tourism hub
-
పర్యాటక హబ్‌గా రాయలసీమ
తిరుపతి అర్బన్(చిత్తూరు జిల్లా): రాయలసీమను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. చిత్తూరు జిల్లా తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో హెలి టూరిజాన్ని వర్చువల్ పద్ధతిలో ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతితో పాటు అవసరమైన ప్రధాన కేంద్రాల్లో స్టార్ హోటళ్లను నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి ఆలయాల సందర్శనకు వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామన్నారు. అవసరాన్ని బట్టి రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలున్న పట్టణాలకూ ఇదే పద్ధతిని అవలంభిస్తామని చెప్పారు. కరోనా కారణంగా తగ్గిన ఆదాయం.. ప్రస్తుతం పెరుగుతోందన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి నగరానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారని, తిరుపతితో పాటు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని అన్ని ఆలయాలనూ పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రత్యేకంగా 20కి పైగా టూరిజం బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. రాయలసీమ జిల్లాల్లోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలను హబ్‌గా మార్చి, మెరుగైన వసతులు కల్పించి.. పర్యాటకులను ఆకర్షించేలా పలు సంస్కరణలు చేపట్టనున్నట్టు మంత్రి అవంతి వెల్లడించారు. -
పర్యాటక హబ్‌గా ఏపీ: మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్ సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు. గ్రామీణ సంస్కృతి, కళలు ఉట్టి పడుతూ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. శుభ పరిణామం: యార్లగడ్డ అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో విశాఖ సినీ ప్రపంచ అభివృద్ధికి బీజం పడిందన్నారు. సీఎం వైఎస్ జగన్ సినీ రంగాన్ని విశాఖ నగరానికి ఆహ్వానించడం శుభ పరిణామం అని లక్ష్మీ ప్రసాద్ అన్నారు. -
పురాతన చరిత్రకు తూట్లు
పెద్దాపురం: ఎంతో పురాతన చరిత్ర కలిగిన పాండవుల మెట్ట క్రమేపీ ప్రాభవం కోల్పోతోంది. మెట్టను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తామంటూ అమాత్యులు ఇచ్చే హామీలు నీటి మూటలుగా మిగులుతున్నాయి. మెట్టపై నిర్మించిన సూర్యనారాయణస్వామివారి దేవాలయానికి ఆదివారం వందలాది మంది, నిత్యం సుమారు వంద మంది వరకూ భక్తులు వెళ్తుంటారు. 1960లో మెట్ట విస్తీర్ణం సుమారు 72 ఎకరాలుంటే ప్రస్తుతం అది కేవలం రెండెకరాలకే పరిమితమైంది. మిగిలిన 70 ఎకరాలను ప్రభుత్వమే వివిధ కార్యాలయాలకు కేటాయించింది. పాలకులు మారుతున్నారు గానీ పాండవుల మెట్ట అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. పాండవులు వనవాసం సమయంలో ఈ మెట్టపై నివాసమున్నారని, వారు స్నానం చేసేందుకు అతిపెద్ద గుహ మార్గం ద్వారా గోదావరి నదికి వెళ్లేవారని చరిత్ర చెబుతోంది. ఈ మెట్టపై భీముని పాదాలు, సీతమ్మ వారు పవ ళించిన చాప ఇప్పటికీ మెట్టపై ఆనవాళ్లుగా దర్శనమిస్తున్నాయి. ఎంతో చరిత్ర ప్రసిద్ధి ఉన్న ఈ మెట్ట అభివృద్ధిపై పర్యాటక శాఖ దృష్టి సారించడం లేదు. ఆక్రమణల చెరలో... పెద్దాపురం పట్టణంలో ఎక్కడా ఖాళీ లేనట్టు ప్రభుత్వం ఈ మెట్టపైనే పలు కార్యాలయాలు నిర్మించింది. నవోదయ పాఠశాల, గృహ నిర్మాణ, వ్యవసాయ, మార్కెటింగ్, అగ్నిమాపక తదితర శాఖల భవనాలు నిర్మించారు. వాటి కోసం సుమారు 70 ఎకరాలు కేటాయించారు. ఈ నాలుగేళ్లలో పార్కు, స్టేడియం నిర్మాణమంటూ మెట్టను మరి కాస్త తొలగించారు. పాండవుల మెట్టను పర్యాటక శాఖ ద్వారా అభివృద్ధి చేస్తామంటూ సూర్యనారాయణస్వామి ఆలయానికి కాస్త దూరంలో శతాబ్ది పార్కును ఏర్పాటు చేశారు. సీసీ రోడ్డుతో సరి ఇటీవల కొండపైకి వెళ్లేందుకు సుమారు రూ.40 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినా దాని నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో లైట్లు అరకొరగా వెలుగుతున్నాయి. రక్షణ గోడల నిర్మాణం హామీ గాల్లో కలిసిపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాండవుల మెట్టను పర్యాటక ప్రదేశంగా తీర్చిద్దాలని పలువురు కోరుతున్నారు. కనుమరుగవనున్న ఆర్డీఓ కార్యాలయం దాదాపు 111 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన కట్టడంగా పిలిచే ఆర్డీఓ కార్యాలయం కనుమరుగు కానుంది. ప్రజా సంఘాల నుంచి ఆర్డీఓ కార్యాలయ భవనాన్ని కూల్చవద్దంటూ వినతులు, ఆందోళనలు చేసినా పట్టించుకోకుండా ఆ పురాతన భవనాన్ని తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. 1907లో నిర్మించిన ఈ భవనం జిల్లాలోనే తొలి సమితిగా సేవలందించింది. 1927లో రెవెన్యూ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఆర్డీవో కార్యాలయంగా 12 మండలాల ప్రజలకు సేవలందిస్తోంది. ఇటీవల నిధులు విడుదల చేసి నూతన భవనం నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ భవన కూల్చివేత నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ భవనం పక్కనే ఉన్న స్థలంలో కొత్త భవనాన్ని నిర్మించాలని చెబుతున్నప్పటికీ పట్టణ ప్రథమ పౌరుడు పట్టుదలకు పోయి ఈ భవనం కూల్చివేతకు రంగం సిద్ధం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా సంఘాల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు భవన కూల్చివేతను ఆపి పక్క స్థలంలో భవనం నిర్మిస్తారా లేదా అనేది వేచి చూడాలి. చారిత్రక జ్ఞాపకం పర్యాటక ప్రాంతంగా చెప్పుకునే పాండవుల మెట్టకు ఎంతో చారిత్రక విశిష్టత ఉంది. ఇక్కడ ఉన్న ఆర్డీఓ కార్యాలయ భవనానికి పురాతన చరిత్ర ఉంది. ఈ భవనాన్ని కూల్చివేసేందుకు నిర్ణయించడం తగదు. దీన్ని చారిత్రక జ్ఞాపకంగా పదిలపర్చాలి. ఈ భవనం కూల్చివేత నిర్ణయాన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ భవనాన్ని కూల్చకూడదు. మెట్ట అభివృద్ధికి పర్యాటక, పురావస్తుశాఖలు కృషి చేయాలి. – కూనిరెడ్డి అరుణ, కౌన్సిలర్, పెద్దాపురం -
పర్యాటక హబ్‌గా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానితోపాటు పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్టు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇందుకోసమే తాను తరచూ విశాఖ వస్తున్నానని చెప్పారు. మంగళవారం ఆయన విశాఖలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన రూ.50 లక్షలతో నిర్మించిన వీవీఐపీ లాంజ్‌ను ప్రారంభించారు. దీంట్లో సీఎం చాంబర్, యాంటీరూం, ప్యాంట్రీ, తదితర రూములుంటాయని, ప్రముఖులు విమానాశ్రయంలో కొద్దిసేపు విరామం తీసుకునేందుకు, అత్యవసర సమావేశాలు, సమీక్షలు నిర్వహించుకునేందుకు వీలుంటుందని తెలిపారు. అనంతరం ఎన్ఏడీ జంక్షన్లో రూ.113.60 కోట్లతో నిర్మించనున్న రెండంతస్తుల ఫ్లైఓవర్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ దేశంలోనే ఇలాంటి ఫ్లైఓవర్ నిర్మించడం ఇదే తొలిసారన్నారు. 24 నెలల్లో దీనిని నిర్మించాల్సి ఉన్నప్పటికీ అంతకంటే ముందుగానే పూర్తి చేయాలని నిర్మాణ సంస్థను ఆదేశించామని చెప్పారు. అక్కడినుంచి బీచ్‌రోడ్డులో కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం ఎదురుగా రూ.10 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న టీయూ 142 ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ఈ మ్యూజియాన్ని డిసెంబర్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభిస్తారని చెప్పారు. విదేశీ పర్యటనకు సీఎం: సీఎం చంద్రబాబు మూడు దేశాల పర్యటనకోసం మంగళవారం బయల్దేరి వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం విశాఖ నుంచి నాగపూర్ వెళ్లారు. రాత్రి అక్కడ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ భేటీ ముగిసిన అనంతరం ఢిల్లీకి వెళ్లిన సీఎం అక్కడి నుంచి అమెరికాకు పయనమయ్యారు. ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు ఆయన అమెరికా, దుబాయ్, లండన్లలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలువురు రాజకీయ, వ్యాపార, వాణిజ్య ప్రముఖులతో ద్వైపాక్షిక సమావేశాలు, ముఖాముఖీ సమావేశాలు, బహుముఖ చర్చలతోపాటు వివి«ద కార్యక్రమాల్లో పాల్గొంటారు. -
టూరిజంలో గో’దారేది’ ?
-
టూరిజం హబ్‌గా మార్చుతా: సీఎం
ఎయిర్ షోను ప్రారంభించిన చంద్రబాబు వచ్చే నెలలో నేవల్ షో నిర్వహిస్తున్నట్టు వెల్లడి సాక్షి, విజయవాడ: అమరావతిని టూరిజం హబ్‌గా మార్చుతానని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రస్తుతం రూ.2.30 కోట్లతో ఎయిర్‌షో నిర్వహిస్తున్నామని, వచ్చే నెల 2, 3, 4 తేదీల్లో నేవల్ షో నిర్వహిస్తామని చెప్పారు. విజయవాడ కృష్ణానదీ తీరంలోని పున్నమి ఘాట్ వద్ద మూడు రోజులపాటు జరిగే విమాన విన్యాసాల(ఎయిర్ షో)ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత సాధించే ధ్యేయంతో పవిత్ర సంగమం వద్ద ఉమెన్ పార్లమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి శనివారం ఇక్కడ ఒక కార్యక్రమం జరిగేలా చూస్తామని చెప్పారు. మన ప్రాంతం వారేగాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రజలు ఇక్కడికొచ్చి కార్యక్రమాల్లో పాల్గొని ఆనందిస్తారని పేర్కొన్నారు. విజయవాడ, అమరావతి, మంగళగిరి, గుంటూరు ప్రాంతాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. గన్నవరంలో చక్కటి ట్రాన్సిట్ టెర్మినల్‌ను పౌరవిమానశాఖ నిర్మించిందని, రాబోయే రోజుల్లో మరో ట్రాన్సిట్ టెర్మినల్ నిర్మాణం జరుగుతుందని వివరించారు. రన్‌వేను అభివృద్ధి చేసి అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా పౌరవిమానయాన శాఖ ఆధ్వర్యంలో జరిగిన విమానాల విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. కృష్ణానదిని, ఆకాశాన్ని తాకుతూ సాగిన విన్యాసాలను చూసి అబ్బురపడ్డారు. -
టూరిజం హబ్‌గా కోటప్పకొండ
సభాపతి కోడెల వెల్లడి నరసరావుపేట రూరల్: ఎకో టూరిజం, టెంపుల్ టూరిజంను కోటప్పకొండలో ఆభివృద్ధి చేయనున్నట్లు సభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. అటవీశాఖ ఉన్నతాధికారులతో కలసి మంగళవారం ఆయన కోటప్పకొండను సందర్మించారు. సీసీఎఫ్ ప్రిన్సిపల్ రమేష్ కల్గాడి, వైల్డ్ లైఫ్ సీసీఎఫ్ రమణారెడ్డి, అడిషనల్ పీసీసీఎఫ్‌లు బిపిన్ చౌదరి, సీకే మిశ్రా, కౌశిక్‌లు సభాపతితో కలసి కోటప్పకొండ ఘూట్రోడ్డులోని పర్యాటక కేంద్రాన్ని పరిశీలించారు. ఘాట్ రోడ్డులోని బ్రహ్మ విగ్రహం ముందు భాగాన్ని అభివృద్ధి చేయాలని కోడెల సూచించారు. పర్యావరణ కేంద్రం ఎదురుగా ఉన్న క్యాంటీన్‌ను యోగా సెంటర్‌గా మార్చాలన్నారు. కాళింది బోటు షికారులో నూతన బోట్లు అందుబాటులో ఉంచాలన్నారు. పర్యావరణ కేంద్రాన్ని ఎవరు నిర్వహించాలి, టికెట్ ఎలా విక్రయించాలి తదితర అంశాలపై నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిధులు కొరత లేదని, దాతల సహకారం తీసుకుంటామని చెప్పారు. రూ.4.5 కోట్లతో అభివృద్ధి పనులు... శివరాత్రి నాటికి రూ.4.5 కోట్లతో కోటప్పకొండ అభివృద్ధి చేయనున్నట్లు సభాపతి కోడెల తెలిపారు. రూ.కోటి వ్యయంతో పర్యావరణం పర్యాటక కేంద్రం, రూ.3.5 కోట్లతో ఆలయ అభివృద్ధి చేపడతామన్నారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ డీఎఫ్‌వో బ్రహ్మయ్య, డీఎఫ్‌వో మోహనరావు, డీసీఎఫ్ వై రమేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కడియాల రమేష్, బెల్లంకొండ పిచ్చయ్య, ఆలయ కమిటీ సభ్యులు అనుమోలు వెంకయ్య చౌదరి, ఈవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
'టూరిజం హబ్ గా విశాఖ'
విశాఖపట్టణం: వందలోపు చదరపు గజాలు ఉన్న ఇళ్ల స్థలాలు అన్నింటినీ ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఈనెల 15న ఆ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారని అన్నారు. అదే విధంగా విశాఖపట్టణంలో అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ల కోసం వెయ్యి ఎకరాల స్థలాన్ని గుర్తిస్తున్నామన్నారు. అంతే కాకుండా విశాఖను టూరిజం హబ్‌గా తయారు చేస్తామని చెప్పారు. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామని మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా తెలియజేశారు. -
టూరిజం హబ్‌గా ఢిల్లీ: సీఎం
న్యూఢిల్లీ : అంతర్జాతీయ నగరాల మాదిరిగానే ఢిల్లీని కూడా టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. జనక్‌పురిలోని దిల్లీ హాట్లో శుక్రవారం ఏర్పాటుచేసిన వార్షిక మామిడిపండ్ల ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా అనేక ఉత్సవాలు జరుపుకుంటుంటామని, వాటిని తిలకించేందుకు అనేకమంది వస్తుంటారని, ఇది పర్యాటక రంగ వికాసానికి దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి మనీష్‌సిసోడియా, న్యాయశాఖ మంత్రి కపిల్ మిశ్రా హాజరైనప్పటికీ ప్రారంభానికి ముందు ధూళి తుపాను రావడంతో వారు కుప్పకూలిపోయారు. దీంతో వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించలేకపోయారు. కాగా సందర్శకుల కోసం నిర్వాహకులు లంగ్రా, చౌసా, రతౌల్, రాంకేలా, కేసర్, మల్లిక, ఆమ్రాపాలి తదితర రకాల మామిడి పండ్లను అందుబాటులో ఉంచారు. -
భూమాయలో పడొద్దు
- కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త - అనుమతులు లేని లేఔట్లతో అప్రమత్తం తిరుపతి తుడా: అదిగో మెడికల్ హబ్.. ఇక్కడ ఐఐటీ.. పక్కనే పాకశాస్త్ర కళాశాల.. దగ్గర్లో హైకోర్టు బెంచ్.. టూరిజం హబ్.. అంటూ హోరెత్తుతున్న ప్రచారాలతో తిరుపతి పరిసర ప్రాంతాల్లో గడిచిన రెండు నెలలు గా స్థిరాస్తి క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. భూముల ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఆకాశాన్నం టుతున్నాయి. ఈ నేపథ్యంలో భూములు, భవనాలు కొనుగోలు చేసేటప్పుడు రికార్డులన్నీ సక్రమంగా సరిచూసుకోకపోతే మోసగాళ్ల ఉచ్చులో పడ్డట్టే. మాయమాటలతో ముంచేసేందుకు బ్రోకర్లు సిద్ధంగా ఉన్నారు. కొనుగోలుదారుల ఆరాటాన్ని.. అమాయకత్వాన్ని పెట్టుబడిగా పెట్టి టోకరా వేసేవాళ్లు చాలామంది ఉన్నారు. ఖాళీ స్థలం.. భవనం.. అపార్ట్మెంట్లోని ఫ్లాట్.. ఏదైనా సరే కొనుగోలు చేసేవారికి తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ బాలాజీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యాంకుమార్ సూచనలు ఇవీ.. భూమి ఎక్కడుందో చూసుకోకుండా కొనుగోలు చేయకూడదు. ప్రతి భూమికి సంబంధించి ఈసీ (ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్), లింక్ డాక్యుమెంట్లు సరిచూసుకోవాలి. ఈసీ తీసుకున్నప్పుడు నేరుగా పరిశీలించుకోవాలి. మధ్యవర్తులు తెచ్చి చూపించే ఈసీలను నమ్మకూడదు.భూమి యాజమాన్య హక్కులు చూసుకోవాలి. అది పట్టానా? ప్రయివేటుదా..? ప్రభుత్వానిదా..? ఆ భూమి ఉన్నట్లు తెలిపిన సర్వే నంబరు క్షేత్రస్థాయిలో ఉందా.. లేదా...? తెలుసుకోవాలి. ఇరుగు పొరుగు సర్వే నంబర్లను రికార్డులో చేర్చి ఫలానా సర్వే నంబరు అదేనంటూ బుకాయించే ప్రమాదం కూడా ఉంది. కాగితాల్లో సర్వే నంబరు చూసి నమ్మడం కంటే సంబంధిత సర్వే నంబరును ప్రభుత్వ సర్వేయర్ ద్వారా నిర్ధారించుకోవాలి. ఆక్రమించిన భూములేమో నిర్ధారించుకోవాలి. నిషేధిత భూముల జాబితా(ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్- బదిలీ నిషేధిత భూమి)లో ఉందేమో పరిశీలించుకోవాలి. ఈ వివరాలు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల వద్ద ఉంటాయి. ఆర్ఎస్ఆర్ (రీ సర్వే రిజిస్టర్)లో ఏ కేటగిరి భూమో తెలుస్తుంది. ప్రభుత్వానిదైతే అసైన్డ్ భూములు, వాగులు, వంకలు, చెరువులు, శ్మశానాలు, వక్ఫ్, క్రిస్టియన్ మైనారిటీ, నీటి పారుదల శాఖలకు చెందినవేమో చూసుకోవాలి.భూమి సర్వే నంబరు ప్రకారం అడంగల్ చూసుకోవాలి. పట్టాదారు పాస్ పుస్తకంలో నమోదైందో లేదో చూడాలి. ఏ గ్రామానికి సంబంధించిన భూమి. క్రయ విక్రయాల వివరాలు మీ సేవలో పొందవచ్చు. ఇంటి స్థలం అయితే దస్తావేజులను పరిశీలించుకోవాలి. స్థలం అసైన్మెంటు (ఇంటి నంబరు, ఇరుగుపొరుగు ఇళ్ల వివరాలు) చూడాలి. పట్టణాలు, మున్సిపల్ ప్రాంతాల్లో ప్రణాళికా విభాగాల్లో దస్తావేజులు సరైనవో కాదో నిర్ధారించుకోవాలి. గ్రామ పరిధిలో నివేశన స్థలాలైతే గ్రామ కంఠంలో ఉందా? ప్రభుత్వ గ్రామ కంఠంలో ఉందా?ప్రైవేటు కంఠమా? చూసుకోవాలి. ఏ స్థలం రికార్డులైనా తారుమారు చేయడానికి, నకిలీలు రూపొందించడానికి అవకాశం ఉంది. పోటీకి వస్తారని కొందరు రహస్యంగా కొనుగోలు చేయడం పరిపాటిగా జరుగుతోంది. ఆయా భూముల ఇరుగుపొరుగు వారిని సంప్రదిస్తే వాస్తవాలు తెలుస్తాయి. నగరపాలక సంస్థలు, పురపాలక పరిధిలో మాస్టర్ ప్లాన్‌లో ఉందా.. లేదా..? చూసుకోవాలి.తుడా పరిధిలో ప్లాట్లు అనుమతి పొందిన లేఔట్లా.. కాదా..? చూసుకోవాలి. తనఖా పెట్టిన ఆస్తిని కూడా విక్రయించే ప్రయత్నాలు జరుగుతుంటాయి. సంబంధిత ప్లాటుపై తీసుకున్న రుణం చెల్లించారా లేదా తెలుసుకోవాలి.అపార్టుమెంట్ అయితే అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం జరిగిందా లేదో చేసుకోవాలి.సామాజిక అవసరాల (పార్కులు, ఆట స్థలాలు, రోడ్లు, పారిశ్రామిక అవసరాలు)కు సంబంధించిన భూములను విక్రయించే ప్రయత్నాలు జరుగుతుం టాయి. వాటిని కనిపెట్టాలి. -
సంక్షేమం, సాగునీరు, బ్రాండ్ హైదరాబాద్
ఇవే టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రాధాన్యతలు! - హైదరాబాద్-వరంగల్ మార్గంలో ప్రత్యేక కారిడార్ - ఫార్మా, పౌల్ట్రీ, టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ర్టంలో సంక్షేమం, సాగునీరు, బ్రాండ్ హైదరాబాద్ అంశాలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. రాష్ట్ర జనాభాలో 85 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలే ఉన్నందున వారి కోసం సంక్షేమ శాఖలను తన వద్దే పెట్టుకున్నట్లు కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం అసెంబ్లీ లాబీలో కేసీఆర్ సన్నిహిత మంత్రి ఒకరు మీడియాతో ఇష్టాగోష్టిగా ముచ్చటిస్తూ ముఖ్యమంత్రి విజన్‌ను వివరించారు. ‘ఉద్యమాలు ముగిశాయి. ఇక కేసీఆర్ తన దృష్టిని పూర్తిగా తెలంగాణ అభివృద్ధిపైనే కేంద్రీకరించారు. చంద్రబాబు మాదిరిగా ప్రచారం పొందాలని చూడటం లేదు. సాగునీరు, సంక్షేమం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు’ అని ఆయన చెప్పారు. ‘తమిళనాడు తరహాలో పేదలకు పెద్ద ఎత్తున సంక్షేమ ఫలాలను అందించాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాబోయే ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తానంటున్నారు. 125 గజాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు’ అని పేర్కొన్నారు. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఏఐబీపీ నిధులను తెచ్చుకుని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. తెలంగాణలో చెరువులు, కుంటలను పునరుద్ధరించేందుకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్-వరంగల్ హైవేలో ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేసి ఫార్మా, టూరిజం, పౌల్ట్రీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ రహదారి పొడవునా 36 ఫార్మా కళాశాలలు, వందలాది పౌల్ట్రీ ఫారాలతోపాటు ప్రస్తుతమున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సదరు మంత్రి వెల్లడించారు.