retired mro
-
నాగసులోచనా నన్ను క్షమించు..!.. నేను బాధపడుతూ నిన్ను మరింత..
సాక్షి, హిందూపురం: నాగసులోచనా..నన్ను క్షమించు..! నా ఆరోగ్య విషయంలో ఎన్నో ఆస్పత్రులు తిప్పావు. వెన్ను నొప్పి తగ్గలేదు. కూర్చోడానికి, కాలు కింద పెట్టడానికీ ఇబ్బందిగా ఉంది.. బతికి ఉండి పదే పదే డాక్టర్ల వద్దకు వెళ్లలేను.. నేను బాధపడుతూ నిన్ను మరింత బాధపెట్టలేను..నీకు భారమైపోతాను.. ఇలాంటి జబ్బు ఏ ఒక్కరికీ రాకూడదు.. అందుకే రెండు నెలల క్రితమే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా.. నన్ను క్షమించు..! అంటూ తన భార్యకు విశ్రాంత తహసీల్దార్ రాజశేఖర్‌శెట్టి నోట్ రాసి, తహసీల్దార్ కార్యాలయం వెనుకవైపున పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. హిందూపురం కంసాలిపేటలో నివాసం ఉంటున్న రాజశేఖర్ శెట్టి (70) రెవెన్యూశాఖలో వివిధ హోదాల్లో లేపాక్షి, హిందూపురం, మడకశిర, అమరాపురం తదితర ప్రాంతాల్లో పనిచేశాడు. పదేళ్ల క్రితం తహసీల్దార్‌గా ఉద్యోగ విరమణ చేశాడు. దీర్ఘకాలికంగా షుగరు, బ్యాక్‌బోన్, కడుపునొప్పి తదితర సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నాడు. అయినా ఫలితంలేక పోయింది. అవసాన దశలో తాను అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబ సభ్యులకు భారం కాకూడదని, బెడ్ రెస్ట్‌లో పడితే తన భార్యకు మరింత భారమవుతాననుకున్నాడు. చదవండి: (దారుణం: ఒక ఇంట్లో రెండేళ్లపాప నాన్నను ఇంకెపుడు చూడలేదు.. మరో ఇంట్లో) జీవితంపై విరక్తి చెంది సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు, అధికారులు రాజశేఖర్‌శెట్టి మృతి చెందినట్లు గుర్తించి, వన్‌టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ఇస్మాయిల్ ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య నాగసులోచన ఉన్నారు. కుమార్తె వివాహమై కర్ణాటక రాష్ట్రం కోలార్‌లో ఉంటోంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
కూతురి మరణవార్త విని తండ్రి గుండె ఆగింది..
లక్నో: కూతురు చనిపోయిందన్న వార్త వినగానే ఓ తండ్రి గుండె శాశ్వతంగా ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... షాలిని అనే మహిళ స్థానిక సుఖ్ పుర ప్రాంతంలో నివాసం ఉండేది. ఈ క్రమంలో తన తండ్రికి హార్ట్ అటాక్ వచ్చిందన్న సమాచారం తెలుసుకుంది. వారణాసి లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి నాథుని రామ్ ని చూసిరావాలని ఇంటిపక్కన ఉండే ఓ యువకుడు జితేంద్ర యాదవ్ తో కలిసి బైకుపై బయలుదేరింది. మార్గమధ్యలో వీరు వెళ్తోన్న బైక్ ను ఓ ట్రక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో షాలిని అక్కడికక్కడే మృతిచెందగా, జితేంద్ర స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న షాలిని తండ్రికి కూతురు మరణవార్త చెవినపడింది. తనను చూడాలని వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుసుకున్నాడు. అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న తండ్రి నాథుని రామ్(66) మరోసారి గుండెపోటు రావడంతో కన్నుమూశాడు. ఆయన నెయిబ్ ప్రాంతానికి గతంలో ఎమ్మార్వోగా విధులు నిర్వహించి పదవి విరమణ చేశారు. తండ్రి, కూతురు ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. -
రెవెన్యూ మాయ
కరీంనగర్ రూరల్ : రెవెన్యూ అధికారుల అక్రమాలు కొంతపుంతలు తొక్కుతున్నాయి. మనవడిని తాతగా చూపించి పహణీల్లో పేర్లు మార్చిన అధికారులు ఏకంగా ఓ రిటైర్డ్ ఎ మ్మార్వో సంతకంతో పట్టాదారు పాస్‌పుస్తకాలు కూడా జారీ చేశారు. పహణీల్లో పేరెలా మార్చారని బాధితుడు ప్రశ్నిస్తే తమ వద్ద ఎలాంటి రికార్డులు లేవని చేతులెత్తేస్తున్నారు. బాధితుడు కరీంనగర్ మండలం నగునూరుకు చెందిన సాంబశివరావు కథనం ప్రకారం... నగునూరులో జీవీ సాంబశివరావుకు వందలాది ఎకరాల భూములుండేవి. 1950లో అతడి కుమారుడు సదాశివరావుకు వారసత్వం కింద వివిధ సర్వేనంబర్లలోని 105 ఎకరాల భూమి వాటాగా వచ్చింది. అనంతరం ఈ భూములు అతడి కుమారుడు సాంబశివరావుకు ద క్కాయి. 1955 నుంచి 1997-98 వరకు పహణీల్లో సాంబశివరావు పేరే నమోదై ఉంది. అనంతరం భూముల ధరలు పెరగడం, సాంబశివరావు స్థానికం గా లేకపోవడంతో అతడి సోదరులు ఈ భూములపై కన్నేశారు. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై సర్వేనంబర్ల వారీగా తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. తాతా మనవళ్లది ఒకే పేరు తాతా మనవళ్లు పేర్లు సాంబశివరావు కావడం రెవె న్యూ అధికారులకు కలిసొచ్చింది. వారసత్వ ధ్రువీకరణ పేరిట అసలు పట్టాదారుడిని పక్కదారి పట్టిం చారు. తాత జీవీ సాంబశివరావు నుంచి తండ్రి సదాశివరావు పొందిన భూములకు వారసుడిగా మనవడు సాంబశివరావు పేరు 1998 వరకు పహణీల్లో రాగా మనవడు సాంబశివరావునే తాతగా చూపించి అతడి వారసులుగా పేర్కొంటూ సోదరుల పేర్లను అధికారులు పహణీల్లో నమోదు చేశారు. రిజిష్టర్లు లేవట.. 1955 నుంచి 1998 వరకు పహణీల్లో ఉన్న సాంబశివరావు పేరు స్థానంలో 1999, 2000, 2001 పహణీల్లో అతడి సోదరులు వీర లక్ష్మీకాంతరావు, కిషన్‌రావు, రంగారావు పేర్లను అధికారులు నమోదు చేశారు. తన పేరుకు బదులు సర్వేనంబర్లు 380 నుంచి 425, 431, 432 నుంచి 442, 443లో ఇతరుల పేర్లు ఎలా నమో దు చేశారో చెప్పాలంటూ సాంబశివరావు 2008 లో జాయింట్ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే 1998నుంచి 2000 వరకు మార్పుల రిజిష్టర్లు లభిం చడం లేదంటూ డెప్యూటీ తహశీల్దార్ సమాధానమిచ్చారు. దీంతో ఆయా సంవత్సరాల పహణీ నకళ్లు ఇవ్వాలని గతనెలలో దరఖాస్తు చేసుకో గా 1995- 96 నుంచి 2000-2001 వరకు పహణీలు, 1బీ రిజిష్టర్లు, 1ఏ రికార్డులు అందుబాటులో లేనందున జారీ చేయడం సాధ్యం కాదంటూ సమాధానమిచ్చారు. రిటైర్డు ఎమ్మార్వో సంతకంతో పాస్‌బుక్కులు పహణీల్లో అక్రమంగా పేర్లు నమోదు చేయడమే కాకుండా ఓ రిటైర్డ్ ఎమ్మార్వో సంతకంతో పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయడం అధికారుల అవినీతికి తార్కాణం. కరీంనగర్ ఎమ్మార్వోగా రాజయ్య 1996 వరకు పనిచేసి రిటైర్ కాగా, లక్ష్మీకాంతరావు, కిషన్‌రావు, రంగారావుకు రాజయ్య సంతకాలతో 2000లో పట్టాదారు పాసుపుస్తకాలు జారీ కావడం గమనార్హం. పాసుపుస్తకాలపై పట్టానంబర్ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంపై కలెక్టర్ సమగ్ర విచారణ నిర్వహించి తనకు న్యాయం చేయాలని బాధితుడు సాంబశివరావు విజ్ఞప్తి చేస్తున్నాడు.