కొత్తపల్లి : ఎల్లప్పుడూ తన క్షేమం కోరే అర్ధాంగిని కత్తిపీటతో నరికి చంపబోయాడు ఓ కిరాతకుడు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం... మూలపేట గ్రామానికి చెందిన గంగాభవానీ(35) అనే మహిళను ఆమె భర్త అర్జున్ కత్తిపీట తీసుకుని మెడపై వేటు వేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.
పరిస్థితి విషమంగా ఉండడంతో బాధితురాలిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. కాగా ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు.