సాక్షి, ముంబై : కరోనా వైరస్ మహమ్మారి మహారాష్ట్రను వణికిస్తోంది. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ లోమరో సీనియర్ అధికారి కరోనాకు బలయ్యారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ (బాంద్రా ఈస్ట్) అశోక్ ఖైర్నర్ (57) కరోనాతో ప్రాణాలు విడిచారు. నగరంలో కరోనాకు జరుగుతున్న పోరులో కీలక భూమికను పోషిస్తున్న ఆయన చివరకు వైరస్‌తో చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇటీవల అనారోగ్యం పాలైన అశోక్‌ను కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో మొదట ఆయనను బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. శనివారం మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచారు.
కాగా కోవిడ్-19 వ్యతిరేక యుద్ధంలో ఇప్పటికే 103 పౌర కార్మికులు చనిపోగా, 2 వేల మందికి పైగా వైరస్ సోకింది. ఇటీవల డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ శిరీష్ దీక్షిత్ (55) కరోనా కారణంగానే మరణించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,46,600 కు పెరిగింది
Comments
Please login to add a commentAdd a comment