లెనావూ నుంచి వైబ్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబర్ నెలలో బెర్లిన్‌లో జరిగిన ఐఎఫ్‌ఏ-2013లో ప్రదర్శితం అయిన ఈ స్మార్ట్‌ఫోన్ రూ.25,999 ధరకి భారత మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. 6.9 మిల్లీమీటర్ల థిన్‌నెస్‌తో ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ 120 గ్రాముల బరువు ఉంటుంది. క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత. ఆండ్రాయిడ్(4.2) జెల్లీబీన్ వెర్షన్‌పై పనిచేస్తుంది. 2 జీబీ ర్యామ్‌తో రేర్ సైడ్ కెమెరా 13 మెగా పిక్సెల్స్‌తో ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్స్‌తో ఉంటుంది. ఇది 16 జీబీ స్మార్ట్‌ఫోన్. డ్యూయెల్ సిమ్ మెయింటెయిన్ చేయొచ్చు.
నిద్రలోకి జారితే హెచ్చరిస్తుంది..!
సరికొత్త హెడ్‌సెట్‌లా కనిపిస్తున్న ఈ పరికరం పేరు ‘విగో’. ధరించినవారు నిద్రమత్తులో జోగితే హెచ్చరించడం దీని ప్రత్యేకత. డ్రైవర్లు నిద్రలోకి జారినా, తరగతి గదిలో లేదా సమావేశాల్లో ఉపన్యాసాలు వింటూ కళ్లు మూతలు పడుతున్నా ఇది హెచ్చరిస్తుంది. బ్లూటూత్ సాయంతో స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానమై పనిచేసే విగో... ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్, యాక్సిలెరోమీటర్, ప్రత్యేక ఆల్గారిథమ్‌ల సాయంతో వ్యక్తుల కళ్లు మూసుకు పోయినా, శరీరం తూలిపోయినా, మెదడు అలసిపోయినా గుర్తించి అప్రమత్తం చేస్తుంది. మిమ్మల్ని ఎప్పుడు, ఎలా హెచ్చరించాలో.. పని మధ్యలో విరామం ఎప్పుడు తీసుకోవాలో ఇది గుర్తుచేసేందుకు కూడా స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ ద్వారా ఎంచుకోవచ్చు. చిన్నగా వైబ్రేషన్‌తో హెచ్చరించాలా..? ఎల్‌ఈడీ కాంతి వెలుగుతూనా..? లేక పాట పాడుతూనా..? అన్నదీ నిర్ణయించుకోవచ్చు. దీనిని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిశోధకులు తయారుచేశారు. అన్ని ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లతో పనిచేస్తుంది. దీని ధర రూ.3,600.
లెనావూ నుంచి క్వాడ్‌కోర్ ప్రాసెసర్ స్మార్ట్‌ఫోన్!
Published Sat, Dec 21 2013 12:09 AM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM
Advertisement