సాక్షి, కరీంనగర్: కరీంనగర్ రైల్వేస్టేషన్ పునరుద్ధరణ పనులను ప్రధాన మంత్రి ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో కరీంనగర్‌తో పాటు పెద్దపెల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్ల రిన్నోవేషన్కు శ్రీకారం చుట్టారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రారంభించిన కార్యక్రమంలో ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం అధికారుల తీరుపై సంజయ్ మండిపడ్డారు.
ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘అధికారిక కార్యక్రమానికి అధికారులు ఎందుకు రాలేదు. ఇదేమీ రాజకీయ కార్యక్రమం కాదే...?.. రావొద్దని ఎవరైనా బెదిరించారా..? అని ప్రశ్నించారు. ఎవరొచ్చినా, రాకున్నా కేంద్ర అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తామని, కరీంనగర్ –హసన్ పర్తి రైల్వే లేన్ సాధించి తీరుతామని స్పష్టం చేశారు. కరీంనగర్ –తిరుపతి రైలును ప్రతిరోజు నడిచేలా రైల్వే మంత్రిని ఒప్పిస్తానన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రైల్వే స్టేషన్లను అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేస్తోందని.. అతి త్వరలోనే కరీంనగర్ రైల్వే స్టేషన్ ను సుందరంగా తీర్చిదిద్దబోతున్నామని చెప్పారు.
పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ కొత్త రైల్వే లేన్ నిర్మాణ పనులు 5 వేల కోట్ల రూపాయలతో కొనసాగుతున్నాయని అన్నారు. ఇప్పటికే 95.6 కిలోమీటర్ల మేరకు పనులు పూర్తవగా.. 178 కి.మీల మేర విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయి. రూ. 1374 కోట్లతో 151 కిలోమీటర్ల మేరకు మనోహరాబాద్ – కొత్తపల్లి కొత్త రైల్వే లేన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
చదవండి ఆర్టీసీ బిల్లుపై లొల్లి!.. గవర్నర్ వర్సెస్ సర్కార్‌గా సాగుతున్న వివాదం
Comments
Please login to add a commentAdd a comment