Viral Video: Bihar Senior Official Suspended After Forcing A Woman For Body Massage - Sakshi
Sakshi News home page

వీడియో: ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. షర్ట్‌ విప్పేసి మసాజ్‌ చేయించుకున్నాడు

Apr 29 2022 9:47 AM | Updated on Apr 29 2022 11:41 AM

Bihar Senior Official Suspended After Massage Video Viral - Sakshi

కష్టం వచ్చింది ఆదుకోండి సారు అని పోలీసుల దగ్గరికి వెళ్తే.. చొక్కా విప్పి మసాజ్‌ చేయించుకున్నాడు ఆ అధికారి. 

అధికార మదం.. మరో అధికారిని వార్తల్లోకి ఎక్కించింది. విధి నిర్వహణలో ఉండగానే మసాజ్‌ దుకాణం తెరిచిన ఓ పోలీస్‌ అధికారి వీడియో ఒకటి వాట్సాప్‌ గ్రూపుల్లో, స్టేటస్‌ల్లో విపరీతంగా వైరల్‌ అయ్యింది. ఇంకేం ఆయనగారిపై చర్యలు తీసుకున్నారు అధికారులు. 

బీహార్‌ సహస్రా జిల్లా నౌహట్టా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దాహర్‌ అవుట్‌పోస్ట్‌లో విధులు నిర్వహించే సీనియర్‌ అధికారి శశిభూషణ్‌ సిన్హా.. మసాజ్‌ వీడియోతో అడ్డంగా బుక్కయ్యాడు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళను అవుట్‌పోస్ట్‌లోని రెసిడెన్షియల్‌ క్వార్టర్స్‌కు పిలిపించుకున్నాడాయన. ఆపై ఆమెతో బలవంతంగా  మసాజ్‌ చేయించుకున్నట్లు తెలుస్తోంది.

షర్ట్‌ను అక్కడే వేలాడదీసి.. ఆపై ఆమెతో ఒళ్లు రుద్దించుకున్నాడు. ఆ టైంలో ఆయన సీరియస్‌గా ఫోన్‌ మాట్లాడుతుండగా.. ఎవరో ఆయన్ని వీడియో తీశారు.  ఆ టైంలో అక్కడ మరో మహిళ కూడా ఉంది. ఈ వీడియో వైరల్‌ కావడంతో విమర్శలు వెల్లువెత్తగా..  ఆయనపై వేటు పడినట్లు సమాచారం. అయితే బీహార్‌ పోలీస్‌ శాఖ వీడియోపై, ఘటనపై, చర్యలపై అధికారికంగా మాత్రం స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement