చెరువులో పడి యువకుడి మృతి
Published Mon, Sep 26 2016 12:15 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
కాజీపేట:వడ్డెపల్లి రిజర్వాయర్‌లో ఓ యువకుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. మృతుని తల్లి పాలడుగుల లక్ష్మి కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాధు చేసిన మేరకు వివరాలిలా ఉన్నాయి. సోమిడికి చెందిన పి.రాజేందర్ (28) శుక్రవారం బట్టలు ఉతుక్కునేందుకు రిజర్వాయర్‌లోకి వెళ్లాడు. ఈ క్రమంలో కాలుజారి రిజర్వాయర్‌లో పడ్డాడు. తమ కుమారుడికి ఈత రాక నీటమునిగి మరణించినట్లు లక్ష్మి ఫిర్యాధుచేసింది. కాజీపేట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు పంపించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement