సాక్షి, కోనసీమ జిల్లా: టీడీపీ-జనసేన అభ్యర్థి సరిపెళ్ల రాజేష్(మహాసేన రాజేష్) తోకముడిచారు. పి.గన్నవరం ఎన్నికల బరి నుండి తాను తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించారు. పి. గన్నవరం నియోజకవర్గానికి రాజేష్ పేరు ప్రకటించిన నాటి నుంచి నియోజకవర్గ టీడీపీ, జనసేన నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
మహాసేన రాజేష్‌ను బరి నుండి తప్పించాలని డిమాండ్ చేస్తూ అంబాజీపేటలో జరిగిన టీడీపీ సమన్వయ సమావేశంలో జనసేన కార్యకర్తలు రచ్ఛ రచ్చ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై టీడీపీ పార్లమెంటరీ ఇంచార్జ్ హరీష్ మాధుర్ కారును కూడా జనసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. పరిస్థితిని గమనించి తప్పుకుంటున్నట్టు రాజేష్ ప్రకటించారు.
మరోవైపు వివాదాస్పదుడైన మహాసేన రాజేష్‌కు పి.గన్నవరం టికెట్‌ను కేటాయించడాన్ని నిరసిస్తూ బ్రాహ్మణ సంఘ నాయకులు శుక్రవారం విశాఖపట్నంలోని టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. రాజేష్‌కు టికెట్ ఇవ్వడం అంటే బ్రాహ్మణులను టీడీపీ అవమానించినట్లేనని స్పష్టం చేశారు. మహాసేన రాజేష్‌కు టీడీపీ ఇచ్చిన పి.గన్నవరం టికెట్‌ను వెంటనే రద్దు చేయాలని కర్నూలులో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య డిమాండ్ చేసింది.
కాగా, మరో వైపు, రాజేష్‌కు టికెట్ ఇచ్చిన చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ పలు హిందూ సంఘాల హెచ్చరిస్తున్నాయి. హిందూ దేవుళ్లు, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మహాసేన రాజేష్‌పై పలు హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. రాజేష్‌ను తక్షణమే అరెస్టు చేయాలని, రాజకీయాల నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశాయి. రాజేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గోకవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: 'వ్యూహం' సినిమా రివ్యూ
Comments
Please login to add a commentAdd a comment