ఏలూరు: పశ్చిమగోదావరి జల్లా తణుకు ఇరగవరం కాలనీలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డి... రక్తపు మడుగులో కుప్పకూలింది. అనంతరం భర్త అక్కడి నుంచి పరారైయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి... బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు గతంలో తనను వేధిస్తున్నాడంటూ భర్తపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దాంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో అతడు భార్యపై కక్ష పెంచుకున్నాడు. పోలీసులు అతడిని ఇటీవల విడిచి పెట్టారు. దీంతో అతడు భార్యపై దాడి చేశాడు. నిందితుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.