
దాడిలో గాయపడిన కోట్యా
సాక్షి, మరిపెడ(వరంగల్): ఆస్తికోసం దారుణం చోటు చేసుకుంది. కుమారుడితో కలిసి భర్తపై భార్య దాడిచేసింది. చితకబాది ఎడమచెవిని కోశారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చింతలగడ్డ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రూప్‌సింగ్‌తండాలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. రూప్‌సింగ్‌తండాకు చెందిన గుగులోతు కోట్యా వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
అతని పేరుమీద ఉన్న మూడెకరాల భూమిని తమ పేరున చేయాలని భార్య విజయ, కుమారుడు పవన్ కొంత కాలంగా ఒత్తిడి చేస్తున్నారు. వీరిమధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. శనివారం కుమారుడి సహాయంతో భర్త కంట్లో కారం కొట్టి కత్తి, కర్రలతో దాడి చేసింది. ఎడమ చెవును కోశారు. కోట్యా భయంతో బయటకు పరుగుతీసి ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఈ విషయంపై మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో భార్య, కుమారుడిపై ఫిర్యాదు చేయగా కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చదవండి: కారాగారంలో కర్మాగారం