మోటోరోలా సరికొత్త ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను అందుకోబోయే ఫోన్‌ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను అందుకునే 22 మోటరోలా మొబైల్స్, ఒక లెనోవా మొబైల్ ఉంది. ఈ జాబితాలో ఉన్న ఫోన్లకు త్వరలో ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ రానుంది. అయితే సరిగ్గా ఎప్పుడు తీసుకువస్తారో అనే విషయం కంపెనీ ప్రకటించలేదు. ఈ జాబితాలో మోటరోలా రేజర్ 5జీ, మోటరోలా రేజర్ 2019, మోటరోలా ఎడ్జ్, మోటరోలా ఎడ్జ్ ప్లస్, మోటరోలా వన్ 5జీ, మోటరోలా వన్ యాక్షన్, మోటరోలా వన్ ఫ్యూజన్, మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్, మోటరోలా వన్ హైపర్, మోటరోలా వన్ విజన్, మోటో జీ 5జీ, మోటో జీ 5జీ ప్లస్, మోటో జీ 5జీ ఫాస్ట్, మోటో జీ పవర్, మోటో జీ ప్రో, మోటో జీ స్టైలస్, మోటో జీ9, మోటో జీ 9ప్లే, మోటో జీ 9ప్లస్, మోటో జీ 9పవర్, మోటో జీ8, మోటో జీ 8పవర్, లెనోవా కే 12నోట్ ఉన్నాయి. అయితే ఈ అప్‌డేట్ 2021లో రానున్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ లో భాగంగా చాట్ బబుల్స్, డివైస్ కంట్రోల్స్ ఫీచర్ రానుంది. దీంతోపాటు ప్రైవసీ సెట్టింగ్స్‌ను కూడా మెరుగుపరుచుకోవచ్చు. మైక్, కెమెరా, లొకేషన్ వంటి వాటికి వన్ టైం పర్మిషన్లను అందించవచ్చు. (చదవండి: 2020 వాట్సాప్ లో వచ్చిన బెస్ట్ ఫీచర్స్ ఇవే)
Comments
Please login to add a commentAdd a comment