాతీలు పాల్గొని డ్వాక్రా మహిళలతో ప్రమాణం చేయించారు. కాగా సీఎం చంద్రబాబునాయుడు తరఫున పసుపు–కుంకుమ కింద మహిళలకు రూ.10 వేలు ఇస్తుంటే.. మా కుటుంబం తరఫున మహిళలకు చీరలు ఇస్తున్నామని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బహిరంగ సభల్లో చెబుతున్నారు. దీనిలో భాగంగా నియోజకవర్గంలో మంత్రి సతీమణి పద్మావతి, తనయులు విజయ్, రాజేష్ తమ అనుచరులతో ముందస్తు ఎరగా ముమ్మరంగా చీరలు పంపిణీ చేస్తున్నారు. ఏదో చీర ఇస్తామంటే వెళ్లాం కానీ.. భగవంతుడి సన్నిధిలో పిల్లా పాపలతో ఉన్న తమచేత ప్రమాణం చేయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మంత్రి అయ్యన్న హత్యకు కుట్ర!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడి హత్యకు కుట్ర జరుగుతుందంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వదంతులు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కుటుంబంలోని వ్యక్తులే బయటివారితో చేతులు కలిపి అయ్యన్నని హతమార్చేందుకు కుట్ర పన్నుతున్నారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతుండగా, వారు మంత్రి అయ్యన్న పాత్రుడ్ని హతమార్చడానికి కుట్ర పన్నేందుకే అక్కడ సమావేశమైనట్టుగా చూపించారు. సన్యాసిపాత్రుడు కుమారుడు వరుణ్ దీనిని ఖండిస్తూ తన తండ్రి ఇమేజ్ను దెబ్బతీసేందుకు ఓ పథకం ప్రకారం కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి సన్యాసి పాత్రుడు విశాఖ పట్నంలో జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీని కలిసి వినతిపత్రం సమర్పించారు. కావాలనే కుట్ర చేస్తున్నారు: సన్యాసిపాత్రుడు తనపై ఓ పథకం ప్రకారమే దుష్ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసిపాత్రుడు ఎస్పీకి అందజేసిన లేఖలో ఆరోపించారు. ఈ నెల 21న నర్సీపట్నం సత్యకాంప్లెక్స్లో తన స్నేహితుడు షేక్ అల్లా ఉద్దీన్ కుమార్తె వివాహానికి తన బంధువు చింతకాయల రమణ, గన్మెన్లతో కలిసి తాను హాజరయ్యానని, ఆ ఫంక్షన్‌కు నాతవరానికి చెందిన పలువురు ప్రతిపక్ష నేతలు కూడా హాజరయ్యారన్నారు. వరండాలో మెట్లు దిగుతున్న సమయంలో వారు ఎదురవడంతో మర్యాదపూర్వకంగా పలుకరించుకున్నామన్నారు. ఆ సమయంలో సీసీ టీవీ పుటేజ్ సేకరించి.. ఆ దృశ్యాలను తమకు అనుకూలంగా క్రోడీకరించి.. తన సోదరుడిని హత్య చేసేందుకు తామంతా ఏదో కుట్ర చేసేందుకు సమావేశమైనట్టుగా ఒక తప్పుడు వీడియోను సృష్టించి వైరల్ చేశారని ఆరోపించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈవీడియో వెనుక ఉన్నదెవరో గుర్తించి చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. -
బెదిరింపులతో సీనియర్లకు చెక్
సాక్షి, అమరావతి: కాంగ్రెస్‌తో జతకట్టడాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ సీనియర్ నాయకులను దారిలోకి తెచ్చేందుకు చంద్రబాబు బెదిరింపు మార్గాన్ని ఎంచుకున్నారు. ఎవరైనా తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే రాజకీయ భవితవ్యం లేకుండా చేస్తానని హెచ్చరించడమేకాక అందుకు తగినట్లే పావులు కదుపుతున్నారు. తన సమకాలికుడు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా ఉన్న మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కాంగ్రెస్ పొత్తుపై తమ వైఖరిని మార్చుకుని చంద్రబాబుకు అనుకూలంగా ప్రకటనలు చేయాల్సి రావడానికి బెదిరింపులే కారణమని తెలుస్తోంది. కాంగ్రెస్‌తో జట్టుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని తెలిసి.. కొద్దిరోజుల క్రితం ఈ ఇద్దరు సీనియర్లు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉంటే తాను ఉరి వేసుకుంటానని చెప్పిన కేఈ.. తాజాగా చంద్రబాబు నిర్ణయానికి తాను సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని పెట్టారని, ఆ పార్టీతో కలిస్తే తమను ప్రజలు బట్టలు ఊడదీసి తంతారని చెప్పిన అయ్యన్న ఇప్పుడు మాట మార్చి కాంగ్రెస్‌తో పొత్తు తప్పుకాదని ప్రకటించారు. కుమారుల కోసం చంద్రబాబుకు జై.. ఈ ఇద్దరు సీనియర్లు మాట మార్చడం వెనుక చంద్రబాబు బెదిరింపు రాజకీయం ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేఈ.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని పేర్కొని తన కుమారుడు శ్యాంబాబును వారసుడిగా ప్రకటించారు. కానీ శ్యాంబాబుపై ఇసుక అక్రమ తవ్వకాలు, హత్య కేసు కోర్టు విచారణలో ఉన్నాయి. వీటిని సాకుగా చూపిన చంద్రబాబు.. శ్యాంబాబుకు బదులు కేఈ మరో సోదరుడు ప్రతాప్‌కు సీటిస్తానని పరోక్షంగా తన కోటరీ ద్వారా లీకులిప్పించారు. చంద్రబాబు వ్యూహం తెలిసిన కేఈ.. వెంటనే స్వరం మార్చారు. పార్టీ కంటె తన కుమారుడి రాజకీయ భవిష్యత్తే ప్రధానమని భావించి చంద్రబాబు నిర్ణయానికి మద్దతు ప్రకటించారని తెలుస్తోంది. ఇక అయ్యన్నపాత్రుడిని సైతం చంద్రబాబు ఇలాగే కుటుంబ వ్యూహంలో ఇరికించారని చెబుతున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు విజయ్ను పోటీ చేయించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఇటీవల ఆయనకు వ్యతిరేకంగా కుటుంబంలో రేగిన చిచ్చును చంద్రబాబు ఉపయోగించుకున్నారు. నర్సీపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్‌గా (ఆయన భార్య అనిత చైర్మన్) ఉన్న అయ్యన్న సోదరుడు సన్యాసిపాత్రుడితో విజయ్‌కు వ్యతిరేకంగా చంద్రబాబుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయించారు. సన్యాసిపాత్రుడిని చంద్రబాబు కోటరీ ప్రోత్సహించడంతోపాటు తన కొడుక్కి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించడంతో అయ్యన్నకు వ్యూహం అర్థమై వెంటనే బాబుకు అనుకూలంగా స్వరం మార్చేశారని తెలుస్తోంది. ఇలా వారి కుటుంబాల్లో విభేదాలు సృష్టించి, బెదిరించి లొంగదీసుకున్నట్లు చర్చ నడుస్తోంది. -
కిడారి, సోమను అందుకే హతమార్చాం
విశాఖ సిటీ: బహుళ జాతి సంస్థలకు ఏజెంట్లుగా మారి కోట్లాది రూపాయల ఆదివాసీల సహజ సంపదను కొల్లగొడుతున్నందునే ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చామని మావోయిస్టులు ప్రకటించారు. ఆంధ్ర–ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ(ఏఓబీఎస్‌జెడ్‌సీ) లెటర్ హెడ్‌పై అధికార ప్రతినిధి జగబంధు పేరుతో శుక్రవారం రెండు పేజీల లేఖను విడుదల చేశారు. మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు కూడా లేటరైట్ పేరుతో బాౖక్సైట్ను దోచుకుంటున్నారని, ఆపకపోతే తర్వాతి పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కిడారి, సోమ హత్య జరిగిన వారం రోజుల తర్వాత ఆ హత్యల గురించి ఎర్ర సిరా అక్షరాలతో వచ్చిన లేఖ అబద్ధమని పోలీసులు అప్పట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత మరో లేఖ బయటకు వచ్చినా అందులో కిడారి, సోమ హత్యల గురించి మావోలు చెప్పలేదు. తాజాగా విడుదలైన లేఖలో మాత్రం హతమార్చడానికి దారితీసిన పరిస్థి తులు, జరుగుతున్న మోసాల గురించి వివరిస్తూ.. కమిటీ లెటర్‌హెడ్‌పై లేఖ రావడంతో విశ్వసనీయత చేకూరింది. లేఖలోని సారాంశం.. వారు ఆదివాసీ ద్రోహులు ‘‘కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలు ఆదివాసీ నేతలు కానే కాదు. వారు ద్రోహులు. ప్రజాసేవ ముసుగులో మామూలు స్థాయి నుంచి కోట్లకు పడగలెత్తారు. క్వారీ యజమానులుగా, అరకు, అనంతగిరి, పాడేరు, విశాఖలో ఆస్తుల్ని, భూముల్ని అక్రమంగా గడించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సాగిస్తూ, బాక్సైట్ వెలికితీత కోసం జిందాల్, రస్‌అల్‌ఖైమా, అన్‌రాక్‌లకు ఏజెంట్లుగా వ్యవహరించి అక్రమంగా డబ్బు వెనకేసు కున్నారు. సివేరి సోమ ఎమ్మెల్యేగా కొనసాగిన కాలంలో ఇలాంటి దళారీ పాత్రలు నిర్వహించి నందుకుగాను, చైనా క్లే తీసేందుకు ప్రయత్నించిన సందర్భంలో డుంబ్రిగూడ మండలం కండ్రుం గ్రామాల ప్రజలంతా ఏకమై వెంటపడి తరి మారు. ప్రజాగ్రహానికి గురైనా తన తీరు మార్చు కోకుండా జిందాల్‌కు ఏజెంటుగా వ్యవహరించ డమే కాకుండా బాౖక్సైట్ విషయంలో ప్రజా వ్యతిరేకిగా వ్యవహరించాడు. సర్వేశ్వరరావు రోజుకో పార్టీని మారుస్తూ డబ్బు సంపాదనే ధ్యేయంగా అర్రులు చాచాడు. ఆయన కొన సాగిస్తున్న క్వారీని మూసెయ్యాలనే డిమాండ్‌తో హుకుంపేట మండలం గూడ గ్రామ ప్రజలు నెలల తరబడి ఆందోళన చేస్తున్నా అధికార అండతో ఏమాత్రం ఖాతరు చెయ్యలేదు. సొంత పార్టీలోనే వాటికి వ్యతిరేకంగా బహిరంగంగా ఆందోళనలు, నిరసనలు పెల్లుబికిన పరిస్థితి ప్రజలందరికీ తెలుసు. వీరిద్దరూ మెజార్టీ ప్రజల ఆగ్రహానికి గురైన కార ణంగా ప్రజావ్యతిరేకుల్ని, ద్రోహులను అంతం చెయ్యాలనే నిర్ణయంతోనే తమ పార్టీ పీఎల్జీఏ ఆధ్వర్యంలో తీర్పుని అమలు చేశాము’’ అని జగబంధు లేఖలో స్పష్టం చేశారు. అయ్యన్నా.. మైనింగ్ మానుకో తెలుగుదేశం ప్రభుత్వ అండదండలతో తూర్పు కనుమల్లో అటవీ సంపదను బినామీ పేర్లతోనూ, ఆదివాసీ దళారులుగా పుట్టకొకరు తయారై, క్వారీలు, గనుల్ని తెరుస్తూ ప్రజా సంపదను కొల్లగొడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు ప్రాంతంలో లేటరైట్ పేరుతో బాక్సైట్ ఖనిజాన్ని తరలిస్తున్నారనీ, దీని వెనుక మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు విజయ్లున్నారని తెలిపారు. మన్యం ప్రాంత సంపద అక్రమ తరలింపుని తక్షణమే నిలిపెయ్యా లనీ, లేకపోతే.. జరిగే తీవ్ర పరిణామాలకు తామే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని దళారీలను, ప్రజా వ్యతిరేక నాయకుల్ని జగబంధు హెచ్చరించారు. ఇకనైనా తెలుగుదేశం ప్రభుత్వం బాక్సైట్ వెలికితీత కోసం జారీ చేసిన జీవో నం.97ని పూర్తిగా రద్దు చెయ్యడమే కాకుండా, అటవీ సంపదని అక్రమంగా దోచుకునే కార్యక్రమాల్ని మానుకోవాలని మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాదంలో అయ్యన్న తనయుడికి గాయాలు
మాకవరపాలెం(నర్సీపట్నం) విశాఖపట్నం : ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడడంతో మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు విజయ్ గాయపడ్డాడు. ప్రత్యేక హోదాకోసం బుధవారం గిడుతూరులో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విజయ్ బైక్‌పై పి.పి.అగ్రహారం బయలుదేరారు. గ్రామ సమీపంలోని మలుపు వద్దకు వచ్చే సరికి బైక్ అదుపుతప్పడంతో కిందపడిపోయాడు. దీంతో ఆయన ఎడమ చేతికి తీవ్ర గాయమైంది. తొలుత నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించిన అనంతరం విశాఖకు తరలించారు. -
పవన్ ఒక సినిమాలో నటిస్తే 10 నుంచి 30 కోట్లు..
తాడేపల్లిగూడెం: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు పంచాయితీ కార్యాలయంలో జరిగిన సభలో పవన్, మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావులపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాలుగు సంవత్సరాల క్రితమే బీజేపీ నుంచి బయటకు వచ్చేసివుండవలసింది అని పవన్ కల్యాణ్ అంటున్నాడు..అది మూర్ఖత్వంగా అనిపిస్తోందన్నారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లింది రాష్ట్రాభివృధ్ధికోసమే..ఎన్నాళ్లని కాళ్లు పట్టుకుంటాం..అందుకోసమే పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఇంకా మాట్లాడుతూ.. ‘ నీకేమయ్యింది ఒక సినిమాలో నటిస్తే 10 నుంచి 30 కోట్ల రూపాయలు వస్తాయి. నువ్వు నీ పెళ్లాలు సంతోషంగా ఉంటారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు నష్టపోతారు. మిత్రధర్మం ముగిసిన తర్వాత మా కార్యకర్తలను కాపాడుకోవాలి కదా అందుకే తాడేపల్లిగూడెం వచ్చాను. నన్ను అడగకుండా నా నియోజకవర్గానికి రావద్దని మాణిక్యాల రావు అనేవారు. మిత్ర ధర్మం ముగిసిపోయింది. ఇక నుంచి 15 రోజుల కొకసారి తాడేపల్లిగూడెం వస్తాను. ఇక్కడి కార్యక్రమాలు నా భుజాన వేసుకుంటాను. మాణిక్యాల రావు నిన్న మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో అంతులేని అవినీతి జరిగిందని, లోకేష్ ఎన్నోకోట్ల రూపాయలు తినేశాడని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నాడని, ఆ ఆరోపణలపై విచారణ జరిపించాలని అంటున్నాడు. పవన్ కళ్యాణ్ చెబితే కానీ అవినీతి నీకు కనపడలేదా ? నాలుగు సంవత్సరాలు చంద్రబాబు ప్రక్కన మంత్రిగా పనిచేసినపుడు కనపడని అవినీతి మంత్రి పదవి పోగానే తెలిసిందా. పవన్ కళ్యాణ్ చెప్పారు కాబట్టి ఎంక్వైరీ వేయమంటావా, నీకు దమ్ముంటే అవినీతి నిరూపించు, దేవాదాయశాఖ మంత్రిగా నీకు భక్తి ఉంటే రుజువు చెయ్. రాజకీయాలు వదలి మేము వెళ్లిపోతాం’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. -
జనవరిలో కొత్త గృహ నిర్మాణాలకు శ్రీకారం
తాడేపల్లిగూడెం రూరల్ : వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇ¯ŒSచార్జ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. మండలంలోని నీలాద్రిపురంలో రూ.1.13కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, రూ.10లక్షలతో శ్మశాన వాటిక నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్రాంతి కానుకగా మరో రెండు లక్షల మంది అర్హులైనవారికి తెల్ల కార్డులు అందజేయనున్నట్టు వివరించారు. జిల్లా పరిషత్ చైర్మ¯ŒS ముళ్ళపూడి బాపిరాజు మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే ఈలి నాని, మున్సిపల్ చైర్మ¯ŒS బొలిశెట్టి శ్రీనివాస్, ఎంపీపీ గన్నమని దొరబాబు, ఏఎంసీ చైర్మ¯ŒS పాతూరి రామ్‌ప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
'ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా లేదు'
విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో తాగునీటి సరఫరా లేదని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. వచ్చే నాలుగేళ్లలో రూ.4వేల కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. 927 పంచాయతీల్లో డంపింగ్ యార్డులు నిర్మాణం చేపడతామని తెలిపారు. అదే విధంగా 782 గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా పనులు చేపడతామని మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా చెప్పారు. -
'టూరిజం హబ్ గా విశాఖ'
విశాఖపట్టణం: వందలోపు చదరపు గజాలు ఉన్న ఇళ్ల స్థలాలు అన్నింటినీ ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఈనెల 15న ఆ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారని అన్నారు. అదే విధంగా విశాఖపట్టణంలో అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ల కోసం వెయ్యి ఎకరాల స్థలాన్ని గుర్తిస్తున్నామన్నారు. అంతే కాకుండా విశాఖను టూరిజం హబ్‌గా తయారు చేస్తామని చెప్పారు. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామని మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా తెలియజేశారు. -
'డెంగ్యూ ప్రబలుతోంది.. దృష్టిపెట్టండి'
జిల్లా అధికారులతో మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్: రాష్ట్రంలో పలు జిల్లాల్లో డెంగ్యూ వాధి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, వ్యాధి నియంత్రణ చర్యలపై అధికారులు దృష్టి సారించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో పాటు చికెన్ గున్యా, డెంగ్యూ జర్వాలు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం జిల్లా అధికారులతో మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు పీతల సుజాత, కామినేని శ్రీనివాస్, 13 జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్వోలు, డీపీఓ సమావేశంలో పాల్గొన్నారు. ఏజెన్సీ ఏరియాతో పాటు అనుమానిత అన్ని గ్రామాల్లో తరుచూ రక్ష పరీక్ష నిర్వహించాలని మంత్రులు అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్, మున్సిపల్, గ్రామీణ నీటి సరఫరా, ఆరోగ్య శాఖల అధికారులు ప్రతి 15 రోజులకొకసారి సమావేశమై.. వ్యాధులపై చర్చించాలని ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రత విషయంలో ఎక్కడా అశ్రద్ధ వహించవద్దని హెచ్చరించారు. మంత్రి కామినేని మాట్లాడుతూ.. వైద్య శాఖ కమిషనరేట్‌లో 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.