
వీడియో దృశ్యాలు
లండన్ : కన్న తల్లి మీద భయంకరమైన ఫ్రాంక్ చేసి హడలు గొట్టారు ఇద్దరు యువకులు. బ్రిటన్‌లో న్యూక్లియర్ వార్ జరుగుతోందంటూ ఆమెను భయపెట్టి కన్నీళ్లు పెట్టించారు. వివరాలు.. లండన్‌కు చెందిన షాన్ పెర్రెట్‌కు టిక్‌టాక్‌లో 2,50,000 మంది ఫాలోయర్లు ఉన్నారు. షాన్ తరచూ ఫ్రాంక్ వీడియోలు చేస్తూ ఫాలోయర్లను ఆకట్టుకుంటుంటాడు. అయితే ఈ సారి కన్నతల్లి ట్రేసీ స్టెబ్బింగ్ మీద ఫ్రాంక్ చేయాలనుకున్నాడు. అందుకోసం సోదరుడు చార్లీ డెవిస్‌తో కలిసి పక్కా ప్లాన్ వేసుకున్నాడు. కొద్దిరోజుల క్రితం ట్రేసీ టీవీ చూస్తున్న సమయంలో ఉన్నట్టుండి ‘‘ బీబీసీ అలర్ట్: యూకోలో న్యూక్లియర్ వార్ జరుగుతోంది. పౌరులెవరూ బయటకు రావద్దని విజ‍్క్షప్తి. టెలిఫోన్ లైన్లన్నీ డిస్ కనెక్ట్ చేయబడ్డాయి. అన్నీ దారులు, విమానాశ్రయాలు మిలిటరీ అవసరాలకోసం మూసివేయబడ్డాయి.’’ అని టీవీ స్క్రీన్‌పై రావటం మొదలుపెట్టింది.
దీంతో ఆమె తీవ్ర భయాందోళనలకు గురైంది. ‘‘న్యూక్లియర్ యుద్ధమా? చాలా భయంగా ఉంది’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తల్లిలో చోటుచేసుకుంటున్న భావోద్వేగాలను వీడియో తీస్తున్న ఇద్దరూ లోలోపల నవ్వుకోసాగారు. ‘‘ అయితే మనం ఇంకెక్కడి కెళ్లి తలదాచుకోవాలి?’’ అంటూ ఏమీ ఎరగనట్లు తల్లిని ప్రశ్నించాడు షాన్. ఆమె భయంతో ఇంట్లోకి బయటకు తిరగసాగింది. ఆమెను మరింత భయపెట్టడం ఇష్టం లేక ఫ్రాంక్ చేసినట్లు చెప్పేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 1.4 మిలియన్ల వీక్షణలు సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment