
తిరువొత్తియూరు: అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి బాగోగులు చూసుకోలేక హత్య చేసిన కుమార్తె, ఆమె మిత్రుడిని పోలీసులు అరెస్టు చేశారు. సేలం అరసి పాళయం చిన్న గౌండర్ వీధికి చెందిన మురుగన్ టీ మాస్టర్. ఇతని భార్య కమల(40). వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కమల ఓ మిల్లులో పనిచేస్తోంది. ఈమె తండ్రి పళణిస్వామి(85) అనారోగ్యంతో బాధపడతున్నాడు. ఇతడు కమల పని చేసే పిండి మిల్లు వద్దకు వచ్చి తనను ఎవరూ చూసుకోవడం లేదని కుమార్తెను అసభ్యంగా తిట్టడంతో పాటు ఆ ప్రాంతాన్ని అపరిశుభ్రం చేస్తున్నట్టు తెలిసింది.
దీంతో విరక్తి చెందిన కమల గత శనివారం మిత్రుడు అంబాపేటకు చెందిన షణ్ముగం (40)తో కలిసి పళనిస్వామిపై పిండి బస్తా వేసి హత్య చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పల్లపట్టి పోలీసులు కేసు నమోదు చేసి కమల, షణ్ముగంను బుధవారం అరెస్టు చేశారు.