సాక్షి,హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన వరదల ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. భారీ వర్షాలతో రైల్వే ట్రాకులు దెబ్బతిన్నాయి. వరంగల్-మహబూబాబాద్‌లో రైల్వే ట్రాకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో రైల్వే అధికారులు సోమవారం (సెప్టెంబర్ 2) ఉదయం 96 రైళ్లను రద్దు చేశారు. వరద కారణంగా నిన్న రాత్రి రైల్వే అధికారులు 142 రైళ్లను దారి మళ్లించారు. 177 రైళ్లను రద్దు చేశారు.
భారీ వరదల కారణంగా మహబూబాబాద్ సమీపంలోని అయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగింది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గం మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ఎగువు, దిగువ రైలు మార్గాల్లో కంకర కొట్టుకుపోయింది. దీంతో రైల్వే ట్రాకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
భారీ వర్షాలతో దెబ్బతిన్న ట్రాకులను పునరుద్ధరించేందుకు రైల్వే శాఖ రంగంలోకి దిగింది.రైల్వే ట్రాకుల మరమ్మత్తుకోసం వెయ్యిమంది సిబ్బందిని దెబ్బ తిన్న ప్రాంతాలకు తరలించింది. ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు రెండు రోజులు పట్టే అవకాశం ఉండగా.. ప్రయాణికుల సౌకర్యార్ధం హైదాబాద్ విజయవాడ, వరంగల్‌లో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
Speedy restoration works in progress in the affected section due to incessant rains in Intakanne - Kesamudram Section, Secunderabad Division, Telangana. SCR Officials monitoring the restoration works camping at the affected site. pic.twitter.com/eok1XaHHgk
— South Central Railway (@SCRailwayIndia) September 1, 2024
మహబూబాబాద్‌కు దక్షిణ మధ్య రైల్వే జీఎం జీఎం
రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను అధికారులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మహబూబాబాద్‌లో ధ్వంసమైన ఇంటికన్నె-కేసముద్రం రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం జీఎం అరుణ్ కుమార్ జైన్ పరిశీలించేందుకు వెళ్లారు.
మరోవైపు ట్రాక్ పునరుద్ధరణ పనులు నిన్న మధ్యాహ్నం నుంచి కొనసాగుతున్నాయి. రైల్వే ట్రాక్‌లు దెబ్బ తినడంతో సుమారు 80కి పైగా రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే రద్దు చేసింది. రైల్ నిలయంలో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను దక్షిణ మధ్య రైల్వే జీఎం జీఎం అరుణ్ కుమార్ జైన్ పర్యవేక్షిస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సుమారు 432 రైళ్ల రద్దు
వరదల కారణంగా రైల్వే ట్రాక్‌లు దెబ్బ తిన్న ప్రాంతాల్ని ఈ రోజు ఉదయం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ట్రాక్ దెబ్బతిన్న ప్రాంతానికి వెళ్లినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్ తెలిపారు.
రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులపై సాక్షి టీవీ సీపీఆర్‌వో శ్రీధర్‌ని సంప్రదించింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ..దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సుమారు 432 పైగా రైళ్లు రద్దు చేయగా..13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు.
139 రైళ్లు దారి మళ్ళించామన్న ఆయన.. ట్రాక్ పునరుద్దరణ పనులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. రేపు సాయంత్రం వరకు రైళ్ళ పునరుద్ధరణ జరిగే అవకాశం ఉందన్నారు. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు, ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న ఆరు డివిజన్లలో పరిస్థితిపై కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment