సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామ మండలం ఐతవరం వద్ద 65వ జాతీయ రహదారిపై వరద నీరు భారీగా చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్, విజయవాడ హైవేలో వచ్చేవారు తప్పనిసరిగా వరద ఉధృతిని గమనించి ప్రయాణించాలని అధికారులు సూచించారు.
తెలంగాణ -ఏపీ సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరింది. దీంతో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమ కాలువకు భారీ గండి పడింది. దాదాపు యాభై మీటర్ల మేర గండి పడటంతో వేల క్యూసెక్కుల నీరు వృధాగా పోతోంది. పంటల పొలాలు మునిగిపోయాయి. గండి పడ్డా కూడా ఘటనా స్థలానికి ఇరిగేషన్ అధికారులు రాలేదు. పలుచోట్ల సాగర్ ఎడమ లైనింగ్ దెబ్బతింది.
గతంలోనే లైనింగ్, సాగర్ ఆధునికీకరణ కోసం వేల కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది. కాంట్రాక్టర్లు తూతూ మంత్రంగా లైనింగ్ చేసి చేతులు దులుపుకున్నారు. పలుచోట్ల గండ్లు పడే ప్రమాదం ఉందని గతంలో అనేకసార్లు సాక్షి మీడియా హెచ్చరించింది. అయినా కూడా అధికారుల్లో చలనం లేదు. ఫలితంగా నడిగూడెం మండలంలో భారీ గండి పడింది.
Comments
Please login to add a commentAdd a comment