
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు నాయుడు మాటలు వింటే టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొంగలి జగన్నాథం వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజకీయ భిక్ష పెట్టిన ఉత్తరాంధ్రకి మీరు ద్రోహం చేస్తారా? అని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ నాయకులు ఈ స్థాయిలో ఉన్నారంటే అది ఉత్తారంధ్ర ప్రజల దీవెనలే అన్నారు. ఇసుక అమ్మకాల్లో ఇంకా అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు మధ్య సయోధ్య కుదరలేదని విమర్శలు గుప్పించారు. పార్టీలకతీతంగా ప్రజలు విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోరుకుంటున్నారన్నారు. చంద్రబాబు మాటలు వింటే టీడీపీ నాయకులకు రాజకీయ భవిష్యత్ శూన్యం అవుతుందని ఆయన వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment