కూతురి మరణవార్త విని తండ్రి గుండె ఆగింది.. | Woman killed in road mishap and father dies on getting the news | Sakshi
Sakshi News home page

కూతురి మరణవార్త విని తండ్రి గుండె ఆగింది..

Published Sun, Jan 24 2016 2:33 PM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM

కూతురి మరణవార్త విని తండ్రి గుండె ఆగింది..

కూతురి మరణవార్త విని తండ్రి గుండె ఆగింది..

లక్నో: కూతురు చనిపోయిందన్న వార్త వినగానే ఓ తండ్రి గుండె శాశ్వతంగా ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... షాలిని అనే మహిళ స్థానిక సుఖ్ పుర ప్రాంతంలో నివాసం ఉండేది. ఈ క్రమంలో తన తండ్రికి హార్ట్ అటాక్ వచ్చిందన్న సమాచారం తెలుసుకుంది. వారణాసి లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి నాథుని రామ్ ని చూసిరావాలని ఇంటిపక్కన ఉండే ఓ యువకుడు జితేంద్ర యాదవ్ తో కలిసి బైకుపై బయలుదేరింది. మార్గమధ్యలో వీరు వెళ్తోన్న బైక్ ను ఓ ట్రక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో షాలిని అక్కడికక్కడే మృతిచెందగా, జితేంద్ర స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న షాలిని తండ్రికి కూతురు మరణవార్త చెవినపడింది. తనను చూడాలని వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుసుకున్నాడు. అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న తండ్రి నాథుని రామ్(66) మరోసారి గుండెపోటు రావడంతో కన్నుమూశాడు. ఆయన నెయిబ్ ప్రాంతానికి గతంలో ఎమ్మార్వోగా విధులు నిర్వహించి పదవి విరమణ చేశారు. తండ్రి, కూతురు ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement