మరో సంచలనానికి రె‘ఢీ’.. రూ.500లకే ఫోన్
ముంబై: భారతీయ టెలికాం మార్కెట్‌లోకి సునామీలా దూసుకొచ్చిన రిలయన్స్ జియో మరో సంచలనానికి నాంది పలకనుంది. ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ సేవలతో టెలికాం దిగ్గజాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన జియో తాజాగా ఫీచర్ ఫోన్‌ల జాబితాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అంతేకాదు అతి చవక ధరలోఅతి త్వరలో ఫీచర్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఈ 4జీ ఫీచర్ ఫోన్ ధర తాజాగా రివీల్ అయిన నివేదికల ప్రకారం రూ. 500లుగా ఉండనుంది. దీంతో టెలికం మార్కెట్లో మరో సంచనలం సృష్టించనుంది.
దేశమొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రూ.1500 ఉంటుందని అంతా భావించినప్పటికీ రూ. 500లకే అందించనుందట. 4జీ వోల్ట్ సపోర్ట్‌తో రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. 4జీ వోల్ట్ సపోర్ట్‌తో రిలయన్స్ జియో ఈ నెలలోనే ఈ ఫీచర్ ఫోన్‌ను ప్రారంభించనుంది. బ్రోకరేజ్ హెచ్ఎస్‌బీసీ అంచనా ప్రకారం రూ. 500 కే అందించనుంది. ఈ నెల(జూలై) 21 వ తేదీన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశంలో ఈ ఫీచర్ ఫోన్‌ను ప్రకటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతోపాటు త్వరలో ముగియనున్న ధన్ ధనా ధన్ ఆఫర్‌కు ధీటుగా మరో సరికొత్త టారిఫ్ ప్లాన్‌తో జియో కస్టమర్ల ముందుకు రానుంది.
2జీ మొబైల్ వినియోగదారులపై కన్నేసిన జియో నేరుగా 4కి మారడానికి ఈ 4జీ ఫీచర్ ఫోన్ పదునైన ఆయుధంగా వాడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అద్భుతమైన ఆఫర్, తక్కువ ధరలో ఫీచర్ ఫోన్ మేలు కలయికతో జియో మరోసారి వినియోగదారులకు ఆకట్టుకోనుందని హెచ్‌ఎస్‌బీసీ డైరెక్టర్, టెలికాం విశ్లేషకుడు రాజీవ్ శర్మ భావిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్11 న ప్రకటించిన 84 రోజుల ధన్ ధనాధన్ ఆఫర్ త్వరలో ముగియనున్నసంగతి తెలిసిందే.