సాక్షి, విజయవాడ: చంద్రబాబు అంటే వెన్నుపోటు.. వెన్నుపోటు అంటే చంద్రబాబు.. ఎన్నికల సమయంలో బాబు వెన్నుపోటు రాజకీయాలు తారస్థాయికి చేరాయి. తాజాగా టికెట్ విషయంలో మహాసేన రాజేష్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. పి.గన్నవరం టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి వ్యతిరేకత పేరుతో జనసేనకి సీటు కేటాయించారు. పి.గన్నవరం నియోజకవర్గం నుండి పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణకు టికెట్ ఇచ్చారు. విజయవాడలో పి.గన్నవరం సీటును జనసేన పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
మొదట పి.గన్నవరం సీటు టీడీపీకి టికెట్ కేటాయించారు. పి.గన్నవరంలో మహాసేన రాజేష్‌ను చంద్రబాబు ప్రకటించారు. మహాసేన రాజేష్ అభ్యర్దిత్వాన్ని స్ధానిక జనసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. మహాసేన రాజేష్‌ను పి.గన్మవరంలో పర్యటించకుండా జనసేన నేతలు అడ్డుకున్నారు. మహాసేన రాజేష్‌కు టికెట్ ఇవ్వద్దంటూ రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేశాయి. వ్యతిరేకత, ఆందోళనల నేపధ్యంలో పి.గన్నవరం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మహాసేన రాజేష్ ప్రకటన చేశారు.
కొన్ని రోజుల తర్వాత పి.గన్నవరం నుంచే పోటీకి దిగుతానని మహాసేన రాజేష్ మళ్లీ ప్రకటన చేశారు. ఇదే సమయంలో మహాసేన రాజేష్‌కు వెన్నుపోటు పొడిచి పి.గన్నవరం టికెట్ జనసేన పార్టీకి కేటాయించారు చంద్రబాబు. మహాసేన రాజేష్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేయించిన గిడ్డి సత్యనారాయణకే జనసేన నుంచి పి.గన్నవరం టికెట్ పవన్ కల్యాణ్ ఇచ్చారు. సత్యనారాయణకి నియామక పత్రాలు పవన్ కల్యాణ్ అందించారు.
Comments
Please login to add a commentAdd a comment