హన్మకొండలో దారుణం.. వివాహితను బలవంతంగా ఆటోలో ఎక్కించి.. | Molestation On Woman At Hanamkonda | Sakshi
Sakshi News home page

హన్మకొండలో దారుణం.. వివాహితను బలవంతంగా ఆటోలో ఎక్కించి..

Apr 29 2023 8:57 PM | Updated on Apr 29 2023 9:21 PM

Molestation On Woman At Hanamkonda - Sakshi

సాక్షి, వరంగల్‌: మహిళల రక్షణకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కామాంధుల్లో కనీస మార్పు రావడం లేదు. రోజురోజుకీ మృగాలు రెచ్చిపోతుండటంతో ఆడవాళ్లు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మహిళలపై లైంగిక వేధింపులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.  తాజాగా హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహితపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

నయీమ్‌నగర్‌కు చెందిన వివాహిత ఇంట్లో గొడవపడి రోడ్డు మీదకు రాగా.. ముగ్గురు వ్యక్తులు ఆమెను ట్రాప్‌ చేశారు. బలవంతంగా ఆటోలో ఎక్కించి భీమారం వైపు తీసుకెళ్లి మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. కాగా మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై బాధితురాలు శనివారం హన్మకొండ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాకేశ్‌ అనే ఆటోడ్రైవర్‌తోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
చదవండి: మౌనిక మృతి.. ‘బయటకెళ్తే ఇంటికొస్తారనే నమ్మకం లేదు’
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement