న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ ఒక గ్లూ(జిగురు) అని మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) చీలకుండా కలిపి ఉంచుతున్నారని కొనియాడారు. ‘సునీతా కేజ్రీవాల్ పార్టీలో బాధ్యతలు తీసుకుంటే పార్టీని ఆమె జిగురులాగా కలిపి ఉంచుతారు. ఆప్‌ను ఇక ఎవరూ ఏం చేయలేరు.
ఆమె కుటుంబ సభ్యురాలు కావడం వల్ల సీఎం కేజ్రీవాల్‌ను ఆమె జైలులో రోజు కలిసే చాన్స్ ఉంది. దీంతో ఢిల్లీ సమస్యలను ఆమె కేజ్రీవాల్ దృష్టికి తీసుకెళుతున్నారు. కేజ్రీవాల్ ఆదేశాలను పార్టీ సభ్యులకు తెలియజేస్తున్నారు. ఆప్ కార్యకర్తలకు అరవింద్ కేజ్రీవాల్‌తో ఉన్న బంధం వల్ల వారంతా సునీతా కేజ్రీవాల్ పట్ల సానుభూతితో పనిచేస్తున్నారు’అని భరద్వాజ్ అన్నారు.
కాగా, లిక్కర్ స్కామ్ కేసులో మార్చ్22న అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయినప్పటి నుంచి ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఢిల్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇండియా కూటమి ర్యాలీలోనూ ఆమె పాల్గొన్నారు. ఎన్నోసార్లు మీడియా సమావేశాల్లో మాట్లాడారు. కేజ్రీవాల్‌కు ఏప్రిల్ 15 దాకా కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ఇదీ చదవండి.. ఎన్‌ఏఐ బృందంపై దాడిని సమర్థించిన ‘దీదీ’
Comments
Please login to add a commentAdd a comment