ఆమెను నమ్మలేదు.. ఘోరంగా ఫేయిల్‌ అయ్యాడు! | Man Sticks Cup To His Face With Gorilla Glue In Louisiana | Sakshi
Sakshi News home page

ఆమెను నమ్మలేదు.. ఘోరంగా ఫేయిల్‌ అయ్యాడు!

Published Mon, Feb 15 2021 9:11 PM | Last Updated on Mon, Feb 15 2021 9:46 PM

Man Sticks Cup To His Face With Gorilla Glue In Louisiana - Sakshi

వాషింగ్టన్‌ : తన జుట్టును అందంగా తీర్చిదిద్దటానికి గోరిల్లా గ్లూ వాడి ఆసుపత్రిపాలైన లూసియానా యువతి  టెస్సికా బ్రౌన్ విషాద కథ సోషల్‌ మీడియాలో తెగ వైరలైంది. ఎంతలా అంటే దాన్ని చదివి నమ్మని ఓ వ్యక్తి తన మీద గోరిల్లా గ్లూ ప్రయోగించుకునేంత... ఆసుపత్రిపాలయ్యేంత. వివరాల్లోకి వెళితే.. లూసియానాకు చెందిన లెన్‌ మార్టిన్‌ అనే ర్యాపర్‌ కొద్దిరోజుల క్రితం టెస్సికా బ్రౌన్‌ విషాద కథను ఇంటర్‌నెట్‌లో చదివాడు. అయితే ఆ కథను అతడు నమ్మలేదు. ఫేక్‌ అని కొట్టిపారేశాడు. గోరిల్లా గ్లూ శక్తి ఎంటో నిరూపించటానికి తనపైనే ప్రయోగానికి పూనుకున్నాడు. ( బెడిసికొట్టిన ప్లాన్‌.. ప్లీజ్‌ మీరు ఇలా చేయకండి! )

ఓ ప్లాస్టిక్‌ కప్పుకు గ్లూ అంటించి దాన్ని మూతికి అతికించుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత దాన్ని తీస్తున్నారాలేదు. తీవ్రంగా ప్రయత్నించి విఫలమై ఆసుపత్రి మెట్లెక్కాడు. అతి కష్టం మీద దాన్ని తొలిగించారు వైద్యులు. ఈ నేపథ్యంలో అతడి పెదాలపై గాయం అయింది. ఆ గాయం కనుక మానకపోతే సర్జరీ ద్వారా గాయం అయిన భాగాన్ని తొలిగించాల్సి వస్తుందని వైద్యులు సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement