విజయనగరం: అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యతోపాటు కన్న కూతురు(3)పై ఓ భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ ఘటనలో కుమార్తె మృతి చెందగా, భార్య తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన మహిళను విజయనగరంలోని ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి... పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దాంతో ఎస్ కోట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ నుంచి పోలీసులు వాంగ్మూలం సేకరించారు. దెయ్యం పట్టిందని కారణంగానే తమపై భర్త దాడి చేశాడని ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. దాంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.