టోక్యో: జపాన్ రెండో ప్రపంచ యుద్ధ బాంబులు తాజాగా కలకలం రేపుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా.. జపాన్‌లో బాంబులను జారవిడించింది. అయితే ఆ బాంబులు జపాన్‌లో ఎక్కడో చోట పేలుతూనే ఉన్నాయి.
తాజాగా అక్టోబర్ 2న సౌత్‌వెస్ట్ జపాన్‌లోని మియాజాకి విమానాశ్రయం రన్‌వే పై ఓ బాంబు పేలింది. దీంతో బాంబు పేలిన ప్రదేశంలో ఏడు మీటర్ల వెడల్పు, ఒక మీటరు లోతు భూమి ధ్వంసమైంది. బాంబు విస్పోటనంతో సమాచారం అందుకున్న ఎయిర్ పోర్ట్ అధికారులు రన్‌వేని షట్‌డౌన్ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
బాంబు విస్పోటనం అయ్యే సమయంలో రన్‌వేపై సుమారు 87కి పైగా విమానాలు ఉన్నాయి. అయినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని వెలుగులోకి వచ్చిన మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్ రన్‌వే మీద బాంబు పడిన ప్రదేశాన్ని పునర్నిర్మిస్తామని, ఆ పనులు గురువారం నాటికి పూర్తి చేస్తామని జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి యోషిమాస హయాషి తెలిపారు.
విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం
మియాజాకి విమానాశ్రయంపై బాంబు విస్పోటనంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎయిర్‌పోర్ట్ నుంచి జపాన్ నగరాలైన టోక్యో,ఒసాకా,ఫుకుయోకాతో పాటు ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిర్వహించే ప్రముఖ ఎయిర్ లైన్ దిగ్గజం జపాన్ ఎయిర్‌లైన్స్ (జేఏఎల్), ఆల్ నిప్పాన్ ఎయిర్‌లైన్స్ (ఏఎన్‌ఏ)తో పాటు ఇతర విమానాయాన సంస్థలు సర్వీసుల్ని రద్దు చేసుకున్నట్లు సమాచారం.
85ఏళ్ల క్రితం యుద్ధం
రెండో ప్రపంచం యుద్ధం జరిగింది 85ఏళ్ల అవుతుంది. అయినప్పటికీ యుద్ధ సమయంలో జపాన్‌పై అమెరికా ప్రయోగించిన బాంబులు నిత్యం ఎక్కడ ఒక చోట పేలుతూనే ఉన్నాయి. కేంద్ర రవాణ శాఖ అధికారిక లెక్కల ప్రకారం.. గతేడాది మియాజాకి విమానాశ్రయంలో 37.5 టన్నుల బరువైన 2,348 బాంబులను జపాన్ డిఫెన్స్ ఫోర్స్ నిర్విర్యం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment