disrupt
-
Washington: ఎయిర్‌పోర్టుపై సైబర్ దాడి.. ప్రయాణికుల అవస్థలు
ప్రపంచంలో ఇటీవలి కాలంలో సైబర్ దాడులు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అమెరికాలో ఇలాంటి ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడి సీటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయంపై సైబర్ దాడి జరిగింది. దీంతో ఇంటర్నెట్, ఫోన్, ఈ- మెయిల్ ఇతర కమ్యూనికేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్పోర్ట్ అధికారులు ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు.సీటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయ మేనేజింగ్ డైరెక్టర్ లాన్స్ లిటిల్ మీడియాతో మాట్లాడుతూ తాము ప్రస్తుతం అత్యవసర సేవలను పునరుద్ధరించడానికి, ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు 24 గంటలూ పనిచేస్తున్నామని తెలిపారు. ఎయిర్పోర్ట్ అధికారులు, ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్ఏ), కస్టమ్స్ అండ్ సెక్యూరిటీతో సహా ఇతర ఫెడరల్ ఏజెన్సీలు ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణకు కృషి చేస్తున్నాయన్నారు.డెల్టా, అలాస్కా ఎయిర్‌లైన్స్‌తో సహా కొన్ని విమానయాన సంస్థలు సైబర్ఎటాక్ కారణంగా సేవలను నిలిపివేశాయి. కాగా విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు కొన్ని సూచనలు చేశారు. ప్రయాణికులు విమానాశ్రయానికి ముందుగా చేరుకోవాలని, బోర్డింగ్ పాస్‌లు, బ్యాగ్ ట్యాగ్లు' పొందేందుకు విమానయాన సంస్థల మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించాలని కోరారు. -
మరో సంచలనానికి రె‘ఢీ’.. రూ.500లకే ఫోన్
ముంబై: భారతీయ టెలికాం మార్కెట్లోకి సునామీలా దూసుకొచ్చిన రిలయన్స్ జియో మరో సంచలనానికి నాంది పలకనుంది. ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ సేవలతో టెలికాం దిగ్గజాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన జియో తాజాగా ఫీచర్ ఫోన్ల జాబితాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అంతేకాదు అతి చవక ధరలోఅతి త్వరలో ఫీచర్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఈ 4జీ ఫీచర్ ఫోన్ ధర తాజాగా రివీల్ అయిన నివేదికల ప్రకారం రూ. 500లుగా ఉండనుంది. దీంతో టెలికం మార్కెట్లో మరో సంచనలం సృష్టించనుంది. దేశమొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రూ.1500 ఉంటుందని అంతా భావించినప్పటికీ రూ. 500లకే అందించనుందట. 4జీ వోల్ట్ సపోర్ట్‌తో రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. 4జీ వోల్ట్ సపోర్ట్‌తో రిలయన్స్ జియో ఈ నెలలోనే ఈ ఫీచర్ ఫోన్‌ను ప్రారంభించనుంది. బ్రోకరేజ్ హెచ్ఎస్బీసీ అంచనా ప్రకారం రూ. 500 కే అందించనుంది. ఈ నెల(జూలై) 21 వ తేదీన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశంలో ఈ ఫీచర్ ఫోన్‌ను ప్రకటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతోపాటు త్వరలో ముగియనున్న ధన్ ధనా ధన్ ఆఫర్‌కు ధీటుగా మరో సరికొత్త టారిఫ్ ప్లాన్‌తో జియో కస్టమర్ల ముందుకు రానుంది. 2జీ మొబైల్ వినియోగదారులపై కన్నేసిన జియో నేరుగా 4కి మారడానికి ఈ 4జీ ఫీచర్ ఫోన్ పదునైన ఆయుధంగా వాడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అద్భుతమైన ఆఫర్, తక్కువ ధరలో ఫీచర్ ఫోన్ మేలు కలయికతో జియో మరోసారి వినియోగదారులకు ఆకట్టుకోనుందని హెచ్ఎస్బీసీ డైరెక్టర్, టెలికాం విశ్లేషకుడు రాజీవ్ శర్మ భావిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్11 న ప్రకటించిన 84 రోజుల ధన్ ధనాధన్ ఆఫర్ త్వరలో ముగియనున్నసంగతి తెలిసిందే. -
బడ్జెట్ ఫ్రెండ్లీ కూల్ ప్యాడ్ నోట్ 5 వచ్చేసింది
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ కూల్ ప్యాడ్ మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. కూల్ ప్యాడ్ నోట్ లతో మార్కెట్లో హల్ చల్ చేస్తున్న సంస్థ ఈ సిరీస్ లో ఇపుడు 'కూల్ ప్యాడ్ నోట్ 5'ను విడుదల చేసింది. ఈ 4 జీ ఎనేబుల్డ్ స్మార్ట్ ఫోన్ ధరను రూ.10,999 గా కంపెనీ నిర్ణయించింది. తక్కువ వెలుగులోకూడా మంచి ఫోటోల అనుభవాన్ని మిగిల్చే తమ తాజా డివైస్ ను అమెజాన్ ద్వారా అక్టోబర్ 18 ఓపెన్ సేల్ అందుబాటులో ఉంచినట్టు కంపెనీ తెలిపింది.భారతీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కూల్ ప్యాడ్ నోట్ 5 లాంచ్ చేయడం సంతోషంగాఉందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ లువో జాంగ్ షెంగ్ విలేకరులకు తెలిపారు. ప్రస్తుత పోటీ మార్కెట్లో అత్యధికంగా విక్రయిస్తున్న ఫోన్లలో ఇది కూడా ఒకటన్నారు. 'కూల్ ప్యాడ్ నోట్ 5' ఫీచర్లు 5.5 అంగుళాల డిస్ ప్లే క్వాల్కం ఎస్డీ 617 ఆక్టాకోర్ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ 64 జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ ఈడీ ఫ్లాష్, 13ఎంపీ వెనుక కెమెరా, విత్ ఎల్ ఈడీ ఫ్లాష్, 4010 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆకర్షణీయమైన ఫీచర్స్ తో తమ బడ్జెట్ ఫ్రెండ్లీ, పవర్ ప్యాక్డ్ డివైస్ వినియోగదారులకు ఆకట్టుకుంటుందని కూల్ ప్యాడ్ సీఈవో సయ్యద్ తాజుద్దీన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీ , బెంగళూరు, చెన్నైలలో ఆఫ్ లైన్ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం తర్వాత మరో రెండు మూడు నెలల్లోమరో 13 నగరాల్లో లాంచ్ చేయనున్నట్టుచెప్పారు. -
కేకే లైన్లలో రైళ్లకు అంతరాయం
అనంతగిరి: కొత్తవలస–కిరండోల్ (కెకెలైన్) రైలు మార్గంలో గురువారం తెల్లవారుజామున 2గంటల సమయంలో విద్యుత్ తీగలు తెగి పడడంతో రైళ్లరాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 10గంటల సేపు ఈ మార్గం గుండా రైల్లు నిలచిపోయాయి.టర్నల్ నెంబరు 19 లో గల విద్యుత్ కంటిలీవర్‌లు రెండు దెబ్బతినడంతో కిరండూల్‌నుండి విశాఖ పట్నం వస్తున్న గూడ్సురైలు అక్కడే నిలచిపోయింది.దాంతో నిలిచిన గూడ్సురైలును ప్రత్యేక ఇంజనుతో మైదాన ప్రాంతానికి తరలించి పునరుద్ధ్దరణ చర్యలను రైల్వేశాఖ ప్రారంభించింది.57బై1,3,4 కిలో మీటర్ వద్ద శంగవరపుకోట,అరుకులోయ ఒహెచ్ఇ సిబ్బంది పునరుద్ధ్దరణ చర్యలు చేపట్టి మార్గాన్ని సుగమం చేశారు.ఈ ఘటన వల్ల రైల్లు 10గంటలసేపు నిలచిపోయాయి.మధ్యాహ్నం 12 గంటల వరకు పునరుద్ధరణ పనులు సిబ్బంది చేపట్టారు. సాయంత్రం నుంచి రైళ్లు నడిచాయి. -
'అదంతే.. నేనసలే చాలా వైలెంట్'
న్యూయార్క్: తనకు హానీ కలిగించాలని ప్రయత్నించిన వ్యక్తి బహుషా ఇస్లామిక్ స్టేట్ మద్దతుదారు అయి ఉండొచ్చని డొనాల్డ్ ట్రంప్ అన్నాడు. అందుకే అతడు అలా చేసి ఉండొచ్చని అన్నాడు. డేటన్లో ట్రంప్ ప్రచార సభలో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి బారికేడ్లను దాటుకొని వేగంగా అతడివైపు దూసుకొని వచ్చాడు. ట్రంప్ పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఇది చూసి వెంటనే స్పందించిన సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. అక్కడి నుంచి తీసుకెళ్లారు. 'అతడిని జైలులో పెట్టాలి. అతడికి దేశంపట్ల ప్రేమలేదు. ఇస్లామిక్ స్టేట్ మద్దతుదారు అయ్యి ఉండొచ్చు. మన న్యాయస్థానాలు కఠినమైనవి, తెలివైనవి. అంత తేలికగా అతడ్ని వదలవని అనుకుంటున్నాను. నేను ఎందుకు ఉగ్రవాదం విషయంలో కఠినంగా ఉన్నానంటే నేనసలే చాలా వాయిలెంట్' అని ట్రంప్ అన్నాడు. ఇప్పటికే ట్రంప్ పట్ల కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత వస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య ఘర్షణ వల్ల డోనాల్డ్ ట్రంప్ తన షికాగో ప్రచార ర్యాలీని రద్దు చేసుకోగా ఇది మరో ఘటన. -
సొరంగంలో ఐదు బోగీలు.. బయట మూడు
కోల్‌కతా: కోల్‌కతా మెట్రో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దక్షిణ కోల్ కతాలో కవి సుభాష్ నుంచి బయలు దేరిన నాన్ ఏసీ మెట్రో రైలు బుధవారం ఉదయం 6.45గంటలకు బయలుదేరింది. అయితే, సాంకేతిక లోపం తలెత్తి కాసేపటికే పార్క్ స్ట్రీట్ స్టేషన్ వద్ద ఉదయం 7.20గంటలకు ఆగిపోయింది. కాగా, ఈ రైలులోని ఐదు బోగిలు సొరంగ మార్గంలో ఉండిపోగా, మరో మూడు బయటకు ఉన్నాయి. పట్టాల నుంచి మంటలు వస్తున్నట్లుగా గుర్తించి డ్రైవర్ ట్రైన్‌ను నిలిపేసినట్లు తెలిసింది. ఈఘటన జరిగిన వెంటనే ప్రయాణీకులందరిని రైల్లో నుంచి ఖాళీ చేయించారు. దీంతో కాసేపు ఆ మార్గంలోని రైలు సర్వీసులు రద్దయ్యాయి. -
వైద్య సేవల్లో అంతరాయం
వెనక్కుతగ్గని వైద్యులు, ప్రభుత్వం నేడు సామూహిక రాజీనామా చేయనున్న డాక్టర్లు తక్షణమే ఆ రాజీనామాలను ఆమోదిస్తామంటున్న సర్కార్ బ్లాక్‌మెయిల్‌కు భయపడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ సాక్షి,బెంగళూరు : అటు ప్రభుత్వం... ఇటు వైద్యుల సంఘం పట్టువిడుపులు లేకుండా ప్రవర్తిస్తుండటంతో సోమవారం నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలిగే పరి స్థితి ఏర్పడింది. రాష్ట్రం లోని ప్రభుత్వ వైద్యులందరూ సామూహిక రాజీనామాలకు సిద్ధపడుతున్నా ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడే సూచనలు కనిపిస్తున్నాయి. డిమాండ్ల సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘంలోని 4,500 మంది ప్రభుత్వ వైద్యులు నేడు సామూహిక రాజీనామాలు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మాత్రం ఇలాంటి బ్లాక్‌మెయిల్‌కు భయపడేది లేదని చెబుతోంది. అంతేకాకుం డా రాజీనామాలు చేసిన తక్షణం వాటిని ఆమోదిస్తామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి శివశైలం స్పష్టం చేస్తున్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు వీరభద్రయ్య మాట్లాడుతూ ‘సామూహిక రాజీనామాలకు పాల్పడినా ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని మరో నెల రోజులు విధులకు హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం మాత్రం వెంటనే మా రాజీనామాలను ఆమోదిస్తామని బెదిరింపు ధోరణితో మాట్లాడుతోంది. అదే గనుక జరిగితే మంగళవారం నుంచే విధులకు హాజరుకాము. తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు. ‘ప్రైవేట్’ సాయం తీసుకుంటాం ప్రభుత్వ వైద్యులు రాజీనామా చేస్తే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ప్రైవేటు వైద్యుల సహాయం తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరి శివశైలం స్పష్టం చేశారు. బెంగళూరులో మీడియాతో ఆయన ఆదివారం మాట్లాడారు. వైద్యుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి తమ శాఖ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు పట్టువిడుపులు లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తాము బెదరబోమని స్పష్టం చేశారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వైద్యుల సహాయం తీసుకుంటామని శివశైలం పేర్కొన్నారు. -
ప్రసారాలు నిలిపివేతపై రాష్ట్రపతికి ఫిర్యాదు
న్యూఢిల్లీ : లోక్‌సభ ప్రసారాలు నిలిపివేసి రాష్ట్ర విభజన బిల్లును ఆమోదింప చేయడం అప్రజాస్వామికమని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు వారు బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. ముఖ్యమైన బిల్లును సభలో ప్రవేశపెట్టినప్పుడు చర్చ సజావుగా జరిగేలా చూడాల్సిన అవసరముందన్నారు. కేవలం సుష్మాస్వరాజ్, జైపాల్‌రెడ్డి మాత్రమే చర్చలో పాల్గొని బిల్ పాస్ చేశారన్నారు. కాగా వివాదాస్పద తెలంగాణ బిల్లును మంగళవారం లోక్‌సభలో ఆమోదించటానికి సంబంధించిన కీలకమైన 90 నిమిషాల సభా కార్యక్రమాలు టీవీ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం కాలేదు. లోక్‌సభ టీవీకి ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోవటంతో ఏ చానల్లోనూ సభా కార్యక్రమాలు ప్రసారం కాలేదు. -
‘బిల్లు’పై ప్రసారాలు బంద్
-
‘బిల్లు’పై ప్రసారాలు బంద్
చర్చ మొదలవగానే టీవీ చానళ్లలో నిలిచిపోయిన ప్రత్యక్ష ప్రసారాలు తొలుత ‘సభ వాయిదా’ అంటూ లోక్‌సభ టీవీ ప్రకటన ఆ తర్వాత ‘కాసేపట్లో ప్రత్యక్ష ప్రసారాలు’ అనే సూచన ఓటింగ్, చర్చ ముగిసి 90 నిమిషాల తర్వాత సభ వాయిదా అయినా పునఃప్రారంభం కాని సభ ప్రత్యక్ష ప్రసారాలు సాంకేతిక లోపం కారణమన్న లోక్‌సభ టీవీ సీఈవో అది ‘వ్యూహాత్మక లోపం’ అంటూ సుష్మాస్వరాజ్ ధ్వజం ప్రసారాల నిలిపివేతను తప్పుపట్టిన పలు పార్టీలు న్యూఢిల్లీ: వివాదాస్పద తెలంగాణ బిల్లును లోక్‌సభలో ఆమోదించటానికి సంబంధించిన కీలకమైన 90 నిమిషాల సభా కార్యక్రమాలు టీవీ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం కాలేదు. లోక్‌సభ టీవీకి ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోవటంతో ఏ చానల్లోనూ సభా కార్యక్రమాలు ప్రసారం కాలేదు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభ తిరిగి సమావేశమయ్యాక కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే మాట్లాడటం ప్రారంభించగానే ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోయాయి. సభా కార్యక్రమాలన్నిటినీ ప్రత్యక్ష ప్రసారం చేసే లోక్‌సభ టీవీ.. ‘సభ వాయిదా పడింది’ అనే సూచనను ప్రదర్శించింది. కానీ.. వాస్తవానికి సభలో కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొంతసేపటి తర్వాత.. లోక్‌సభ టీవీలో ‘కాసేపట్లో లోక్‌సభ నుంచి ప్రత్యక్ష ప్రసారం’ అనే సూచన వచ్చింది. అయితే.. బిల్లును ఆమోదించి, 90 నిమిషాల పాటు కార్యక్రమాలు కొనసాగి.. సభ వాయిదా పడిందే కానీ.. ప్రత్యక్ష ప్రసారాలు పునఃప్రారంభం కాలేదు. 50వ గది నుంచి సిగ్నల్స్ అందలేదు: టీవీ సీఈఓ అయితే.. లోక్‌సభ టీవీ చానల్‌కు ప్రత్యక్ష ప్రసారాలను అందించే పార్లమెంటు భవనంలోని 50వ నంబరు గదిలో సంభవించిన సాంకేతిక లోపం కారణంగా ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోయాయని ఆ చానల్ సీఈఓ రాజీవ్‌మిశ్రా ఆ తర్వాత పేర్కొన్నారు. సభ తిరిగి సమావేశమయ్యాక ఒక నిమిషం పాటు ప్రసారం చేసిన తర్వాత.. ఆ గది నుంచి సిగ్నల్స్ అందలేదని.. దీంతో తాము ఫీలర్లను ప్రసారం చేయాల్సి వచ్చిందని ఆయన పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు. ‘‘అక్కడ సాంకేతిక సమస్య తలెత్తింది.. ఇక ప్రసారాలను నిలిపివేయటం మినహా మాకు ప్రత్యామ్నాయం లేకుండా పోయింది’’ అని తెలిపారు. సాంకేతిక లోపం తలెత్తిన తర్వాత తాను సాంకేతిక సిబ్బందితో అత్యవసర సమావేశం నిర్వహించానని, దీనిపై బుధవారం నాటికి తనకు నివేదిక అందుతుందని చెప్పారు. ప్రెస్ గ్యాలరీ నిండా మీడియా ఉంది: లోక్‌సభ సచివాలయం బిల్లు ఆమోదాన్ని ప్రజలు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించలేకపోవటం దురదృష్టకరమని లోక్‌సభ సచివాలయం ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. ‘‘ఈ రోజు (మంగళవారం) లోక్‌సభ మధ్యాహ్నం 3:00 గంటలకు సమావేశమైన తర్వాత.. సభా కార్యక్రమాలను సాంకేతిక సమస్యల కారణంగా లోక్‌సభ టీవీ ద్వారా ప్రత్యక్షంగా ప్రసారం చేయటం సాధ్యంకాలేదు. దీనిపై లోక్‌సభ టీవీ సీఈఓ దర్యాప్తు చేస్తున్నారు’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. లోక్‌సభలో జరిగిన పరిణామాలను ఆసాంతం వీక్షించి, నివేదించేందుకు సభలోని ప్రెస్ గ్యాలరీలో మీడియా పూర్తిస్థాయిలో హాజరై ఉందని చెప్పింది. సభా కార్యక్రమాలన్నీ నమోదు చేయటం జరిగిందని, అవి ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. కీలకమైన బిల్లుపై కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాల నిలిపివేత ప్రజా హక్కులను కాలరాయటమేనని అని విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సాంకేతిక లోపం కారణంగా లోక్‌సభ టీవీ ప్రసారాలు నిలిచిపోయాయన్న వాదనను బీజేపీ నేత, ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ కొట్టిపారేశారు. ‘‘అది సాంకేతిక లోపం కాదు కానీ.. వ్యూహాత్మక లోపం’’ అని ఆమె మంగళవారం ట్విటర్ వెబ్సైట్లో చేసిన వ్యాఖ్యల్లో అభివర్ణించారు. ఈ అంశాన్ని తాను బుధవారం స్పీకర్ వద్ద లేవనెత్తుతానని చెప్పారు. అలాగే.. తెలంగాణ బిల్లుపై మంగళవారం తాను చేసిన ప్రసంగం ఆడియో, వీడియో రికార్డులను లోక్‌సభ సచివాలయం తనకు అందించటం లేదని కూడా సుష్మా తెలిపారు. లోక్‌సభ ప్రత్యక్ష ప్రసారాల నిలిపివేత తమకు తెలియకుండా జరిగిందని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. సభా కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయటం సహించరానిదని జనతాదళ్ (యునెటైడ్) నేత శరద్‌యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి నిరసనగా ఆయనతో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ దినేశ్త్రివేదీ కూడా లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. ‘‘ప్రభుత్వం ఎందుకంత మొహం చాటేసింది? సభా కార్యక్రమాలను చూసే హక్కు, తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది’’ అని మజ్లిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుపట్టారు. -
లోక్‌సభ రణరంగం
అట్టుడికిన దిగువ సభ సమైక్యాంధ్ర నినాదాల నడుమ రైల్వే బడ్జెట్ ప్లకార్డులు చేతబూని వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన సీమాంధ్ర ఎంపీలతో పాటు వెల్‌లోకి కేంద్ర మంత్రులు కావూరి, చిరంజీవి, కోట్ల, పురందేశ్వరి.. పల్లంరాజు, కృపారాణిల సంఘీభావం సీట్లకే పరిమితమైన కిశోర్‌చంద్రదేవ్, పనబాక లోక్‌సభ సిబ్బంది వద్ద కాగితాలు చింపేసిన శివప్రసాద్.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మందా తీవ్ర వాగ్వివాదం, తోపులాటతో ఘర్షణ వాతావరణం టీ ఎంపీల రక్షణ వలయంలో 12 నిమిషాలకే ప్రసంగం ముగించిన ఖర్గే సాక్షి, న్యూఢిల్లీ: కొద్దిరోజులుగా సమైక్య, తెలంగాణ నినాదాలతో దద్దరిల్లుతున్న లోక్‌సభ బుధవారం రణరంగాన్ని తలపించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఇతర సభ్యులతో పాటు ఈ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు సైతం వెల్‌లో ఆందోళనకు దిగారు. సీమాంధ్ర టీడీపీ, తెలంగాణ ప్రాంత ఎంపీ మధ్య ఏర్పడిన ఘర్షణ వాతావరణం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో ముందెన్నడూ లేనివిధంగా రైల్వేబడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. తెలంగాణ ప్రాంత ఎంపీలు రక్షణగా నిలబడిన నేపథ్యంలో.. తీవ్ర గందరగోళం మధ్య రైల్వే మంత్రి మల్లికార్జున్ ఖర్గే సుమారు 12 నిమిషాలు బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. చివరకు మిగతా ప్రసంగ పాఠాన్ని చదివినట్టుగానే భావించాలని ప్రకటించి కూర్చుండిపోయూరు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమయ్యాక స్పీకర్ మీరాకుమార్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. అప్పటికే వైఎస్సార్సీపీ సభ్యులు, సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులు వెల్‌లో సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్నారు. దీంతో మూడు నిమిషాల్లోనే సభ 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన తర్వాత.. అవిశ్వాస తీర్మానాలపై వైఎస్సార్సీపీ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, టీడీపీ ఎంపీ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన రాయపాటి సాంబశివరావు ఇచ్చిన నోటీసులకు సంబంధించిన ప్రక్రియను సభ అదుపులో లేనందున చేపట్టలేకపోతున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత పలువురు మంత్రులు తమ శాఖలకు సంబంధించిన నివేదికలను సభ ముందుంచారు. వెల్‌లో ఉద్రిక్తత: 12.08కి రైల్వే మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారని సభాపతి ప్రకటించారు. దీంతో ఖర్గే తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డిలు వెల్‌లో ఆందోళనకు దిగారు. ‘స్టాప్ డివిజన్ ఆఫ్ ఏపీ స్టేట్’ అనే ప్లకార్డులతో నినదించారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, పురందేశ్వరి, రైల్వే సహాయమంత్రి సూర్యప్రకాశ్‌రెడ్డి సైతం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియూగాంధీ సమక్షంలోనే వెల్‌లోకి వెళ్లారు. ‘వుయ్ వాంట్ జస్టిస్’ అంటూ సీమాంధ్ర సభ్యులు నినాదాలు చేశారు. కావూరిని ఉద్దేశించి సోనియూ ‘యూ ఆర్ ఏ మినిస్టర్..’ అనడం విన్పించింది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీని ఉద్దేశించి కూడా సోనియూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాగా సీమాంధ్రకే చెందిన మంత్రులు పల్లంరాజు, కిల్లి కృపారాణి తమ స్థానాల్లో నిలబడి సంఘీభావం తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు మంత్రులు కిశోర్‌చంద్ర దేవ్, పనబాక లక్ష్మిలు మాత్రం తమ సీట్లలో నిశ్శబ్దంగా కూర్చున్నారు. కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన రాష్ట్ర ఎంపీలు రైల్వే మంత్రి బడ్జెట్ ప్రసంగానికి అడ్డుతగిలేందుకు ప్రయత్నించారు. వారినుంచి రైల్వే మంత్రికి ఇబ్బంది ఎదురవకుండా తెలంగాణ ఎంపీలు రక్షణ వలయంగా ఏర్పడ్డారు. మరోవైపు ఏఐఏడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల సభ్యులు తమ తమ రాష్ట్రాల సమస్యలపై కూడా ఇదే సమయంలో ఆందోళనకు దిగారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం, ఒకింత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎప్పుడేం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే టీడీపీ సభ్యుడు ఎన్.శివప్రసాద్ లోక్‌సభ సిబ్బంది వద్దకు వెళ్లి వారి వద్ద ఉన్న కాగితాలను చింపేశారు. పెన్నులు లాగేశారు. టీఆర్ఎస్ సభ్యుడు మందా జగన్నాథం శివప్రసాద్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఒకదశలో వారిద్దరూ పరస్పరం కలబడినంత పనిచేశారు. జేడీ(యూ) నేత శరద్‌యూదవ్, తృణమూల్ ఎంపీ సౌగత రాయ్ తదితరులు తక్షణమే స్పందించి వారికి అడ్డుగా నిలిచారు. మరోవైపు రైల్వే మంత్రి ఖర్గేకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రక్షణగా నిలిచారు. సీమాంధ్ర ఎంపీలు పదేపదే కాగితాలు చింపుతూ బడ్జెట్ ప్రతిని చదువుతున్న ఖర్గేపైకి విసిరేశారు. దీంతో కేవలం 12 నిమిషాల్లోనే రైల్వేమంత్రి తన ప్రసంగం ముగించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే సభ గురువారానికి వారుుదా పడింది. రాజ్యసభలోనూ రభస: ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే సీమాంధ్ర ఎంపీలు, ఇతర ప్రాంతాల ఎంపీలు సభాకార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తుండడంతో చైర్మన్ హమీద్ అన్సారీ సభను 12 గంటలకు వాయిదా వేయిస్తున్నట్టు ప్రకటించారు. తిరిగి ప్రారంభమయ్యాక పలువురు మంత్రులు తమ శాఖలకు సంబంధించిన నివేదికలను ప్రవేశపెట్టారు. సీమాంధ్ర ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, సీఎం రమేశ్, సుజనా చౌదరి తదితరులు ప్లకార్డులతో సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ కురియన్ సభకు కనిపించకుండా అడ్డుగా నిలుచుని సమైక్య నినాదాలు చేశారు. దీంతో ఆరు నిమిషాల్లోనే 2 గంటలకు సభ వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభమయ్యాక రైల్వే మంత్రి ఖర్గే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సభ మళ్లీ అదుపుతప్పడంతో రెండు నిమిషాల్లోనే గురువారానికి వాయిదా పడింది.