సాక్షి, హైదరాబాద్: బ్రిటన్, రష్యా, ఉక్రెయిన్, బ్రె జిల్, జర్మనీ, నెదర్లాండ్, చైనా తదితర దేశాల్లో కోవిడ్–19 మరో రూపంలో ప్రబలిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ మహమ్మారి నుంచి కా పాడేందుకు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడమే ఏకైక మార్గమని, ఈ మేరకు రాష్ట్రంలో 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కోరారు. జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో వ్యాక్సినేషన్‌ను మరింత ఉధృతంగా చేపట్టేందుకు గ్రామ/వార్డు స్థాయి ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేక బృందంలో ఆశ వర్కర్, అంగన్‌వాడీ వర్కర్, పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌ఏ సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి, ఓఎస్డీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment