jagannadham
-
‘చంద్రబాబు మాట వింటే రాజకీయ భవిష్యత్ శూన్యం’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు నాయుడు మాటలు వింటే టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొంగలి జగన్నాథం వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజకీయ భిక్ష పెట్టిన ఉత్తరాంధ్రకి మీరు ద్రోహం చేస్తారా? అని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ నాయకులు ఈ స్థాయిలో ఉన్నారంటే అది ఉత్తారంధ్ర ప్రజల దీవెనలే అన్నారు. ఇసుక అమ్మకాల్లో ఇంకా అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు మధ్య సయోధ్య కుదరలేదని విమర్శలు గుప్పించారు. పార్టీలకతీతంగా ప్రజలు విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోరుకుంటున్నారన్నారు. చంద్రబాబు మాటలు వింటే టీడీపీ నాయకులకు రాజకీయ భవిష్యత్ శూన్యం అవుతుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. -
‘కొందరికి కాళ్లూ..చేతులూ ఆడటం లేదు’
సాక్షి, విశాఖపట్నం: విశాఖ భూ కుంభకోణాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మళ్లీ సిట్ ఏర్పాటు చేయటంతో కొందరికి కాళ్లూ,చేతులూ ఆడటం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..భీమిలిలో సామాన్య ప్రజల ఆస్తులకు ఎసరు పెట్టి.. రికార్డులను తారుమారు చేశారన్నారు. లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు టాంపర్ అయ్యాయని అప్పటి కలెక్టర్ వ్యాఖ్యానించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. భూ కుంభకోణం వలన విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు కూడా భూ కుంభకోణాలు జరిగాయని పదేపదే ఆరోపించేవారన్నారు. ప్రభుత్వం వేసిన సిట్ విచారణకు సహకరించడంతో పాటు, బాధితులందరూ ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. విశాఖ నగర పాలక సంస్థకు చెందిన రూ.150 కోట్ల నిధులను పసుపు-కుంకుమ పథకానికి చంద్రబాబు నాయుడు తరలించారని ఆరోపించారు. దీనిపై కూడా విచారణ జరిపించాలని జగన్నాథం డిమాండ్ చేశారు. -
మహిళతో కలసి స్టెప్పులేసిన డొక్కా జగన్నాథం
-
జగన్నాథం.. ఏంటీ పని?
సాక్షి, పి. గన్నవరం: ప్రపంచ ప్రఖ్యాత దేవస్థానంలో సభ్యుడిగా కొనసాగుతూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాల్సిన ఒక నాయకుడు తన స్థాయిని మరచిపోయారు. స్టేజ్ ఎక్కేసరికి సర్వం మర్చిపోయి ఓ మహిళతో కలసి స్టెప్పులేయడం ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు డొక్కా జగన్నాథం (నాధ్ బాబు) చేసిన ఈ పని చూసి అందరూ ముక్కున వేలు వేసుకున్నారు. పి.గన్నవరంలో ఎంపీపీ సంసాని లక్ష్మీగౌరి పెద్దిరాజు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న ఆయన స్థాయిని మరిచిపోయి స్టెప్పులు వేశారు. వివాహ వేడుకలో ఏర్పాటు చేసిన సినీ ఆర్కెస్ట్రాలో ఓ మహిళతో ఆయన డాన్స్ చేయటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి బోర్డు సభ్యుడిగా ఉంటూ నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి ఈరకంగా ప్రవర్తించడం అందరిని విస్మయానికి గురి చేసింది. పెళ్లిలో ఈయన వేసిన చిందులు కాస్తా సోషల్ మీడియా, వాట్సాప్‌ల్లోనూ హల్ చల్ చేస్తున్నాయి. టీడీపీలో అందరికీ నీతిసూత్రాలు బోధించే జగన్నాథం స్టేజ్ ఎక్కేసరికి సర్వం మరచి స్టెప్పులు వేయటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : మహిళతో కలసి స్టెప్పులేసిన డొక్కా జగన్నాథం -
ఫేస్బుక్లో చాటింగ్ చేస్తూ చీటింగ్
►నగర వ్యాపారికి రూ.4.5 లక్షల టోకరా సాక్షి, సిటీబ్యూరో : ఫేస్బుక్ ద్వారా అందమైన యువతి ఫొటోతో నగరానికి చెందిన వ్యాపారికి ఎర వేసిన సైబర్ నేరగాళ్ళు చాటింగ్‌తో ముగ్గులోకి దింపారు. ఆపై భారీ మొత్తం పంపిస్తున్నానంటూ చెప్పి రూ.4.5 లక్షలకు టోకరా వేశారు. దీనిపై బుధవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన జగన్నాథం అనే వ్యాపారికి ఫేస్బుక్లో ఓ యువతి పరిచయమైంది. ఆకర్షణీయమైన ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టి ఆకర్షించింది. కొంతకాలం చాటింగ్ చేస్తూ వ్యాపారి దగ్గర నమ్మకం సంపాదించుకుంది. నాకున్న ఏకైన మంచి స్నేహితుడవంటూ జగన్నాథాన్ని బుట్టలో వేసుకుంది. తన వద్ద భారీ మొత్తంలో నగదు, నగలు ఉన్నాయని, వాటిలో కొన్ని నీకు బహుమతిగా పంపిస్తున్నానంటూ చెప్పింది. ఇది జరిగిన కొన్నాళ్ళకు ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ అధికారినంటూ ఓ వ్యక్తి నుంచి జగన్నాథానికి ఫోన్ వచ్చింది. విలువైన వస్తువులతో వచ్చిన ఆ పార్శిల్‌కు సంబంధించి కొన్ని పన్నులు చెల్లించాలంటూ చెప్పాడు. మరికొన్ని పత్రాలు సైతం కావాలని, అవి లేని కారణంగా దొడ్డిదారిలో క్లియర్ చేస్తానని నమ్మించాడు. ఇలా కొన్ని బ్యాంకు ఖాతాల్లో రూ.4.5 లక్షలు డిపాజిట్ చేయించుకున్నాడు. ఇంత మొత్తం చెల్లించినా మరికొంత చెల్లించాలంటూ ఫోన్లు వస్తుండటంతో మోసపోయినని తెలుసుకున్న వ్యాపారి సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాడు.