
ఇంటి వద్ద గుమిగూడిన స్థానికులు
సాక్షి, రాజేంద్రనగర్: ఓ మైనర్ బాలిక తన ప్రియుడితో కలిసి తల్లిని ఉరివేసి చంపేసింది. నిందితులు ఇరువురు మైనర్లు కావడంతో ఈ విషయం మరింత కలచివేస్తోంది. రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం..మృతురాలు యాదమ్మ(42) తన భర్త, పిల్లలతో కలిసి చింతల్‌మెట్ సమీపంలో నివాసిస్తోంది. భర్త రోజూవారి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. వీరికి 17 ఏళ్ల కూతురు సంతానం. ఆమె 17 ఏళ్ల మైనర్ బాలుడితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ పరిచయం ఏర్పరచుకుంది. విషయం తెలుసుకున్న తల్లి ఇరువురిని మందలించింది.
చదవండి: ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ!’ శరత్‌పై దాడి
మృతి చెందిన యాదమ్మ
సోమవారం ఉదయం తల్లి ఇంట్లో ఉండగానే సదరు బాలిక ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి రప్పించింది. దాదాపు గంట పాటు ఇరువురు బాలిక తల్లితో గొడవపడి బయటకు రావడంతో అనుమానం వచ్చిన స్థానిక మహిళ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇరువుర్ని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ గంగాధర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: కాల్ రికార్డర్‌తో కన్నమేశాడు.. భార్యతో కలిసి తండ్రి ఇంట్లోనే..
Comments
Please login to add a commentAdd a comment