
విజయ్
మాకవరపాలెం(నర్సీపట్నం) విశాఖపట్నం : ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడడంతో మంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు విజయ్ గాయపడ్డాడు. ప్రత్యేక హోదాకోసం బుధవారం గిడుతూరులో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విజయ్ బైక్‌పై పి.పి.అగ్రహారం బయలుదేరారు. గ్రామ సమీపంలోని మలుపు వద్దకు వచ్చే సరికి బైక్ అదుపుతప్పడంతో కిందపడిపోయాడు. దీంతో ఆయన ఎడమ చేతికి తీవ్ర గాయమైంది. తొలుత నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించిన అనంతరం విశాఖకు తరలించారు.