
టూరిజం హబ్‌గా ఢిల్లీ: సీఎం
న్యూఢిల్లీ : అంతర్జాతీయ నగరాల మాదిరిగానే ఢిల్లీని కూడా టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. జనక్‌పురిలోని దిల్లీ హాట్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన వార్షిక మామిడిపండ్ల ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా అనేక ఉత్సవాలు జరుపుకుంటుంటామని, వాటిని తిలకించేందుకు అనేకమంది వస్తుంటారని, ఇది పర్యాటక రంగ వికాసానికి దోహదం చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి మనీష్‌సిసోడియా, న్యాయశాఖ మంత్రి కపిల్ మిశ్రా హాజరైనప్పటికీ ప్రారంభానికి ముందు ధూళి తుపాను రావడంతో వారు కుప్పకూలిపోయారు. దీంతో వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించలేకపోయారు. కాగా సందర్శకుల కోసం నిర్వాహకులు లంగ్రా, చౌసా, రతౌల్, రాంకేలా, కేసర్, మల్లిక, ఆమ్రాపాలి తదితర రకాల మామిడి పండ్లను అందుబాటులో ఉంచారు.