![Bandi Sanjay Letter To CS Somesh Kumar for Visit Of Kaleshwaram - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/28/Bandi-Sanjay.jpg.webp?itok=7RLyZYoY)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిరోజులుగా రెండు పార్టీల నేతలు పరస్పర రాజకీయ ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. కొన్ని ఒకడుగు ముందుకేసి బండి సంజయ్ పాదయాత్రలో దాడులు కూడా చేసుకున్నారు.
కాగా, ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ చీఫ్ బండి సంజయ్.. కాళేశ్వరం పర్యటన కోసం తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌కు లేఖ రాయండి చర్చనీయాంశంగా మారింది. బండి సంజయ్ ఆదివారం సీఎస్ సోమేశ్ కుమార్‌కు లేఖ రాశారు. లేఖలో.. తమ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులు, సాగునీటి పారుదల రంగం నిపుణులతో కూడిన 30 మంది ప్రతినిధి బృందం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం అనుమతి ఇవ్వాలని సీఎస్‌ను కోరారు.
అయితే, సెప్టెంబర్ తొలి వారంలో తాము వెళ్లనున్నట్టు బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ప్రజలకు, తమకు ఉన్న పలు అనుమానాలను తమ పరిశీలన ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం పర్యటనకు బీజేపీ నేతల పర్యటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది.
ఇది కూడా చదవండి: బీజేపీ ప్రచారానికి నితిన్, మిథాలి
Comments
Please login to add a commentAdd a comment