జగన్నాథం.. ఏంటీ పని? | TTD Member Dokka Jagannadham Dance Video | Sakshi
Sakshi News home page

జగన్నాథం.. ఏంటీ పని?

Published Thu, May 16 2019 5:14 PM | Last Updated on Thu, May 16 2019 5:40 PM

TTD Member Dokka Jagannadham Dance Video - Sakshi

నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి ఈరకంగా ప్రవర్తించడం అందరిని విస్మయానికి గురి చేసింది.

సాక్షి, పి. గన్నవరం: ప్రపంచ ప్రఖ్యాత దేవస్థానంలో సభ్యుడిగా కొనసాగుతూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాల్సిన ఒక నాయకుడు తన స్థాయిని మరచిపోయారు. స్టేజ్ ఎక్కేసరికి సర్వం మర్చిపోయి ఓ మహిళతో కలసి స్టెప్పులేయడం ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు డొక్కా జగన్నాథం (నాధ్‌ బాబు) చేసిన ఈ పని చూసి అందరూ ముక్కున వేలు వేసుకున్నారు. పి.గన్నవరంలో ఎంపీపీ సంసాని లక్ష్మీగౌరి పెద్దిరాజు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న ఆయన స్థాయిని మరిచిపోయి స్టెప్పులు వేశారు. వివాహ వేడుకలో ఏర్పాటు చేసిన సినీ ఆర్కెస్ట్రాలో ఓ మహిళతో ఆయన డాన్స్ చేయటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి బోర్డు సభ్యుడిగా ఉంటూ నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి ఈరకంగా ప్రవర్తించడం అందరిని విస్మయానికి గురి చేసింది. పెళ్లిలో ఈయన వేసిన చిందులు కాస్తా సోషల్ మీడియా, వాట్సాప్‌ల్లోనూ హల్ చల్ చేస్తున్నాయి. టీడీపీలో అందరికీ నీతిసూత్రాలు బోధించే జగన్నాథం స్టేజ్ ఎక్కేసరికి సర్వం మరచి స్టెప్పులు వేయటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
మహిళతో కలసి స్టెప్పులేసిన డొక్కా జగన్నాథం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement