వందలోపు చదరపు గజాలు ఉన్న ఇళ్ల స్థలాలు అన్నింటినీ ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.
విశాఖపట్టణం: వందలోపు చదరపు గజాలు ఉన్న ఇళ్ల స్థలాలు అన్నింటినీ ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఈనెల 15న ఆ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారని అన్నారు.
అదే విధంగా విశాఖపట్టణంలో అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ల కోసం వెయ్యి ఎకరాల స్థలాన్ని గుర్తిస్తున్నామన్నారు. అంతే కాకుండా విశాఖను టూరిజం హబ్గా తయారు చేస్తామని చెప్పారు. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామని మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా తెలియజేశారు.