
సాక్షి, నాగర్‌కర్నూల్ : మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారిని శిక్షించేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలు చేసింది. అయిన దేశంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతునే ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో గత రాత్రి దారుణం చోటుచేసుకుంది. వివరాలివి.. జిల్లాలోని కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గత రాత్రి నలుగురు యువకులు వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు 100 నంబర్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులపై కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్‌పీ సన్ ప్రీత్ సింగ్ అత్యాచారం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్‌పీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విధమైన ఘటనలు చోటు చేసుకోవడం భాధాకరమని అన్నారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment