wife injured
-
భార్యపై భర్త యాసిడ్ దాడి
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని భాస్కర్‌రావు దిబ్బ ప్రాంతంలో భార్యపై భర్త యాసిడ్‌తో దాడిచేశాడు. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. భాస్కర్‌రావు దిబ్బలో ఉంటున్న బ్రహ్మం తన భార్య షేక్ రిజ్వానాపై యాసిడ్‌తో దాడి చేశాడు. దీంతో ఆమె ముఖం, ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పట్టణ టుటౌన్ ఎస్సై క్రాంతి సంఘటనా స్థలానికి చేరుకొని రిజ్వానాను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోర్టు ఆవరణలో దారుణం
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి కోర్టులో సోమవారం దారుణం చోటు చేసుకుంది. తనపై కేసు పెట్టిన భార్యపై భర్త దాడి చేసి కత్తితో గొంతు కోశాడు. ఘటనలో తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త నాగేందర్ పై సౌజన్య 498 కేసు పెట్టింది. కేసు విచారణ వాయిదా కోసం ఇరువురూ ఈ రోజున కోర్టుకు రాగా ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మద్యం మత్తులో భార్యకు నిప్పుపెట్టాడు
కొత్తగూడ: మద్యం మత్తులో కట్టుకున్న భార్య పై కిరోసిన్ పోసి నిప్పంటించాడో వ్యక్తి. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వేముల సుగుణ భర్త మద్యం మత్తులో ఆమెతో వాగ్వాదానికి దిగి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్ర గాయాలైన సుగుణను స్థానికులు 108 సాయంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
భార్యను రక్షించబోయి భర్త మృతి
ఖమ్మం (ఇల్లెందు) : ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం మోదుగులగూడెంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. మోదుగులగూడెం గ్రామానికి చెందిన శశిరేఖ తన ఇంటి ఆవరణలో బట్టలను ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్‌కు గురైంది. ఇది చూసిన శశిరేఖ భర్త పగిడిపల్లి రాజు(50) భార్యను రక్షించబోయి ఆమెను పట్టుకుని లాగాడు. దీంతో అతనికి కూడా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదంలో భార్యకు తీవ్రగాయాలయ్యాయి. బట్టలు ఆరవేసే తీగకు కరెంట్ సరఫరా జరగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. ఒకరి మృతి
తల్లాడ (ఖమ్మం): ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారిగూడ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తోన్న భార్యభర్తలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో భర్త అక్కడికక్కడే మృతిచెందగా, భార్యకు గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
భార్యపై కత్తితో దాడి చేసిన భర్త
ఏలూరు: పశ్చిమగోదావరి జల్లా తణుకు ఇరగవరం కాలనీలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డి... రక్తపు మడుగులో కుప్పకూలింది. అనంతరం భర్త అక్కడి నుంచి పరారైయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి... బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు గతంలో తనను వేధిస్తున్నాడంటూ భర్తపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో అతడు భార్యపై కక్ష పెంచుకున్నాడు. పోలీసులు అతడిని ఇటీవల విడిచి పెట్టారు. దీంతో అతడు భార్యపై దాడి చేశాడు. నిందితుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
కత్తిపీటతో భార్యను నరికిన భర్త
కొత్తపల్లి : ఎల్లప్పుడూ తన క్షేమం కోరే అర్ధాంగిని కత్తిపీటతో నరికి చంపబోయాడు ఓ కిరాతకుడు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం... మూలపేట గ్రామానికి చెందిన గంగాభవానీ(35) అనే మహిళను ఆమె భర్త అర్జున్ కత్తిపీట తీసుకుని మెడపై వేటు వేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. పరిస్థితి విషమంగా ఉండడంతో బాధితురాలిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. కాగా ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. -
ఇల్లు కూలి భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని వీపనగండ్ల మండలం కొప్పునూరులో మట్టితో నిర్మించిన ఇల్లు కూలి పోయింది. దాంతో ఇంట్లో నిద్రిస్తున్న భార్యభర్తలపై మట్టి పెళ్లు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో భార్త మృతి చెందాడు. భార్య తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి తీవ్రగాయాలపాలైన ఆమెను వైద్య చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వకి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
'దెయ్యం పట్టిందని మాపై దాడి చేశాడు'
-
'దెయ్యం పట్టిందని మాపై దాడి చేశాడు'
విజయనగరం: అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యతోపాటు కన్న కూతురు(3)పై ఓ భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ ఘటనలో కుమార్తె మృతి చెందగా, భార్య తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన మహిళను విజయనగరంలోని ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి... పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఎస్ కోట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ నుంచి పోలీసులు వాంగ్మూలం సేకరించారు. దెయ్యం పట్టిందని కారణంగానే తమపై భర్త దాడి చేశాడని ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. దాంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానం పెనుభూతమై..
సీతారాంపురం (పెన్‌పహాడ్), న్యూస్‌లైన్ :అనుమానం పెనుభూతమైంది. తోడునీడగా ఉంటూ జీవితాంతం కాపాడుతానని ప్రమాణం చేసి వివాహమాడిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. ఆదమరచి నిద్రిస్తున్న వేళ కర్రతో మోది దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన శని వారం తెల్లవారుజామున పెనపహాడ్ మండల కేంద్రం సీతారాంపురం కాలనీ లో చోటు చేసుకుంది. బంధువులు, పోలీ సులు తెలిపిన వివరాలు... మోతె గ్రామానికి చెందిన షేక్ సుభాన్‌బీ (45)తో సీతారాంపురానికి చెందిన షేక్ సెదైల్లికి 30 ఏళ్ల క్రితం వివాహమైంది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కి ముగ్గురు కుమారులు, మనుమలు, మనవరాండ్లు కూడా ఉన్నారు. భార్యపై అనుమానంతో షేక్‌సెదైల్లి కొన్నేళ్లుగా భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. అయితే శనివారం సెదైల్లి ఇంటికి బంధువులు వచ్చారు. వారంతా ఇంట్లో, సెదైల్లి, అతడి భార్య సుభాన్‌బీ ఆరుబయట నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి దా టిన తరువాత సెదైల్లి సెంట్రింగ్ కర్రతో భార్య తలపై బలంగా మోది పరారయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర గాయాలపాలైన సుభాన్‌బీని 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లగా సుభాన్‌బీ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఘటన స్థలాన్ని చివ్వెం ల ఎస్ఐ నర్సింహారావు పరిశీలించారు. మృతురాలి కుమారుడు నసీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ ధారవత్ జానకిరాములు తెలిపారు.