
సాక్షి, న్యూఢిల్లీ : భారత పార్లమెంటును మరోసారి కరోనా వైరస్ ప్రకంపనలు ఆందోళన రేపాయి. రాజ్యసభ సచివాలయ అధికారి ఒకరికి నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్ -19 పాజిటివ్ వచ్చింది. దీంతో పార్లమెంటు భవనంలోని రెండు అంతస్తులకు సీల్ వేసినట్టు అధికారులు వెల్లడించారు. అధికారి భార్య, పిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడ్డారని వారు తెలిపారు. శానిటైజేషన్ ప్రక్రియ కొనసాగుతోందనీ, మిగిలిన ఉద్యోగులకు కూడా కరోనా పరీక్షలు చేయించి హోంక్వారంటైన్ చేయనున్నామని చెప్పారు. అలాగే సంబంధిత అధికారితో సన్నిహితంగా మెలిగిన వారు కూడా ఆరోగ్య అధికారులను సంప్రదించాల్సిందిగా కోరినట్టు అధికారులు చెప్పారు.
గతవారం పార్లమెంటుకు చెందిన ఒక సీనియర్ అధికారి కరోనా వైరస్ బారిన పడ్డారు. కాగా కరోనా ఉధృతి, హౌస్ కీపింగ్ ఉద్యోగికి వైరస్ సోకడంతో మార్చి 23న బడ్జెట్ సమావేశాలను అర్ధాంతరంగా వాయిదా వేశారు. అయితే 2వ దశ లాక్ డౌన్ ముగిసిన అనతరం మూడవ వంతు సిబ్బందితో పార్లమెంట్ లో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment