
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) కోరింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్‌ను కలిసి ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. సీఎస్‌ను కలిసిన వారిలో ట్రెసా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నిరంజన్‌రావు తదితరులు ఉన్నారు.