ప్రపంచంలో ఇటీవలి కాలంలో సైబర్ దాడులు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అమెరికాలో ఇలాంటి ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడి సీటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయంపై సైబర్ దాడి జరిగింది. దీంతో ఇంటర్నెట్, ఫోన్, ఈ- మెయిల్ ఇతర కమ్యూనికేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్‌పోర్ట్ అధికారులు ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
సీటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయ మేనేజింగ్ డైరెక్టర్ లాన్స్ లిటిల్ మీడియాతో మాట్లాడుతూ తాము ప్రస్తుతం అత్యవసర సేవలను పునరుద్ధరించడానికి, ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు 24 గంటలూ పనిచేస్తున్నామని తెలిపారు. ఎయిర్‌పోర్ట్ అధికారులు, ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్‌ఏ), కస్టమ్స్ అండ్ సెక్యూరిటీతో సహా ఇతర ఫెడరల్ ఏజెన్సీలు ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణకు కృషి చేస్తున్నాయన్నారు.
డెల్టా, అలాస్కా ఎయిర్‌లైన్స్‌తో సహా కొన్ని విమానయాన సంస్థలు సైబర్‌ఎటాక్ కారణంగా సేవలను నిలిపివేశాయి. కాగా విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు కొన్ని సూచనలు చేశారు. ప్రయాణికులు విమానాశ్రయానికి ముందుగా చేరుకోవాలని, బోర్డింగ్ పాస్‌లు, బ్యాగ్ ట్యాగ్‌లు' పొందేందుకు విమానయాన సంస్థల మొబైల్ అప్లికేషన్‌లను ఉపయోగించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment