santhi nagar
-
ఇసుక డంప్ సీజ్.. ఇద్దరిపై కేసు నమోదు
శాంతినగర్(మహబూబ్ నగర్) : మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా నిల్వ చేసిన వడ్డేపల్లికి చెందిన ఇద్దరిపై శుక్రవారం కేసు నమోదుచేసినట్లు శాంతినగర్ ఎస్సై సత్యనారాయణ తెలిపారు. వడ్డేపల్లి గ్రామానికి చెందిన మహిపాల్‌రెడ్డి, మాదన్నలు గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన రెండు డంపులు (60 ట్రాక్టర్ల ఇసుకను) గుర్తించామన్నారు. అనంతరం డంపులను సీజ్‌చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించి వారిద్దరిపై కేసునమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
భార్యను చంపిన భర్తకు ఏడేళ్ల జైలు
అలంపూర్ (మహబూబ్‌నగర్) : ఏడడుగులు నడిచి జీవితాంతం భార్యను కంటికి రెప్పలా చూసుకుంటానని ప్రమాణం చేసిన భర్తే తన భార్యను కిరోసిన్ పోసి నిప్పంటించి చంపిన కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా మండల పరిధిలోని రామాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వడ్డేపల్లి మండల పరిధిలోని రామాపురం గ్రామానికి చెందిన సువార్తమ్మను భర్త చిన్నతిమ్ములు 2013 ఫిబ్రవరి 15న కిరోసిన్ పోసి నిప్పంటించాడని శాంతినగర్ పోలీస్ స్టేషన్లో అప్పట్లో కేసు నమోదైంది. కాగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయ్‌కుమార్ వాదించగా రెండేళ్లుగా జరిగిన విచారణలో నేరం రుజువైనందున గద్వాల కోర్టు జడ్డి శ్రీనివాసరెడ్డి గురువారం హరిజన్ చిన్నతిమ్ములుకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించినట్లు శాంతినగర్ ఏఎస్సై మీడియాకు వివరించారు. -
నాలుగేళ్ల బాలికపై అత్యాచారం ఆపై హత్య
వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరు మండలం శాంతినగర్‌లో గురువారం దారుణం చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలికపై పొట్టి చాంద్‌బాషా అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను హత్య చేశాడు. బాలిక తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు చాంద్‌బాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.