
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్ సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు. గ్రామీణ సంస్కృతి, కళలు ఉట్టి పడుతూ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు.
శుభ పరిణామం: యార్లగడ్డ
అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో విశాఖ సినీ ప్రపంచ అభివృద్ధికి బీజం పడిందన్నారు. సీఎం వైఎస్ జగన్ సినీ రంగాన్ని విశాఖ నగరానికి ఆహ్వానించడం శుభ పరిణామం అని లక్ష్మీ ప్రసాద్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment