handset
-
మరో సంచలనానికి రె‘ఢీ’.. రూ.500లకే ఫోన్
ముంబై: భారతీయ టెలికాం మార్కెట్లోకి సునామీలా దూసుకొచ్చిన రిలయన్స్ జియో మరో సంచలనానికి నాంది పలకనుంది. ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ సేవలతో టెలికాం దిగ్గజాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన జియో తాజాగా ఫీచర్ ఫోన్ల జాబితాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అంతేకాదు అతి చవక ధరలోఅతి త్వరలో ఫీచర్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఈ 4జీ ఫీచర్ ఫోన్ ధర తాజాగా రివీల్ అయిన నివేదికల ప్రకారం రూ. 500లుగా ఉండనుంది. దీంతో టెలికం మార్కెట్లో మరో సంచనలం సృష్టించనుంది. దేశమొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రూ.1500 ఉంటుందని అంతా భావించినప్పటికీ రూ. 500లకే అందించనుందట. 4జీ వోల్ట్ సపోర్ట్‌తో రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. 4జీ వోల్ట్ సపోర్ట్‌తో రిలయన్స్ జియో ఈ నెలలోనే ఈ ఫీచర్ ఫోన్‌ను ప్రారంభించనుంది. బ్రోకరేజ్ హెచ్ఎస్బీసీ అంచనా ప్రకారం రూ. 500 కే అందించనుంది. ఈ నెల(జూలై) 21 వ తేదీన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశంలో ఈ ఫీచర్ ఫోన్‌ను ప్రకటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతోపాటు త్వరలో ముగియనున్న ధన్ ధనా ధన్ ఆఫర్‌కు ధీటుగా మరో సరికొత్త టారిఫ్ ప్లాన్‌తో జియో కస్టమర్ల ముందుకు రానుంది. 2జీ మొబైల్ వినియోగదారులపై కన్నేసిన జియో నేరుగా 4కి మారడానికి ఈ 4జీ ఫీచర్ ఫోన్ పదునైన ఆయుధంగా వాడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అద్భుతమైన ఆఫర్, తక్కువ ధరలో ఫీచర్ ఫోన్ మేలు కలయికతో జియో మరోసారి వినియోగదారులకు ఆకట్టుకోనుందని హెచ్ఎస్బీసీ డైరెక్టర్, టెలికాం విశ్లేషకుడు రాజీవ్ శర్మ భావిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్11 న ప్రకటించిన 84 రోజుల ధన్ ధనాధన్ ఆఫర్ త్వరలో ముగియనున్నసంగతి తెలిసిందే. -
రిలయన్స్ జియో నుంచి కొత్త ఫోన్
చెన్నై: ఈ ఏడాది 4 జీ సేవలను ప్రారంభించనున్న నేపథ్యంలో రిలయన్స్ జియో కొత్త రకం హ్యాండ్‌సెట్‌ను అందుబాటులోకి తేనుంది. ఎల్వైఎఫ్ విండ్ 4 పేరుతో, రూ.6,799 ధరతో కొత్త మొబైల్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ఓ ప్రకటనలో సంస్థ తెలిపింది. డ్యూయల్ సిమ్, 4,000ఎంఏహెచ్ బ్యాటరీ, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ, డీటీఎస్ టెక్నాలజీ, 5 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే,వెనుక 8 ఎంపీ, ముందు 2 ఎంపీ కెమెరా, లాంగ్ టర్మ్ వాయిస్ ఓవర్ కాలింగ్ సౌకర్యాలను అందించనుంది. రిలయన్స్ జియో ఇటీవల 4 జీ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎల్వైఎఫ్ హ్యాండ్సేట్ల ధర ప్రస్తుతం రూ. 5,599 నుంచి 19,499 గా ఉంది. -
20 అంతస్తుల ఫోన్.. జేబులో పట్టేదెలా!
బీజింగ్: నూతన ఆవిష్కరణలు చేసే విషయంలో చైనా మిగితా దేశాలకన్నా ముందుంటుందనే చెప్పాలి. ఇప్పటికే వినూత్న పద్ధతిలో భవంతులు నిర్మిస్తున్న చైనా మరోసారి చూసేవారిని అవాక్కయ్యేలా చేసింది. చూడగానే గబుక్కున తీసుకొని జేబులో వేసుకోవాలనిపించేలా తొలినాళ్లలో వచ్చిన సెల్‌ఫోన్‌లాంటి 20 అంతస్తుల భవంతిని చైనాలోని కన్మింగ్ నగరంలో నిర్మించింది. అది కూడా ఓ మహిళ చేతిలో అది ఉన్నట్లుగా. కిటికీలను సెల్ ఫోన్ కీ పాడ్ నంబర్లుగా అమర్చింది. చివరి అంచున ఎంటెనా రూపంలో ఓ పెద్ద నీళ్ల ట్యాంకులాంటి దాన్ని అమర్చారు. గతంలోనే 2014లో ఆన్ లైన్ పోల్ నిర్వహించినప్పుడు ప్రపంచంలోని అత్యంత చెత్త భవంతుల్లో ఈ భవనం టాప్ టెన్ లో చోటుదక్కించుకోగా.. తాజాగా మరోసారి సోషల్ మీడియా ద్వారా హల్ చల్ చేస్తోంది. గతంలో దీనిని చెత్త జాబితాలో చేర్చిన ఓటర్లు ఈసారి మాత్రం ఆ భవంతిని తెగ పొగిడేస్తున్నారు. దాన్ని ఎందుకు చెత్త భవంతి అంటున్నారో అర్థం కావడం లేదని, చూడగానే ఎంతో ఆకర్షించేలా దాని నిర్మాణం ఉందని అంటున్నారు. ఆసక్తికరంగా ఉన్న ఇలాంటి నిర్మాణాన్ని మళ్లీ మళ్లీ నిర్మించాలని అనిపిస్తుందని కూడా ప్రస్తుతం నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
అమ్ముడయ్యే ఫోన్లలో 98 శాతం స్మార్ట్ ఫోన్లే!
మొబైల్ ఇంటర్నెట్ వాడకం అందుబాటులోకి వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అమెరికా పరిశోధనా సంస్థ ఐజీఆర్ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. హ్యాండ్సెట్ల అమ్మకాల్లో 2020 నాటికి స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 98 శాతం ఉండే అవకాశం ఉన్నట్లు తమ అధ్యయనాల్లో తేలిందని చెబుతోంది. పలు కారణాలతో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. సాధారణ ప్రజలకు సైతం ధరలు అందుబాటులోకి రావడం స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో అభివృద్ధికి ప్రధాన కారణమని ఐజీఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇయాన్ గిల్లోట్ అంటున్నారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో వినియోగదారులు తమ జీవనశైలికి అనుగుణంగా ఉండే పోర్టబుల్, డేటా డ్రివెన్ స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్ల వైపే మొగ్గు చూపుతున్నారని గిల్లోట్ అంటున్నారు. హ్యాండ్సెట్ అమ్మకాల అభివృద్ధిలో భాగంగా 2015 సంవత్సరంలో దాదాపు 200 కోట్ల మొబైల్ హ్యాండ్ సెట్లు విక్రయించగా వాటిలో అత్యధికశాతం స్మార్ట్ ఫోన్లే ఉన్నాయని, ఈ అభివృద్ధి 2020 నాటికి మరింత పెరిగి సుమారు 98 శాతానికి చేరుకునే అవకాశం ఉందని ఐజీఆర్ గ్లోబల్ హ్యాండ్ సెట్.. స్మార్ట్ ఫోన్ సేల్స్ విభాగం చెబుతోంది. -
లెనావూ నుంచి క్వాడ్‌కోర్ ప్రాసెసర్ స్మార్ట్‌ఫోన్!
లెనావూ నుంచి వైబ్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబర్ నెలలో బెర్లిన్‌లో జరిగిన ఐఎఫ్ఏ-2013లో ప్రదర్శితం అయిన ఈ స్మార్ట్‌ఫోన్ రూ.25,999 ధరకి భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. 6.9 మిల్లీమీటర్ల థిన్నెస్తో ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ 120 గ్రాముల బరువు ఉంటుంది. క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత. ఆండ్రాయిడ్(4.2) జెల్లీబీన్ వెర్షన్‌పై పనిచేస్తుంది. 2 జీబీ ర్యామ్‌తో రేర్ సైడ్ కెమెరా 13 మెగా పిక్సెల్స్‌తో ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్స్‌తో ఉంటుంది. ఇది 16 జీబీ స్మార్ట్‌ఫోన్. డ్యూయెల్ సిమ్ మెయింటెయిన్ చేయొచ్చు. నిద్రలోకి జారితే హెచ్చరిస్తుంది..! సరికొత్త హెడ్‌సెట్‌లా కనిపిస్తున్న ఈ పరికరం పేరు ‘విగో’. ధరించినవారు నిద్రమత్తులో జోగితే హెచ్చరించడం దీని ప్రత్యేకత. డ్రైవర్లు నిద్రలోకి జారినా, తరగతి గదిలో లేదా సమావేశాల్లో ఉపన్యాసాలు వింటూ కళ్లు మూతలు పడుతున్నా ఇది హెచ్చరిస్తుంది. బ్లూటూత్ సాయంతో స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానమై పనిచేసే విగో... ఇన్ఫ్రారెడ్ సెన్సర్, యాక్సిలెరోమీటర్, ప్రత్యేక ఆల్గారిథమ్‌ల సాయంతో వ్యక్తుల కళ్లు మూసుకు పోయినా, శరీరం తూలిపోయినా, మెదడు అలసిపోయినా గుర్తించి అప్రమత్తం చేస్తుంది. మిమ్మల్ని ఎప్పుడు, ఎలా హెచ్చరించాలో.. పని మధ్యలో విరామం ఎప్పుడు తీసుకోవాలో ఇది గుర్తుచేసేందుకు కూడా స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ ద్వారా ఎంచుకోవచ్చు. చిన్నగా వైబ్రేషన్‌తో హెచ్చరించాలా..? ఎల్ఈడీ కాంతి వెలుగుతూనా..? లేక పాట పాడుతూనా..? అన్నదీ నిర్ణయించుకోవచ్చు. దీనిని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిశోధకులు తయారుచేశారు. అన్ని ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లతో పనిచేస్తుంది. దీని ధర రూ.3,600.