భర్తకు అనారోగ్యం.. మరో యువకుడితో పరిచయం.. | Man Molested On Woman In Warangal | Sakshi
Sakshi News home page

యువకుడితో పరిచయం.. పెళ్లి చేసుకోవాలని వేధింపులు

Published Tue, Jan 4 2022 11:05 AM | Last Updated on Tue, Jan 4 2022 11:32 AM

Man Molested On Woman In Warangal - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌(వరంగల్‌): వివాహితను వేధించిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని టౌన్‌ ఎస్‌హెచ్‌ఓ జూపల్లి వెంకటరత్నం సోమవారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ వీధిలో నివాసం ఉండే ఓ మహిళ భర్త అనారోగ్యానికి గురయ్యాడు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, కొంత కాలం క్రితం మానుకోట మండలంలోని మాధవాపురం గ్రామానికి చెందిన తొడుసు రాకేష్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.

దీంతో సదరు వివాహితతో తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడు వేధిస్తున్నాడు. వేధింపులు భరించలేక ఆమె టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement