బాగ్ధాద్: ఇరాక్‌కు చెందిన 22 ఏళ్ల యూట్యూబర్ టిబా అల్ అలీ దారుణ హత్యకు గురైంది. కన్నతండ్రే ఆమెను కిరాతకంగా హతమార్చాడు. డ్రగ్స్ ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి గొంతునులుమి అంతం చేశాడు. అనంతరం స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయిందనే అవమానం భరించలేకే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
ఏం జరిగిందంటే..?
టిబ 2017లోనే ఇళ్లు వదిలి టర్కీకి వెళ్లిపోయింది. సిరియాకు చెందిన తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే జనవరిలో తన సొంత దేశం ఇరాక్ జట్టు ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు స్వదేశానికి తిరిగివచ్చింది. ఈ సమయంలోనే ఆమెను తండ్రి కిడ్నాప్ చేసి వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు.
అయితే టిబా తన తల్లితో మాట్లాడేందుకు ఒప్పుకుందని, స్నేహితురాలి ఇంట్లో ఆమెను కలిసేందుకు అంగీకరించిందని తెలుస్తోంది. కానీ తండ్రి ఆమెను బలవంతంగా కిడ్నాప్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రం వాగ్వాదం చెలరేగింది. అయితే టిబాకు తండ్రి డ్రగ్స్ ఇవ్వడంతో ఆమె కాసేపటికే సృహకోల్పోయింది. అనంతరం ఆమె నిద్రలో ఉండగానే గొంతునులిమి హత్య చేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
చదవండి: కార్చిచ్చు బీభత్సం.. వందల ఇళ్లు ధ్వంసం.. 13 మంది మృతి..
Comments
Please login to add a commentAdd a comment